Cadbury Dairy Milk: కొత్త వివాదంలో క్యాడ్‌బరీ చాక్లెట్స్ .. బ్యాన్ చేయాలంటూ నెటిజన్లు రచ్చ రచ్చ

| Edited By: Surya Kala

Jul 19, 2021 | 5:55 PM

Cadbury Dairy Milk: చాక్లెట్స్ ను ఇష్టపడనివారుండరు.. సంతోషం అనిపించినా మనసు బాధపడినా .. ఇష్టమైనవారికి కానుకగా ఇవ్వడానికి ఇలా అన్ని సందర్భాల్లోనూ చాక్లెట్స్ వైపు..

Cadbury Dairy Milk: కొత్త వివాదంలో క్యాడ్‌బరీ చాక్లెట్స్ .. బ్యాన్ చేయాలంటూ నెటిజన్లు రచ్చ రచ్చ
Cadbury Dairy Milk
Follow us on

Cadbury Dairy Milk: చాక్లెట్స్ ను ఇష్టపడనివారుండరు.. సంతోషం అనిపించినా మనసు బాధపడినా .. ఇష్టమైనవారికి కానుకగా ఇవ్వడానికి ఇలా అన్ని సందర్భాల్లోనూ చాక్లెట్స్ వైపు చూస్తుంటారు.. ఇక ఈ చాక్లెట్స్ లో క్యాడ్ బరి చాక్లెట్స్ అంటే పిల్లల నుంచి పెద్దల వరకూ వయసుతో సంబంధం లేకుండా ఇష్టంగా తింటారు. అటువంటి ఈ క్యాడ్ బరి ఉత్పత్తులు వివాదాలను ఎదుర్కొంటున్నాయి. క్యాడ్‌బరీ ఉత్పత్తులను బహిష్కరించాలని భారత దేశంలోని చాలామంది ప్రజలు సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చారు. ఈ కంపెనీ చేస్తున్న ఉత్పత్తుల్లో జెలటిన్ ఉపయోగిస్తున్నారని .. అందుకు సంబంధించిన సాక్ష్యం ఇదే నంటూ వెబ్‌సైట్ నుండి తీసిన స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. క్యాడ్‌బరీ చాక్లెట్ లో ఉపయోగిస్తున్న జెలటిన్ గొడ్డు మాసం నుంచి తయారు చేసిందనే పుకారులు షికారు చేస్తున్నాయి. దీంతో ఇది నిజమా అనే సందేహం అందరిలోనూ ఏర్పడింది.

ది నిజమా? అంటూ యూకే క్యాడ్‌బరీ సంస్థని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. అంతేకాదు.. ఇదే కనుక నిజమైతే.. హలాల్ సర్టిఫైడ్ బీఫ్ ప్రొడక్ట్స్‌ను హిందువులచే బలవంతంగా తినిపించినందుకు క్యాడ్‌బరీపై కేసు పెట్టాల్సిందేనని ట్విట్ చేశాడు.. అంతేకాదు మా పూర్వీకులు, గురువులు తమ ప్రాణాలను త్యాగం చేశారే తప్ప, గొడ్డు మాంసం తినలేదు. అయితే స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పాలకుల విధానంతో మా ధర్మం ఉపేక్షిస్తూ.. ఉల్లంగిచబడుతుందని ఓ నెటిజన్ ట్విట్ చేశారు. దీంతో ఈ ట్విట్ వైరల్ అయ్యింది..బ్రిటిష్ సంస్థను బహిష్కరించాలని పిలుపునిస్తూ సోషల్ మీడియాలో ట్విట్స్ వైరల్ అవుతున్నాయి.

ఈ వివాదంపై క్యాడ్‌బరీ డైరీ మిల్క్ స్పందించింది. గొడ్డు మాసం పై క్లారిటీనిస్తూ ఓ ప్రకటన చేసింది. భారత్ లో తయారువుతున్న , అమ్ముతున్న మాండెలెజ్ / క్యాడ్‌బరీ ఉత్పత్తులు 100 శాతం వెజిటేరియన్ అని తెలిపింది. అంతేకాదు వైరల్ అవుతున్న స్క్రీన్ షాట్.. క్యాడ్‌బరీ భారతీయ ఉత్పత్తులకు సంబంధించినది కాదని తెలిపింది. క్యాడ్‌బరీ చాక్లెట్ ర్యాపర్‌పై ఉన్న ఆకుపచ్చ చుక్క శాఖాహారం అన్న విషయాన్ని సూచిస్తుందని వెల్లడించింది.

Also Read: హిందూ ధర్మంలో జన్మచేత కాదు వర్ణం.. కర్మ చేతనే..నేటికీ బ్రాహ్మణులుగా పూజించబడుతున్న బ్రాహ్మణేతరులు ..