AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యద్ధంలో అమెరికా ఓటమి..! సంచలనం రేపుతున్న చైనా చరిత్రకారుడి జోస్యం..

ప్రపంచం ఎటువైపు వెళ్తోంది..? అగ్రరాజ్యం అమెరికాకు గడ్డుకాలం మొదలైందా..? గతంలో ఆయన చెప్పినవన్నీ అక్షరాలా నిజమయ్యాయి.. అందుకే ఇప్పుడు ఆయన వేసిన మూడో అంచనా ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఆయనే చైనా నోస్ట్రాడమస్‌గా పేరుగాంచిన జియాంగ్ జుయెకిన్. ఇరాన్ గడ్డపై అమెరికా సైన్యం అడుగుపెట్టడం అంటే అది ఆత్మహత్యతో సమానమని ఆయన ఎందుకు హెచ్చరిస్తున్నారు?

యద్ధంలో అమెరికా ఓటమి..! సంచలనం రేపుతున్న చైనా చరిత్రకారుడి జోస్యం..
China Nostradamus Predicts Us Defeat In Iran War
Krishna S
|

Updated on: Apr 10, 2026 | 10:47 AM

Share

అంతర్జాతీయ రాజకీయ తెరపై ఇప్పుడు ఒక పేరు మారుమోగిపోతోంది. ఆయనే చైనాకు చెందిన ప్రముఖ చరిత్రకారుడు, రాజకీయ వ్యాఖ్యాత జియాంగ్ జుయెకిన్. ప్రపంచ దేశాల మధ్య జరుగుతున్న సంఘర్షణలపై ఆయన వేస్తున్న అంచనాలు అక్షరాలా నిజమవుతుండటంతో నెటిజన్లు ఆయన్ను చైనా నోస్ట్రాడమస్ అని పిలుచుకుంటున్నారు. తాజాగా అమెరికా-ఇరాన్ యుద్ధంపై ఆయన చేసిన విశ్లేషణ ఇప్పుడు వైట్ హౌస్ వర్గాల్లో సైతం కలకలం రేపుతోంది. జియాంగ్ జుయెకిన్ కేవలం ఒక విద్యావేత్త మాత్రమే కాదు, ప్రిడిక్టివ్ హిస్టరీ అనే ప్రసిద్ధ యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రపంచ గమనాన్ని విశ్లేషించే వ్యూహకర్త. గతంలో ఆయన చెప్పినట్లే 2024 నవంబర్ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడం, ఇరాన్-అమెరికా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడం వంటివి జరగడంతో ఆయన అంచనాలకు విపరీతమైన క్రేజ్ పెరిగింది. అమెరికా కేవలం విమానాలు, డ్రోన్లతో దాడులు చేసి యుద్ధం గెలవాలని చూస్తుంది. నేలపై ఉండి పోరాడే సైనికులను అమెరికా తక్కువగా వాడుతుంది. కేవలం గాలిలో దాడులు చేసి ఇరాన్ లాంటి దేశాన్ని లొంగదీసుకోవడం సాధ్యం కాదని, చివరికి అమెరికా సైనికులు ఇరాన్ భూభాగంలోకి అడుగుపెట్టక తప్పదని ఆయన చెబుతున్నారు. అప్పుడే అమెరికాకు అసలైన కష్టాలు మొదలవుతాయని ఆయన హెచ్చరిస్తున్నారు.

ఇరాన్ గడ్డపై అమెరికాకు సిసిలియన్ చేదు అనుభవం

చరిత్రలోని సిసిలియన్ దండయాత్రతో ప్రస్తుత పరిస్థితిని జియాంగ్ పోల్చారు. పెలోపొన్నేసియన్ యుద్ధ సమయంలో అజేయమైన ఏథెన్స్, సిసిలీపై దండెత్తి ఎలాగైతే సర్వనాశనం అయ్యిందో.. ఇరాన్‌తో యుద్ధం అమెరికాకు అలాంటి చేదు అనుభవాన్నే మిగులుస్తుందని ఆయన జోస్యం చెప్పారు. ఆయుధ సంపత్తి తక్కువగా ఉన్నప్పటికీ, యుద్ధ గమనాన్ని అమెరికా కంటే ఇరానే మెరుగ్గా నియంత్రిస్తోందని ఆయన విశ్లేషించారు. “ఎవరికి ఎక్కువ అవకాశాలు, ఫ్లెక్సిబిలిటీ ఉంటాయో వారే పోరాటంలో గెలుస్తారు” అన్నది ఆయన సిద్ధాంతం. టెహ్రాన్ తన ప్రతిస్పందనల్లో అత్యంత కచ్చితత్వంతో వ్యవహరిస్తూ అమెరికాను ఉచ్చులోకి లాగుతోందని ఆయన భావిస్తున్నారు.

ట్రంప్ పరిస్థితి ఏంటి..?

ఇరాన్ నాగరికతను అంతం చేస్తానని ప్రగల్భాలు పలికిన డొనాల్డ్ ట్రంప్.. చివరికి రెండు వారాల కాల్పుల విరమణకు అంగీకరించడం జియాంగ్ అంచనాలను నిజం చేసింది. అయితే కేవలం గాలిలో దాడులు చేయడం వల్ల యుద్ధం ముగియదని, అమెరికా సైనికులు ఇరాన్ భూభాగంపై అడుగు పెట్టక తప్పదని, అదే అమెరికా పతనానికి నాంది పలుకుతుందని ఆయన అంటున్నారు.

జియాంగ్ వేసిన మూడు పెద్ద అంచనాలు

జియాంగ్ తన విద్యార్థులకు చెప్పిన మూడు ప్రధాన అంశాలు ఇప్పుడు ప్రపంచం ముందు ఉన్నాయి..

  • నవంబర్ ఎన్నికల్లో ట్రంప్ విజయం
  • అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం
  • ఈ యుద్ధంలో అమెరికా ఓటమి

ఒకవేళ జియాంగ్ అంచనా నిజమై అమెరికా ఈ యుద్ధంలో ఓడిపోతే, అది కేవలం ఒక దేశం ఓటమి మాత్రమే కాదు.. ప్రపంచ రాజకీయాల్లో అమెరికా అగ్రరాజ్య హోదాను శాశ్వతంగా కోల్పోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Follow Us