Cheap Labour: కెనడాలో భారతీయ విద్యార్ధుల శ్రమ దోపిడీ.. 18 నెలలకే వర్క్‌ పర్మిట్లు.. ఆ తర్వాత..

|

Nov 02, 2022 | 4:54 PM

కెనడాలో శ్రమదోపిడీ పెరిగింది. విదేశీ విద్యార్ధులు స్టడీస్‌ పూర్తయిన తరువాత 18 నెలల పాటు వర్క్‌ పర్మిట్లు ఇచ్చిన ప్రభుత్వం.. దగా చేస్తోంది. పర్మినెంట్‌ రెసిడెంట్‌ హోదా లభిస్తుందన్న వాళ్లకు నిరాశే ఎదురవుతుంది.

Cheap Labour: కెనడాలో భారతీయ విద్యార్ధుల శ్రమ దోపిడీ.. 18 నెలలకే వర్క్‌ పర్మిట్లు.. ఆ తర్వాత..
Indian Students
Follow us on

కెనడాలో శ్రమదోపిడీ పెరిగింది. విదేశీ విద్యార్ధులు స్టడీస్‌ పూర్తయిన తరువాత 18 నెలల పాటు వర్క్‌ పర్మిట్లు ఇచ్చిన ప్రభుత్వం.. దగా చేస్తోంది. పర్మినెంట్‌ రెసిడెంట్‌ హోదా లభిస్తుందన్న వాళ్లకు నిరాశే ఎదురవుతుంది. ఓ వైపు వర్క్‌ పర్మిట్‌ పొడిగింపు లభించకపోగా. పని లేక విద్యార్థులు అల్లాడిపోతున్నారు. కెనడాకు వచ్చిన భారతీయ, ఫిలిప్పీన్స్‌ విద్యార్ధులు చాలా మోసపోతున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. గతంలో 18 నెలల వర్క్‌ పర్మిట్‌ లభించిన వాళ్లకు కెనడా పౌరసత్వం లభించేది. కాని ఇప్పుడు అలా జరగడం లేదు. కెనడా పౌరులతో పోలిస్తే భారతీయ విద్యార్ధులతో చాలా తక్కువ జీతాలతో పనిచేయించుకుంటున్నారు. డబ్బులు అయిపోవడంతో చాలామంది విద్యార్ధులు తమ భవిష్యత్‌పై తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఇటు స్వదేశం రాలేక, అటు కెనడాలో ఉండలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. కార్మికుల కొరత, అధిక నిరుద్యోగిత రేటు సెప్టెంబర్‌లో 5.2 శాతానికి పడిపోయిన నేపథ్యంలో, ఇమ్మిగ్రేషన్ మంత్రి సీన్ ఫ్రేజర్ కెనడాలో తీవ్రమైన కార్మికుల కొరతను తగ్గించే లక్ష్యంతో కొత్త తాత్కాలిక చర్యలను ప్రకటించారు. జస్టిన్ ట్రూడో ప్రభుత్వం కెనడాలో ఇప్పటికే 5,00,000 మంది అంతర్జాతీయ విద్యార్థులకు ఎక్కువ గంటలు పని చేయడానికి, గ్రాడ్యుయేషన్ తర్వాత 18 నెలల పాటు ఉద్యోగాన్ని పొందేందుకు అనుమతి పొడిగింపు చర్యను ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో బ్లూమ్‌బెర్గ్ కీలక నివేదికను బయటపెట్టింది.

కెనడాలోని కొంతమంది భారతీయ విద్యార్థులు ఆ దేశం తమను తక్కువ జీతానికే పనిచేసే వనరుగా ఉపయోగించుకుంటూ.. ఆ తర్వాత విస్మరిస్తున్నారని బ్లూమ్‌బెర్గ్ మంగళవారం ఒక నివేదికలో పేర్కొంది. అయితే, కెనడా ప్రభుత్వ వాదన మాత్రం వేరే విధంగా ఉంది. విదేశీ విద్యార్ధులకు తమ దేశంలో చక్కని విద్యతో పాటు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని కెనడా ప్రభుత్వం వాదిస్తోంది. 2021లో వర్క్‌ పర్మిట్‌ పూర్తయిన 40 శాతం మంది విదేశీ విద్యార్ధులకు పౌరసత్వం ఇచ్చినట్టు ప్రకటించింది. 18 నెలల పాటు తక్కువ జీతాలకు పనిచేయించుకోని చేతులెత్తేయడంపై మాత్రం ఎటువంటి వివరణ ఇవ్వడం లేదు.

కెనడాకు ప్రతి ఏటా వేలాదిమంది భారతీయ విద్యార్ధులు వెళ్తున్నారు. చదువు పూర్తయిన తరువాత అక్కడే ఉద్యోగాలు చేస్తున్నారు. ఓ దశలో అమెరికా కంటే కెనడాకు వెళ్లడానికే చాలామంది మొగ్గు చూపారు. కాని గత కొంతకాలంగా పరిస్థితులు మారుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..