Chaina Covid: మళ్లీ చైనాను హడలెత్తిస్తున్న కరోనా.. ఒక్క రోజే రికార్డు స్థాయిలో కేసులు

Chaina Covid: గత కొద్దిరోజులుగా కరోనా పుట్టినిల్లు చైనాను హడలెత్తిస్తుంది కరోనా మహామ్మారి. గత రెండేళ్లలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు (Corona Cases) నమోదవుతున్నాయి..

Chaina Covid: మళ్లీ చైనాను హడలెత్తిస్తున్న కరోనా.. ఒక్క రోజే రికార్డు స్థాయిలో కేసులు
Corona
Image Credit source: Corona

Updated on: Apr 07, 2022 | 5:24 AM

Chaina Covid: గత కొద్దిరోజులుగా కరోనా పుట్టినిల్లు చైనాను హడలెత్తిస్తుంది కరోనా మహామ్మారి. గత రెండేళ్లలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు (Corona Cases) నమోదవుతున్నాయి. బుధవారం ఒక్కరోజే సుమారు 20 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. జీరో కోవిడ్‌ విధానం దారుణంగా విఫలమై.. చైనా (China)లో అత్యధికంగా కేసులు నమోదు అవుతున్నాయి. గత రెండేళ్లుగా విజృంభిస్తున్న కరోనా.. తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తుండటంతో భయాందోళన నెలకొంది. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా.. పూర్తి స్థాయిలో అంతం కావడం లేదు. కరోనా కట్టడికి, లాక్‌డౌన్‌, ఇతర ఆంక్షలు విధించడంతో ప్రస్తుతం అదుపులోకి వచ్చింది. కానీ మళ్లీ విజృంభిస్తుండటంతో లాక్‌డౌన్‌ నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చింది.

మళ్లీ లాక్‌డౌన్‌..

చైనాలోని అతి పెద్ద నగరం షాంఘైలోనే దాదాపు 80% మేర కరోనా కేసులు నమోదవుతున్నాయి. కేసులు భారీగా నమోదవుతుండడంతో లాక్‌డౌన్‌ పొడిగించింది అక్కడి ప్రభుత్వం. అంతర్జాతీయ ప్రయాణాల పైనా కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. పరిస్థితి చేజారిపోనివ్వకుండా ఆర్మీని సైతం రంగంలోకి దించారు అధికారులు.

అలాగే గత రెండెళ్లలో ఎప్పుడు లేనివిధంగా ఇంగ్లండ్‌లో మార్చి నుంచి కరోనా మహమ్మారీ కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. 50 ఏళ్లు పైబడిన వారిలో ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ బీఏ.2కి సంబంధించిన కేసులు నమోదవుతున్నట్లు అధికారులు గుర్తించారు. వ్యాక్సిన్‌లు తీసుకున్నప్పటికీ వ్యాధి నిరోధక శక్తి క్షీణించడంతో 55 ఏళ్ల పైబడినవారే ఈ కొత్త కరోనా వేరియంట్‌ బారిన పడుతున్నట్లు అధ్యయనం తేలింది.

అన్ని వేరియంట్లకు చెక్‌..

యాంటిజెన్ ఆధారిత వ్యాక్సిన్ తో ఒమిక్రాన్‌తో సహా అన్ని వేరియంట్లకు చెక్‌ చెప్పవచ్చని చెప్పారు ఆస్ట్రియా శాస్త్రవేత్తలు. అన్ని కరోనా వేరియంట్లపై ఈ టీకా పని చేస్తుందని అధ్యయనంలో తెలిపారు. ఇప్పటి వరకు టీకా తీసుకోని, ఎలాంటి రోగనిరోధక శక్తి లేని వ్యక్తుల్లో కూడా కరోనా వైరస్‌ను ఎదుర్కొనే సామర్థ్యం ఈ కొత్త టీకా ద్వారా లభిస్తుందన్నారు.

ఇవి కూడా చదవండి:

Russia Ukraine War: రష్యాపై అమెరికా మరో ఎత్తుగడ.. UNHRC నుంచి బయటకు పంపేందుకు ప్లాన్..

Russia Ukraine Crisis: ఉక్రెయిన్, రష్యా వివాదం ముగియాలంటే భారత్‌, చైనా చేతులు కలపాలా..?