AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశాన్ని పట్టిపీడిస్తున్న ఆడపిల్లల కొరత.. అమ్మాయిల అక్రమ రవాణా.. అందరూ కలిసి పంచుకుంటున్న దారుణం..

పెళ్లికి పెళ్లికూతురు లేని కారణంగానే డబ్బులిచ్చి అమ్మాయిలను కొంటున్నారని మీరు అనుకుంటే తప్పే. అమ్మాయిలను కొనుగోలు చేసే వ్యక్తులు తమ వ్యసనాన్ని తీర్చుకోవడానికి ఆమెను ఉపయోగించుకుంటారు. ఆండ్రీ అనే ఒక వ్యక్తి ఒక అమ్మాయిని కొన్నాడు..తన తోటి వారంతా కలిసి ఆమెపై అత్యాచారం చేస్తున్నారు. అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయం ఏంటంటే.. ఆ బాలిక చనిపోయే వరకు అత్యాచారానికి గురైంది.

దేశాన్ని పట్టిపీడిస్తున్న ఆడపిల్లల కొరత.. అమ్మాయిల అక్రమ రవాణా.. అందరూ కలిసి పంచుకుంటున్న దారుణం..
Business Of Selling Women
Jyothi Gadda
|

Updated on: Oct 20, 2023 | 1:27 PM

Share

చైనాలో ఎన్నో ఏళ్లుగా బాలికల అక్రమ రవాణా కొనసాగుతోంది. చైనాలో ఆడపిల్లలు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. పురుషులతో పోలిస్తే చైనాలో మహిళల సంఖ్య చాలా తక్కువ. దీనికి ప్రధాన కారణం చైనా నిబంధనలే. మన దేశంలాగే మన పొరుగుదేశం జనాభా పెరిగింది. జనాభా నియంత్రణ కోసం ప్రభుత్వం ఒకే బిడ్డ విధానాన్ని అమలులోకి తెచ్చింది. చాలా ఏళ్లుగా ప్రజలు ఒకే బిడ్డ విధానాన్ని అనుసరిస్తున్నారు. రెండవది, చైనీస్ ప్రజలు అమ్మాయిల కంటే అబ్బాయిలను ఎక్కువ ఇష్టపడతారు. అక్కడ ఆడ భ్రూణహత్యలు ఎక్కువగా జరిగాయి. దీంతో చైనాలో అమ్మాయిల సంఖ్య భారీగా తగ్గిపోయింది. దాంతో అక్కడ యువకులకు పెళ్లి చేసేందుకు పెళ్లికూతురు దొరకడం లేదు. దాంతో పొరుగు దేశాల నుంచి అమ్మాయిలను కొనుగోలు చేసే వ్యాపారం ప్రారంభించారు. ఈ క్రమంలోనే చైనాలో మహిళల అక్రమ రవాణా విచ్చలవిడిగా సాగుతోంది.

ఆడపిల్లల అమ్మకం..

ఈ వ్యాపారం కింద రూ.25 వేలకు పైగా చెల్లించి అమ్మాయిని కొనుగోలు చేస్తారు. పెళ్లికి పెళ్లికూతురు లేని కారణంగానే డబ్బులిచ్చి అమ్మాయిలను కొంటున్నారని మీరు అనుకుంటే తప్పే. అమ్మాయిలను కొనుగోలు చేసే చైనీయులు తమ వ్యసనాన్ని తీర్చుకోవడానికి ఆమెను ఉపయోగించుకుంటారు. ఆండ్రీ అనే ఒక వ్యక్తి ఒక అమ్మాయిని కొన్నాడు..తన తోటి వారంతా కలిసి ఆమెపై అత్యాచారం చేస్తున్నారు. అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయం ఏంటంటే.. ఆ బాలిక చనిపోయే వరకు అత్యాచారానికి గురైంది.

ఇవి కూడా చదవండి

నిజాన్ని బయటపెట్టిన ఉత్తర కొరియా అమ్మాయి:

చైనా అబ్బాయిలు విదేశాల నుంచి పేద కుటుంబాల అమ్మాయిలను కొనుగోలు చేస్తారు. ఉత్తర కొరియాకు చెందిన యెన్మీ పార్క్ అనే మహిళ ఈ చేదు నిజాన్ని వెల్లడించింది. యెన్మీని ఎవరూ బలవంతంగా చైనాకు తీసుకెళ్లలేదు. మెరుగైన, ప్రశాంతమైన జీవితాన్ని వెతుక్కుంటూ ఉత్తర కొరియా నుంచి చైనాకు పారిపోయానని యెన్మీ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఉత్తర కొరియాలో నియంత కిమ్ జోంగ్ ఉన్ పాలనలో ఉక్కిరిబిక్కిరైన యెన్మీ చైనాకు వెళ్లారు. కానీ చైనాలో జీవితం మరింత నరకం అని యెన్మీ చెప్పారు. ఉత్తర కొరియాలో కంటే చైనాలో జీవితం మెరుగ్గా ఉండాలని యెన్మీ కోరుకున్నారు. కానీ అక్కడ ఆమె మానవ అక్రమ రవాణాకు బలైపోయింది. యెన్మీ జీవితమే కాదు తన తల్లి జీవితం కూడా నాశనం అయిందని యెన్మీ చెప్పింది.

యెన్మీ తల్లి, యెన్మిని బ్రోకర్లు కొనుగోలు చేశారు. యెన్మీ 8500 రూపాయలకు విక్రయించబడింది. 25,000 రూపాయలకు అమ్ముడుపోయింది. ఆ తర్వాత చాల మంది మమ్మల్ని వాడుకున్నారని వాపోయింది. చైనాలో ఒకే బిడ్డ విధానం కారణంగా 4 లక్షల మంది పురుషులకు మహిళలు లేరు. ఈ కారణంగానే ఆడపిల్లలను కొంటున్నారని యెన్మీ తెలిపింది. ఆమె విడుదల చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..