గాల్లో అలా..అలా తేలుతూ…. జెట్ సూట్ లో ఎగిరిన బ్రిటిష్ రాయల్ నేవీ అధికారి వినూత్న ప్రయోగం, నెటిజన్లల్లో వెల్లువెత్తిన సందేహాలు

| Edited By: Phani CH

May 10, 2021 | 4:52 PM

తమ అధికారులు గాల్లో తేలుతూ రక్షణ చర్యల్లో ఎలా పాల్గొంటారో తెలుసుకునేందుకు బ్రిటిష్ రాయల్ నేవీ, రాయల్ మెరైన్స్ ప్రయోగాత్మకంగా వినూత్న టెస్ట్ నిర్వహించాయి.

గాల్లో అలా..అలా తేలుతూ.... జెట్ సూట్ లో ఎగిరిన బ్రిటిష్ రాయల్ నేవీ అధికారి  వినూత్న ప్రయోగం, నెటిజన్లల్లో వెల్లువెత్తిన సందేహాలు
British Royal Navy Tests Jet Suit That Will Let Officers Fly
Follow us on

తమ అధికారులు గాల్లో తేలుతూ రక్షణ చర్యల్లో ఎలా పాల్గొంటారో తెలుసుకునేందుకు బ్రిటిష్ రాయల్ నేవీ, రాయల్ మెరైన్స్ ప్రయోగాత్మకంగా వినూత్న టెస్ట్ నిర్వహించాయి. ప్రత్యేకమైన జెట్ సూట్ ధరించిన ఓ అధికారి బోటుపై నుంచి దూరంగా ఉన్న నౌక లోకి గాల్లో తేలుతూ ఎలా ప్రవేశించాడో వీడియోను ఈ సంస్థలు రిలీజ్ చేశాయి. బ్రిటిష్ ఏరోనాటికల్ ఇన్నోవేషన్..’గ్రావిటీ ఇండస్ట్రీస్’ ఈ జెట్ సూట్ ను తయారు చేసింది. ఇది ధరించి గంటకు 80 మైళ్ళ చొప్పున ప్రయాణించవచ్చునట. అలాగే 12 వేల అడుగుల ఎత్తుకు కూడా చేరవచ్చునట. ఈ వీడియోలో జెట్ సూట్ ధరించిన నేవీ అధికారి సముద్రంలో నీటిపై నుంచి ఎగురుతూ తమ నేవీకి చెందిన ఓ నౌక మీది డెక్ పైకి సురక్షితంగా దిగడాన్ని చూడవచ్చు. ఆయన ఏ మాత్రం బెదరకుండా తన గమనాన్ని మార్చుకోవడం కూడా గమనించవచ్చు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ముఖ్యంగా మారుమూల ప్రాంతాలకు, ఎత్తైన ప్రదేశాలకు చేరుకునేందుకు ఈ జెట్ సూట్ తోడ్పడుతుందని అంటున్నారు. దీనివల్ల బాధితులను త్వరగా కాపాడడానికి వీలవుతుందని చెబుతున్నారు.

అయితే ఇలాంటి అధికారి రెండు చేతులనూ సూట్ కి స్ట్రాప్ చేసినందువల్ల (కట్టేసినందువల్ల) బాధితులకు ఎలా సహాయం చేయగలుగుతారని కొందరు నెటిజెనులు సందేహం వ్యక్తం చేశారు. ఈ సూట్ విప్పడం కూడా కాస్త కష్టమైన పనే అని వారు నిట్టూర్చారు.కానీ ఈ టెక్నాలజీ చాలా బాగుందని, ఇది తనను ఎంతో ఇంప్రెస్ చేసిందని మరొకరు ప్రశంసించారు. ఈ జెట్ సూట్ తో సముద్రంపై నుంచి వెళ్తుండగా మధ్యలో అది పని చేయడం మానేస్తే కింద నీటిలో పడే ప్రమాదం ఉందని ఇంకొకరు=వ్యాఖ్యానించారు. . కానీ బ్రిటిష్ రాయల్ నేవీ, రాయల్ మెరైన్స్ ఈ భయాలను కొట్టి పారేశాయి. ఇది ఇంకా ప్రయోగ దశలోనే ఉందని, ఇంకా చాలా టెక్నాజీలను వాడి మరింత సురక్షితమైన జెట్ సూట్లను తయారు చేస్తామని గ్రావిటీ ఇండస్ట్రీస్ కూడా పేర్కొంది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Road Accident: సూర్య‌పేట‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఆగివున్న కారును ఢీకొట్టిన కారు.. అక్క‌డిక్క‌డే..

బెంగాల్ లో 43 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం, రాజ్ భవన్ లో నిరాడంబరంగా కార్యక్రమం, సీఎం మమత సన్నిహితులకు అందలం