Libya Migrant Boat: ఆకలి దేశం దాటించింది.. సముద్రం మింగేసింది.. లక్ష్యం చేరకుండానే..

ప్రాణాలు దక్కించుకునేందుకు వెళ్తుంటే.. సముద్రం కూడా వదలి పెట్టలేదు. వారిని.. వారి కష్టాన్ని మింగేసింది. దేశాలు దాటుతున్నారు.. తాజాగా జరిగిన ప్రమాదంలో 57 మంది శరణార్థులు ప్రాణాలు కోల్పోయారు. లిబియా పశ్చిమ తీర పట్టణం ఖుమ్స్...

Libya Migrant Boat: ఆకలి దేశం దాటించింది.. సముద్రం మింగేసింది.. లక్ష్యం చేరకుండానే..
Migrant Boat Capsizes Off L
Follow us

|

Updated on: Jul 27, 2021 | 12:14 PM

ప్రాణాలు దక్కించుకునేందుకు వెళ్తుంటే.. సముద్రం కూడా వదలి పెట్టలేదు. వారిని.. వారి కష్టాన్ని మింగేసింది. దేశాలు దాటుతున్నారు.. కూడు కోసం.. గూడు కోసం హద్దులు దాటి వేల కిలోమీటర్ల ప్రయాణం చేస్తున్నారు. చివరి లక్ష్యం తెలియకుండా సముద్ర ప్రయాణంలో తోచిన దిక్కుకు వెళ్తున్నారు. అయినా వారిని ప్రమాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా జరిగిన ప్రమాదంలో 57 మంది శరణార్థులు ప్రాణాలు కోల్పోయారు. లిబియా పశ్చిమ తీర పట్టణం ఖుమ్స్ నుంచి ఆదివారం పడవ ప్రయాణం మొదలు పెట్టారు.

బయలు దేరిన 24 గంటల్లో వారు ప్రయాణిస్తున్న పడవ మునిగిపోయింది. ఈ ఘటన జరిగిన సమయంలో పడవలో 75 మంది వరకు ఉన్నారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో కొద్దిపాటు జాగ్రత్తతో 18 మంది మాత్రం ఈదుకుంటూ వచ్చి సోమవారం ఒడ్డుకు చేరుకున్నారు.

నైజీరియా, ఘనా, గాంబియా దేశాలకు చెందిన వారు చనిపోయినట్లుగా తెలుస్తోంది. ఇంజిన్‌లో సాంకేతిక సమస్య కారణంగా సముద్రంలో పడవ ఆగిపోయిందని సమాచారం. ఆ తర్వాత ప్రతికూల వాతావరణ పరిస్థితులు కూడా ఇందుకు తోడవడంతో పడవ ఒక్కసారిగా బోల్తా పడింది. మృతుల్లో 18 మంది మహిళలు, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు.

యూరప్‌లో మెరుగైన జీవితం కోసం శరణార్థులు మధ్యధరా సముద్రం మీదుగా పడవల ద్వారా వలస వెళ్లడం మనం చాలా సార్లు చూశాం. మరో 500 మంది వలస వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా.. అధికారులు అడ్డుకొని లిబియాకు తరలించారు. ఇటీవల లిబియా నుంచి వలస వెళ్తున్న వారి సంఖ్య పెరిగింది.

ఈ ఏడాది తొలి 6 నెలల్లో 15 వేల మంది శరణార్థులను ఈయూ మద్దతు గల లిబియా కోస్ట్‌గార్డ్‌ అడ్డుకున్నారు. ఈ మొదటి ఆరు నెలలు సముద్రం మీదుగా వలస వెళ్తున్న అడ్డుకొని 7వేల మందికిపైగా లిబియాలోని నిర్బంధ శిబిరాలకు బలవంతంగా తరలించారు. 2011 తిరుగుబాటు తర్వాత నుంచి పడవల ద్వారా జనం యూరప్‌కు వలస వెళ్తున్నారు.

ఇది కూడా చదవండి: Tirumala Electric Buses: తిరుమల టూ తిరుపతి

ఇది కూడా చదవండి: ఎలక్ట్రికల్ బస్సులు.. కొండలపై ఎకో ఫ్రెండ్లీ ప్రయాణం

ఇది కూడా చదవండి: Petrol Diesel Price: పట్టణవాసులకు గుడ్ న్యూస్.. స్థిరంగా పెట్రో ధరలు..ఏపీలో మాత్రం..

ఇది కూడా చదవండి: Rivers overflowing: తెలుగు రాష్ట్రాల్లో నదీ జలాల ఉరుకులు.. పరుగులు.. నిండుకుండలా ప్రాజెక్టులు