AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాట్సాప్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్.. ‘ఈ యాప్ నమ్మదగినది కాదు’: ఎలాన్ మస్క్

ప్రముఖ్య సోషల్ మీడియా సంస్థ మెటా ఈ సంవత్సరం ఒక అమెరికా కోర్టులో పెద్ద సామూహిక దావాకు గురైంది. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉందని వినియోగదారులను తప్పుదారి పట్టిస్తూ, రహస్యంగా ప్రైవేట్ సందేశాలకు యాక్సెస్ కల్పిస్తోందని ఆ కంపెనీపై ఆరోపణలు ఉన్నాయి. మెటా ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించినప్పటికీ, వాట్సాప్ వినియోగదారులకు సురక్షితం కాదని టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ అనడంతో ఈ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది.

వాట్సాప్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్.. 'ఈ యాప్ నమ్మదగినది కాదు': ఎలాన్ మస్క్
Elon Musk, Pavel Durov On Whatsapp
Balaraju Goud
|

Updated on: Apr 10, 2026 | 5:15 PM

Share

ప్రముఖ్య సోషల్ మీడియా సంస్థ మెటా ఈ సంవత్సరం ఒక అమెరికా కోర్టులో పెద్ద సామూహిక దావాకు గురైంది. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉందని వినియోగదారులను తప్పుదారి పట్టిస్తూ, రహస్యంగా ప్రైవేట్ సందేశాలకు యాక్సెస్ కల్పిస్తోందని ఆ కంపెనీపై ఆరోపణలు ఉన్నాయి. మెటా ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించినప్పటికీ, వాట్సాప్ వినియోగదారులకు సురక్షితం కాదని టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ అనడంతో ఈ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. ఇది మార్క్ జుకర్‌బర్గ్‌తో ఆయనకు చాలాకాలంగా ఉన్న వైరాన్ని తిరిగి రగిలించింది. మెసేజింగ్ గోప్యతపై ఒక పెద్ద చర్చకు దారి తీసింది.

న్యాయపరమైన కేసును ఎత్తిచూపుతున్న ఒక వైరల్ పోస్ట్‌కు స్పందిస్తూ, మస్క్ “వాట్సాప్‌ను నమ్మలేం” అని రాశారు. మరో పోస్ట్‌లో, మరింత సురక్షితమైన ఆడియో, వీడియో కాల్స్ కోసం తన సొంత ప్లాట్‌ఫామ్ అయిన ‘ఎక్స్‌’కు మారమని ఆయన వినియోగదారులను కోరారు. మస్క్ ఈ ప్లాట్‌ఫామ్‌ను లక్ష్యంగా చేసుకోవడం ఇది మొదటిసారి కాదు, ఆయన తరచుగా జుకర్‌బర్గ్, అతని కంపెనీ ప్లాట్‌ఫామ్‌ను విమర్శిస్తూనే, ‘ఎక్స్ చాట్’ను మరింత సురక్షితమైన, గోప్యమైన ఎంపికగా ప్రచారం చేస్తున్నారు.

ఈ వివాదం ప్రధాన అంశంలోకి వెళ్దాం. వాట్సాప్ తన ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, మూడవ పక్షాలకు ప్రైవేట్ సందేశాలను యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుందని వాట్సాప్‌పై అమెరికా కోర్టులో దాఖలైన సామూహిక పిటిషన్ ఆరోపిస్తోంది. వాట్సాప్ మాతృ సంస్థ అయిన మెటా, తన అంతర్గత వ్యవస్థల ద్వారా ఎన్‌క్రిప్షన్‌ను దాటవేయగలదని, తద్వారా సందేశాలను సమీక్షించడానికి వీలు కల్పిస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈసారి మస్క్ ఒక్కరే కాదు. వైరల్ అయిన ఒక థ్రెడ్‌లో, టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్ కూడా వాట్సాప్‌ను విమర్శించారు. ఆ యాప్ ఎన్‌క్రిప్షన్ తప్పుదోవ పట్టించేదిగా ఉండవచ్చని, అలాగే అది వినియోగదారుల డేటాను థర్డ్ పార్టీలతో పంచుకుంటోందని ఆయన ఆరోపించారు. ఈమేరకు ఆయన X అనే బ్లాగ్‌లో పేర్కొన్నారు. “వాట్సాప్ ఎన్‌క్రిప్షన్ చరిత్రలోనే అతిపెద్ద వినియోగదారుల మోసం కావచ్చు. అది చేసే వాదనలకు విరుద్ధంగా, అది సందేశాలను చదివి మూడవ పక్షాలతో పంచుకుంటుంది. టెలిగ్రామ్ ఇలా ఎప్పుడూ చేయలేదు, ఎప్పటికీ చేయదు.” అని రాసుకొచ్చారు.

టెలిగ్రామ్ డిఫాల్ట్‌గా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను అందించదని గమనించాలి. దీని ప్రామాణిక చాట్‌లు క్లౌడ్-ఆధారిత ఎన్‌క్రిప్షన్‌ను ఉపయోగిస్తాయి. అంటే సందేశాలు టెలిగ్రామ్ సర్వర్‌లలో నిల్వ చేయవు. కేవలం దీని సీక్రెట్ చాట్స్ ఫీచర్ మాత్రమే పూర్తి ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను ఉపయోగిస్తుంది. అందువల్ల దీని గోప్యతా విధానం వాట్సాప్ డిఫాల్ట్ ఎన్‌క్రిప్షన్ సిస్టమ్ కంటే గణనీయంగా భిన్నంగా, తక్కువ పటిష్టంగా ఉంటుందని టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్ పేర్కొన్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us