Akshata Murty: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌ భార్యకు భారీ ఆదాయం.. ఎందుకంటే..?

|

Apr 15, 2023 | 9:43 AM

దిగ్గజ ఐటీ కంపెనీల్లో ఒకటిగా ఉన్న ఇన్ఫోసిస్ తన నాలుగో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. ఈ క్రమంలో కంపెనీ తన ఆదాయాల గురించిన రిపోర్టును ప్రకటించింది.

Akshata Murty: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌ భార్యకు భారీ ఆదాయం.. ఎందుకంటే..?
Rishi Sunak Akshata Murty
Follow us on

దిగ్గజ ఐటీ కంపెనీల్లో ఒకటిగా ఉన్న ఇన్ఫోసిస్ తన నాలుగో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. ఈ క్రమంలో కంపెనీ తన ఆదాయాల గురించిన రిపోర్టును ప్రకటించింది. త్రైమాసికంలో 6వేల 134 కోట్ల రూపాయల లాభాలను నమోదు చేసింది. ఈ క్రమంలో కంపెనీ షేర్ హోల్డర్లకు శుభవార్త చెప్పింది. ఒక్కో షేరుపై రూ.17.50 డివిడెండ్ చెల్లించాలని నిర్ణయించినట్లు ప్రకటించింది. అయితే కంపెనీ తీసుకున్న నిర్ణయం బ్రిటన్ ప్రధాని రిషి సునక్ భార్య అక్షత మూర్తికి భారీగా ఆదాయాన్ని తెచ్చిపెట్టనుంది. కంపెనీ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె అక్షత ఇన్ఫోసిస్ సంస్థలో 3.89 కోట్ల షేర్లను కలిగి ఉన్నారు. కంపెనీ డివిడెండ్ చెల్లింపునకు జూన్ 2, 2023ను రికార్డు తేదీగా నిర్ణయించింది. దీంతో కంపెనీ నుంచి అక్షత 68.17 కోట్ల రూపాయలను ఆదాయంగా పొందనున్నారు.

గతేడాది అక్టోబర్‌లో ప్రకటించిన ఒక్కో షేరుపై 16న్నర రూపాయలు మధ్యంతర డివిడెండ్‌తో కలిపి మొత్తం 132.4 కోట్ల రూపాయలను ఆమె డివిడెండ్ ఆదాయంగా పొందనున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్ మెుత్తంగా ఒక్కో షేరుకు 31 రూపాయలను డివిడెండ్ల రూపంలో చెల్లించింది. ఇది అక్షతకు భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..