Kabul Mosque Blast: కాబూల్ మసీదులో భారీ పేలుడు.. 50 మంది దుర్మరణం..
Kabul mosque explosion: అప్ఘానిస్తాన్ రాజధాని కాబూల్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పవిత్ర రంజాన్ మాసంలో వరుస బాంబు దాడులకు తెగబడుతున్నారు. గత వారం మసీదుపై జరిగిన బాంబు దాడి
Kabul mosque explosion: అప్ఘానిస్తాన్ రాజధాని కాబూల్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పవిత్ర రంజాన్ మాసంలో వరుస బాంబు దాడులకు తెగబడుతున్నారు. గత వారం మసీదుపై జరిగిన బాంబు దాడి మరువకముందే తాజాగా మరో బాంబు దాడి జరిగింది. కాబూల్‌లోని ఖలీఫా సాహిబ్ మసీదులో మానవబాంబు పేలుడులో 50 మందికిపైగా దుర్మరణం చెందారు. మరో వందమంది వరకు తీవ్రంగా గాయపడినట్టు అక్కడి అధికారులు వెల్లడించారు. రంజాన్ మాసం చివరి శుక్రవారం కావడంతో ఖలీపా సాహిబ్ మసీదు ప్రాంతం మొత్తం రద్దీగా మారిపోయింది. ప్రార్ధనలు ముగిసిన తర్వాత ఒక్కసారిగా మసీదులో భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. బాంబు పేలుడు ధాటికి అందులో ఉన్న వారంతా చెల్లాచెదురుగా పడిపోయారు. ఎవరో ఉగ్రవాది మానవబాంబుగా మారి మసీదులోకి చొరబడి ఉంటాడని స్థానికులు చెబుతున్నారు.
కాగా.. ఈ పేలుడులో 10 మంది దుర్మరణం చెందగా, మరో 20 మంది గాయపడ్డారని అప్ఘానిస్తాన్ ఇంటీరియర్ మినిస్టర్ బిస్ముల్లా హబీబ్ తెలిపారు. కాబూల్ మానవబాంబు పేలుడు ఘటనలో ఇప్పటివరకు 66 మంది మరణించగా.. 78 మంది గాయపడ్డారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఈ మారణహోమానికి బాధ్యత వహిస్తూ.. ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. గత వారం షెరీఫ్ నగరంలోని మసీదుపై జరిగిన బాంబు దాడిలో 33 మంది వరకు మృతిచెందారు. ఈ పేలుడుకు తామే కారణమని ఐసిస్ ప్రకటించుకుంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Read: