AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: మహిళలకు ప్రభుత్వం నుంచి సూపర్ గుడ్‌న్యూస్.. ఉచితంగా చీరల పంపిణీ.. ఎప్పుడంటే?

రాష్ట్రంలోని మహిళలకు తెలంగాణ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ప్రభుత్వం ప్రతి ఏటా అందిస్తున్న ఉచిత చీరల పంపిణీ పథకాన్ని ఈ ఏడాది కూడా కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. అయితే గతంలో మాదిరి కాకుండా ఈ సారి కొత్త రంగు, డిజైన్‌లో ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు అదే డిజైన్‌లో చీరలు తయారు చేయించాలని అధికారులకు ఆదేశించింది.

Telangana: మహిళలకు ప్రభుత్వం నుంచి సూపర్ గుడ్‌న్యూస్.. ఉచితంగా చీరల పంపిణీ.. ఎప్పుడంటే?
Telangana Free Sarees
Anand T
|

Updated on: Apr 10, 2026 | 5:40 PM

Share

ఉచిత చీరల పంపిణీ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఈ ఏడాది కూడా మహిళలకు ఉచిత చీరల పంపిణీని కొనసాగించాలని.. అయితే గతంలో మాదిరి కాకుండా ఈ ఈసారి చిలకపచ్చ రంగు, ఎరుపు జరీ డిజైన్తో కూడిన చీరలను సీఎం రేవంత్రెడ్డి ఎంపిక చేశారు. మహిళలకు ఇచ్చే అన్ని చీరలు ఇదే డిజైన్‌లో ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో సుమారు కోటి చీరల తయారీ కోసం రూ.450 కోట్లతో టెస్కోకు అధికారులు ఆర్డర్ ఇచ్చారు. సిరిసిల్ల సహా పలు జిల్లాల నేత కార్మికులకు ఈ పనులు అప్పగించనున్నారు. నవంబరు 19న ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా వీటిని పంపిణీ చేయనున్నారు.

అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నవంబరు 19న ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈ చీరల పంపిణీ పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగానే గతేడాది రాష్ట్రంలోని సుమారు 86 లక్షల మందికి చీరలను అందజేసింది. అయితే ప్రతి ఏడాది ఒకటే రంగు కాకుండా ఈ సారి మార్పులు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. దీంతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, సెర్ప్, మెప్మాల సీఈవో దివ్యాదేవరాజన్‌లు కొన్ని నమూనాలను సిద్ధం చేసి వాటిని సీఎం దృష్టికి తీసుకురాగా.. వాటిలో చిలకపచ్చ రంగు, ఎరుపు డిజైన్‌తో ఉన్న చీరలను సీఎం ఎంపిక చేశారు.

అయితే ఈ సారి పంపిణీలో విషయంలో గతంలో జరిగిన తప్పులు తలెత్తవద్దని అధికారులకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు ఒకే సారి చీరలను పంపిణీ చేయాలన్నారు. అక్టోబర్‌ నాటికి చీరల తయారీ పూర్తి చేసి నవంబర్‌లో ఇందిరాగాంధీ జయంతికి వాటిని పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మహిళలకు ప్రభుత్వం నుంచి సూపర్ గుడ్‌న్యూస్.. ఉచితంగా చీరల పంపిణీ
మహిళలకు ప్రభుత్వం నుంచి సూపర్ గుడ్‌న్యూస్.. ఉచితంగా చీరల పంపిణీ
ప్రపంచ కుబేరుల జాబితాలో అంబానీ ఏ స్థానంలో ఉన్నారో తెలుసా..?
ప్రపంచ కుబేరుల జాబితాలో అంబానీ ఏ స్థానంలో ఉన్నారో తెలుసా..?
విజయ్ ‘జన నాయగన్‌’ లీక్‌పై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి
విజయ్ ‘జన నాయగన్‌’ లీక్‌పై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి
10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య..!
10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య..!
ఏసీ 8 గంటలు ఆన్ చేసినా.. కరెంట్ బిల్లు తక్కువ రావాలంటే ఇలా చేయండి
ఏసీ 8 గంటలు ఆన్ చేసినా.. కరెంట్ బిల్లు తక్కువ రావాలంటే ఇలా చేయండి
ఫోన్‌కు వచ్చిన ట్రాఫిక్ చలానా పరిశీలించిన వ్యక్తి.. ఓపెన్ చేయగా
ఫోన్‌కు వచ్చిన ట్రాఫిక్ చలానా పరిశీలించిన వ్యక్తి.. ఓపెన్ చేయగా
తెలంగాణకు కేంద్రం భారీ కానుక.. రెండు కొత్త రైల్వే ప్రాజెక్టులు!
తెలంగాణకు కేంద్రం భారీ కానుక.. రెండు కొత్త రైల్వే ప్రాజెక్టులు!
రాసిపెట్టుకోండి..వారికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరిగే ఛాన్స్..!
రాసిపెట్టుకోండి..వారికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరిగే ఛాన్స్..!
వాట్సాప్ యాప్‌పై ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు!
వాట్సాప్ యాప్‌పై ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు!
టమాటాలతో ఎంపీ జన్మదిన వేడుకలు.. వినూత్న రీతిలో అభిమానం చాటుకున్న
టమాటాలతో ఎంపీ జన్మదిన వేడుకలు.. వినూత్న రీతిలో అభిమానం చాటుకున్న