AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఛీ.. వ్యూస్ కోసం మరీ ఇంత దిగజారాలా? ఈ ఇన్‌ఫ్లుయెన్సర్ ఏం చేశాడో చూడండి

రోజురోజుకూ జనాల్లో సోషల్ మీడియా పిచ్చి పెరిగిపోతుంది. ఫేమస్ అవ్వడం, వ్యూస్‌ కోసం కొంతమంది ప్రమాదకర స్టంట్స్ చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటే.. మరికొందరు సిగ్గు విడిచి జుగుప్సాకరమైన పనులకు చేస్తున్నారు. తాజాగా వ్యూస్‌ కోసం ఓ సోషల్ మీడియాలో ఇన్‌ఫ్లుయెన్సర్ చేసిన పని ప్రస్తుతం ట్రెండింగ్‌లోకి వచ్చింది. దీంతో అతని తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Viral Video: ఛీ.. వ్యూస్ కోసం మరీ ఇంత దిగజారాలా? ఈ ఇన్‌ఫ్లుయెన్సర్ ఏం చేశాడో చూడండి
Social Media Influencer Stunt
Anand T
|

Updated on: May 01, 2026 | 7:11 PM

Share

సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు ఓ ఇన్‌ఫ్లుయెన్సర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాను షేక్ చేస్తుంది. వీడియో ప్రకారం.. పునీత్ సూపర్ స్టార్ అనే ఓ ఇన్‌ఫ్లుయెన్సర్ తన వింత ప్రవర్తనతో వీడియోలు చేస్తూ ఎప్పిటికప్పుడూ ట్రెడింగ్‌లోకి వస్తుంటాడు. గతంలో మురికి కాలువల దగ్గర వీడియోలు చేసి ఫేమస్ అయిన ఈ వ్యక్తి తాజాగా మరోసాని అలాంటి వీడియోతోనే ట్రెండింగ్‌లోకి వచ్చాడు. కానీ ఈ సారి మాత్రం అతని చేసిన పనికి నెటిజన్లు అవాక్కయ్యారు. ఇటీవల అతను పోస్ట్ చేసిన వీడియోలో పునీత్ ఓ పెద్ద మురికి కాలువ వద్దకు వెళ్లి మొదట అందులో స్నానం చేశాడు. అంతటితో ఆగకుండా, ఆ కాలువ గట్టుపైనే కూర్చుని తినడం ప్రారంభించాడు.

అయితే అతను కాటువ గోడపై కూర్చొని నార్త్ ఇండియన్ ఫుడ్‌ అయిన చోలే , ఆలూ కుల్చే తింటున్నాడు. ఇంతలో ఎవరూ ఊహించని విధంగా అతను ఆ ఆలూ కుల్చేలను అక్కడ పారుతున్న మురికి నీళ్లలో ముంచి మరీ తినడం స్టార్ట్ చేశాడు. ఈ తతంగాన్నంత తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ దృశ్యాలు చూస్తుంటేనా తిన్నది అంతా బయటకొచ్చేలా ఉన్నాయి. అలాంటి ప్లేస్‌లో అతని తినడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేశాయి.

ఇక అతను పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు అతడి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. వ్యూస్ కోసం మరీ ఇంతలా దిగజారాలా?, ఇంతకు మించిన సిగ్గుమాలిన పని ఇంకోటి ఉండదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో చూస్తుంటేనే వాంతికి వస్తోందని మరికొందు కామెంట్స్ చేస్తున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర