వారిని స్వస్థలాలకు తరలించే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది.. నితీశ్ కుమార్ ప్రకటన

|

Feb 26, 2022 | 11:41 AM

ఉక్రెయిన్‌(Ukraine) లో పెరుగుతున్న ఉద్రిక్తత నేపథ్యంలో.. ఆ దేశంలో చిక్కుకున్న బిహార్(Bihar) వాసులను స్వస్థలాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి...

వారిని స్వస్థలాలకు తరలించే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది.. నితీశ్ కుమార్ ప్రకటన
Nitish
Follow us on

ఉక్రెయిన్‌(Ukraine) లో పెరుగుతున్న ఉద్రిక్తత నేపథ్యంలో.. ఆ దేశంలో చిక్కుకున్న బిహార్(Bihar) వాసులను స్వస్థలాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్(NItish Kumar) అన్నారు. విద్యార్థులను సురక్షితంగా, త్వరగా తరలించడానికి.. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రాయబార కార్యాలయాలతో సన్నిహితంగా ఉండాలని దిల్లీలోని బిహార్ రెసిడెంట్ కమిషనర్ పాల్కా సాహ్నిని ఆయన కోరారు. ఉక్రెయిన్‌లో తలెత్తుతున్న పరిస్థితులను ముఖ్యమంత్రి నితీశ్ నిశితంగా పరిశీలిస్తున్నారని, ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లు కోరుతున్నారని సమాచార, ప్రజా సంబంధాలశాఖ మంత్రి సంజయ్ ఝా తెలిపారు. ఉక్రెయిన్ నుంచి 21 మంది బిహార్ విద్యార్థులు నేడు ఢిల్లీకి చేరుకునే అవకాశముందన్నారు.

“ ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి ఆ దేశానికి ప్రత్యేక విమానాలను పంపాలని నిర్ణయించినందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాష్ట్రానికి వచ్చే వారికి బిహార్ ప్రభుత్వమే ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తుంది. ”                               – నితీశ్ కుమార్, బిహార్ ముఖ్యమంత్రి

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థులను స్వదేశానికి తరలించాలని సోషల్ మీడియా వేదికగా అభ్యర్థనలు వస్తున్నాయి. బిహార్ లోని కతిహార్ జిల్లాకు చెందిన నిషి ఝా అనే వైద్య విద్యార్థిని క్షేమంగా స్వదేశానికి చేర్చాలని.. ఆమె కుటుంబ సభ్యులు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. రష్యా బలగాలు బాంబు దాడులు కొనసాగుతున్న తరుణంలో తమ దుస్థితిని వివరించేందుకు విద్యార్థులు పలు వీడియోలు పోస్ట్ చేశారు. దాడి నుంచి తప్పించుకోవడానికి బంకర్లలో ఆశ్రయం పొందుతున్నాని వివరించారు. గోపాల్‌గంజ్‌కు చెందిన రషీద్ రిజ్వాన్, అంకిత్ కుమార్ షా ప్రతిచోటా పేలుడు శబ్దాలు వినిపిస్తున్నాయని ట్వీట్ చేశారు. కొందరు విద్యార్థులు తమకు తిండి కూడా దొరకడం లేదని ఆవేదన చెందారు.

Also Read

Multibagger stocks: లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే రూ. 2.25 లక్షల రాబడి.. భారీ రిటర్న్స్ ఇస్తున్న మల్టీబ్యాగర్‌ స్టాక్..

Cricketers Fight Video: మైదానంలో కొట్టుకున్న క్రికెటర్లు.. ఇప్పుడు నిషేధం అనుభవిస్తున్నారు.. వీడియో చూస్తే షాక్‌..!

Focus : విజయేంద్ర ప్రసాద్ చేతులమీదుగా..సుహాసిని మ‌ణిర‌త్నం ఫస్ట్ లుక్..