Domestic Flights: ఈ ఊరిలో ప్రతి ఇంటికో విమానం.. పనులకు, పబ్బులకు ఎక్కడికెళ్లినా విమానంలోనే..

|

Feb 12, 2023 | 10:04 AM

ప్రైవేట్‌ లైఫ్‌కు అలవాటు పడ్డవాళ్లు సొంత ఇళ్లు, సొంత వాహనాలు.. ఇలా అన్నీ తమకంటూ ప్రత్యేకంగా ఉండేలా అమర్చుకుంటారు. సాధారణంగా ఎవరైనా సొంత ఇంటితోపాటు కారూ లేదంటే బైక్‌/స్కూటీ..

Domestic Flights: ఈ ఊరిలో ప్రతి ఇంటికో విమానం.. పనులకు, పబ్బులకు ఎక్కడికెళ్లినా విమానంలోనే..
Cameron Airpark
Follow us on

ప్రైవేట్‌ లైఫ్‌కు అలవాటు పడ్డవాళ్లు సొంత ఇళ్లు, సొంత వాహనాలు.. ఇలా అన్నీ తమకంటూ ప్రత్యేకంగా ఉండేలా అమర్చుకుంటారు. సాధారణంగా ఎవరైనా సొంత ఇంటితోపాటు కారూ లేదంటే బైక్‌/స్కూటీ.. మరొకొంత ముందుకు వెళ్తే బస్‌ కూడా మెయింటెన్‌ చేస్తుంటారు. ఐతే ఆ గ్రామంలో మాత్రం మరో అడుగు ముందుకేశారు. ఏకంగా ఇంటికో ప్రైవేట్‌ విమానం ఉంటుంది. మర్కెట్‌, సినిమా, రెస్టారెంట్లు, పబ్‌లు, పార్టీలు, పార్కులకు ఇలా ఎక్కడికి వెళ్లాలన్నా విమానంలోనే వెళ్తుంటారు. నమ్మబుద్ధికావడం లేదా? ఐతే మీరు ఈ విషయం తెలుసుకోవల్సిందే..

అమెరికాలోని కాలిఫోర్నియాలో కామెరాన్ ఎయిర్ పార్క్ అనే ప్రాంతం చాలా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ మొత్తం 124 గృహాలు ఉంటాయి. ప్రతి ఇంటి ముందు ఉండే గ్యారేజీలో ఓ విమానం దర్శనమిస్తుంది. ఈ ప్రాంత ప్రజలు ఎక్కడికి వెళ్లాలనుకున్నా విమానంలోనే ప్రయాణిస్తుంటారు. ప్రస్తుతం ఈ వింత నగరానికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైలర్‌ అవుతున్నాయి. మన దేశంలో రోడ్లు ఏవిధంగా ఉంటాయో.. అక్కడ ఇళ్లముందే విశాలమైన రోడ్లతో రన్‌వేలు ఉంటాయి. మరో విశేషమేమంటే ఈ ప్రాంతంలో నివసించే వారిలో చాలా మంది పైలట్లు ఉండటం గమనార్హం.  పైలట్లతో పనిలేకుండా ఎవరి విమానాలను వాళ్లే నడుపుతారు. ఈ విధమైన ఎయిర్ పార్క్‌లు అమెరికాలో దాదాపు 610 ఉన్నట్లు అంచనా. నిజానికి.. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో నిర్మించిన ఎయిర్‌ఫీల్డ్‌లను తొలగించకుండా.. వాటిని నివాస ఎయిర్ పార్కులుగా తీర్చిదిద్దారట. ఈ పార్కుల్లో ప్రస్తుతం రిటైర్డ్ సైనిక పైలట్లు నివసిస్తుంటారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తా కథనాల కోసం క్లిక్‌ చేయండి.