Viral Video: సమ్మర్ వచ్చిందని ఏసీ సర్వీస్ చేయిద్దామనుకున్నాడు.. టెక్నీషియన్ వచ్చి ఓపెన్ చేయగా..
సమ్మర్ వచ్చింది ఇక అందరూ.. ఇళ్లలో మూలన్న ఉన్న ఏసీలకు పని చెప్పడం స్టార్ట్ చేస్తారు. ఈ క్రమంలోనే వాటిని సర్వింగ్ చేయించాలని అనుకుంటారు. ఇలానే తన ఇంట్లో ఉన్న ఏసీనికి సర్విస్ చేయిద్దామనుకున్న టెక్నీషియన్‌ను ఇంటికి పలిచిన ఓ వ్యక్తి ఊహించని పరిణామం ఎదురైంది. ఏసీని ఓపెన్ చేయగానే అందులో ఓ ఎలుకల సామ్రాజయ్యమే కనిపించింది. అది చూసిన టెక్నీషియన్, ఓనర్ ఒక్కసారిగా అవాక్కయ్యారు.

ఏసీని సర్విస్ చేయిద్దామని ఓపెన్ చేయగా అందులోంచి ఎలుకలు బయటకొచ్చిన ఘటన దిల్లీలో వెలుగు చూసింది. ఎన్‌సీఆర్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి తన ఏసీని సర్వీసింగ్ చేయించాలని మెకానిక్‌ను పిలిచారు. మెకానిక్ వచ్చి గోడకు ఉన్న ఏసీని క్లీన్ చేసేందుకు ఓపెన్ చేశాడు. అంతే లోపల స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్న ఓ భారీ ఎలుక ఒక్కసారిగా బయటకు వచ్చింది.దీంతో ఆ టెక్నీషియన్‌తో పాటు ఓనర్ కూడా భయంతో అక్కడి నుంచి బయటకు పరుగులు తీశారు. చలికాలం అంతా ఏసీ వాడకపోవడంతోనే లోపల ఒక భారీ ఎలుక తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తోంది.
ChapraZila అనే హ్యాండిల్ షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు ఈ వీడియోను లక్షలాది మంది దీనిని వీక్షించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఏసీ ఇన్‌స్టాలేషన్ చేసే సమయంలో గోడకు చేసే రంధ్రం సరిగ్గా సీల్ చేయకపోవడం వల్లే ఎలుకలు లోపలికి చేరుతాయని కొందరు కామెంట్ చేయగా.. చలికాలం అంతా ఏసీని పట్టించుకోకుండా వదిలేయడం వల్ల ఇలా జరుగుతుందని మరికొందరు కామెంట్ చేశారు.
వీడియో చూడండి..
इस AC का मालिक कितना लापरवाह आदमी होगा। pic.twitter.com/GAqJc4pfAq
— छपरा जिला 🇮🇳 (@ChapraZila) April 6, 2026
సమ్మర్‌లో ఏసీ వాడే ముందు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- వేసవిలో ఏసీని వాడటం ప్రారంభించే ముందు ఈ క్రింది విషయాలను తప్పక గుర్తుంచుకోండి
- ఇన్‌స్టాలేషన్ సమయంలో పైపు బయటకు వెళ్లే రంధ్రం పూర్తిగా సిమెంట్‌తో క్లోజ్ చేశారో లేదో చూడండి.
- ఏసీ డ్రైనేజీ పైపు నుండి కూడా చిన్న చిన్న పురుగులు లేదా ఎలుకలు లోపలికి వచ్చే అవకాశం ఉంది. దానికి నెట్ వంటిది అమర్చడం మంచిది.
- సీజన్ ప్రారంభంలో ఏసీని ఆన్ చేసే ముందు సర్వీసింగ్ చేయించండి, ఇలా చేయడం ద్వారా లోపల ఉన్న డస్ట్ లేదా పక్షులు, ఎలుకల గూళ్లు ఉంటే క్లీన్ అవుతాయి.
- వైర్లను ఎలుకలు కొరికేస్తే షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి వైరింగ్‌ను కూడా ఒకసారి పరిశీలించండి.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
