Pak Boat Accident: పడవలో 100మంది పెళ్లి బృందం.. ఓవర్ లోడ్ తో పడవ బోల్తా.. 30 మంది గల్లంతు.. 19మంది మృతి

|

Jul 19, 2022 | 6:44 AM

100 మందితో కూడిన వివాహ బృందం పంజాబ్‌లోని రాజన్‌పూర్ నుండి మచ్కాకు తిరిగి వస్తుండగా

Pak Boat Accident: పడవలో 100మంది పెళ్లి బృందం.. ఓవర్ లోడ్ తో పడవ బోల్తా.. 30 మంది గల్లంతు.. 19మంది మృతి
Pak Boat Accident
Follow us on

Pak Boat Accident:పాకిస్థాన్‌లో (Pakistan) దారుణ ఘటన జరిగింది. పంజాబ్-సింధ్ సరిహద్దులో సింధు నదిలో పెళ్లి (wedding) వేడుకకు వెళ్తున్న పడవ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 30 మంది గల్లంతయ్యారు. 19 మంది మృతి చెందారు. మృతులంతా మహిళలే అని తెలుస్తోంది. వెంటనే స్థానికులు, నిపుణులైన ఈతగాళ్ళు, ఐదు అంబులెన్స్‌లు, వాటర్ రెస్క్యూ వ్యాన్‌తో సహా 30 మంది రక్షకులు సంఘటనా స్థలంలో రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. ఇప్పటి వరకూ 9మంది మృతదేహాలను వెలికితీశారు. మృతులు మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారి చెప్పారు. నీటిలో పడిపోయిన వారికోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

రహీమ్ యార్ ఖాన్‌కు దాదాపు 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న మచ్కాలో ఒకే వంశానికి చెందిన 100 మందితో సహా వివాహ బృందంలోని ఇతర సభ్యుల కోసం గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు.. పంతొమ్మిది మంది మృతదేహాలను అధికారులు బయటకు తీశారు. వారిలో.. అంతా మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. అదే విధంగా మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.

పడవలో ఓవర్‌లోడ్ తో పాటు నీటి ప్రవాహం అధిక నీటి ఉండడంతో పడవ బోల్తా పడినట్లు స్థానిక ప్రభుత్వ అధికారి చెప్పారు. కొందరు వ్యక్తులు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోగా, మరికొందరిని స్థానిక మత్స్యకారులు రక్షించారని తెలిపారు. డైవర్లు దాదాపు 90 మందిని రక్షించగలిగారు. గల్లంతైనవారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని.. మరింతగా ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. 100 మందితో కూడిన వివాహ బృందం పంజాబ్‌లోని రాజన్‌పూర్ నుండి మచ్కాకు తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై ప్రధాని షెహబాజ్ షరీఫ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాల్సిదింగా ఆదేశాలు జారీ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..