Mukul Chaudhary : వాడు చాలా డేంజర్.. ముకుల్ గురించి ముందే హెచ్చరించిన అర్జున్ టెండూల్కర్
Mukul Chaudhary : ముకుల్ చౌదరి సామర్థ్యాన్ని గుర్తించిన లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం వేలంలో అతని కోసం ఏకంగా రూ. 2.60 కోట్లు ఖర్చు చేసింది. అర్జున్ టెండూల్కర్ (సచిన్ కుమారుడు) మాత్రం ముకుల్ టాలెంట్ గురించి ముందే హెచ్చరించాడు.

Mukul Chaudhary : ప్రతి ఏటా ఐపీఎల్ కొత్త కొత్త డైమండ్లను ప్రపంచానికి పరిచయం చేస్తుంది. నిన్నటి దాకా ఎవరికీ తెలియని ఆటగాళ్లు రాత్రికి రాత్రే స్టార్‌లుగా మారిపోతుంటారు. ఐపీఎల్ 2026 సీజన్‌లో అచ్చం అలాగే వెలుగులోకి వచ్చిన మరో అద్భుత కిరణం ముకుల్ చౌదరి. కోల్‌కతా నైట్ రైడర్స్ చేతుల్లోకి వెళ్ళిపోయింది అనుకున్న మ్యాచ్‌ను తన సిక్సర్ల సునామీతో లక్నో సూపర్ జెయింట్స్ వైపు తిప్పేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు ఈ 21 ఏళ్ల కుర్రాడు. ముకుల్ విధ్వంసం, దీనిపై అర్జున్ టెండూల్కర్ ముందుగానే హెచ్చరించాడు. ప్రస్తుతం అర్జున్ చేసి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఏప్రిల్ 9 రాత్రి ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో ముకుల్ చౌదరి సరికొత్త చరిత్ర సృష్టించాడు. లక్నో గెలుపుపై ఆశలు వదులుకున్న దశలో ఏడో నంబర్ బ్యాటర్‌గా వచ్చిన ముకుల్ కేవలం 27 బంతుల్లోనే 54 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో 7 గగనతలాన్ని తాకిన సిక్సర్లు ఉన్నాయి. ఆఖరి 4 ఓవర్లలో లక్నోకు 54 పరుగులు కావాల్సి ఉండగా, అందులో 52 పరుగులు కేవలం ముకుల్ బ్యాట్ నుంచే రావడం విశేషం. ఈ అద్భుత ఇన్నింగ్స్ లక్నోకు 3 వికెట్ల తేడాతో విజయాన్ని అందించింది.
ముకుల్ చౌదరి గురించి ప్రపంచానికి ఇప్పుడే తెలిసి ఉండవచ్చు, కానీ అతని జట్టు సహచరుడు అర్జున్ టెండూల్కర్ (సచిన్ కుమారుడు) మాత్రం ముకుల్ టాలెంట్ గురించి ముందే చెప్పాడు. గతంలో ఒక ఇంటర్వ్యూలో అర్జున్ మాట్లాడుతూ.. “ముకుల్ చౌదరి చాలా బాగా సిక్సర్లు కొడతాడు. ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో అతని హిట్టింగ్ చూసి నేను షాక్ అయ్యాను. మైదానం నలుమూలలా, ముఖ్యంగా స్క్వేర్ లెగ్, పాయింట్ మీదుగా అతను కొట్టే షాట్లు అద్భుతం. అతని బ్యాటింగ్ నన్ను బాగా ఆకట్టుకుంది” అని తెలిపాడు. నిన్నటి మ్యాచ్‌లో ముకుల్ సరిగ్గా అర్జున్ చెప్పినట్లే షాట్లు ఆడటం విశేషం.
ముకుల్ చౌదరి సామర్థ్యాన్ని గుర్తించిన లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం వేలంలో అతని కోసం ఏకంగా రూ.2.60 కోట్లు ఖర్చు చేసింది. ఒక అన్‌క్యాప్డ్ ప్లేయర్‌కు ఇంత భారీ ధర ఎందుకని అప్పట్లో విమర్శలు వచ్చినా, నిన్నటి ఇన్నింగ్స్‌తో ముకుల్ వాటన్నింటికీ సమాధానం చెప్పాడు. ముకుల్ కేవలం హిట్టర్ మాత్రమే కాదు, వికెట్ కీపర్ కూడా కావడం జట్టుకు అదనపు బలం.
లక్నో టీమ్ కోసం ఒక మ్యాచ్ విన్నర్ దొరికాడని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముకుల్ చౌదరి ఆడిన కొన్ని షాట్లు, ముఖ్యంగా కవర్స్ మీదుగా కొట్టిన సిక్సర్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఈ ఒక్క ఇన్నింగ్స్‌తో ముకుల్ ఐపీఎల్ 2026లో అత్యంత ప్రభావం చూపగల ఆటగాళ్ల జాబితాలో చేరిపోయాడు. రాబోయే మ్యాచ్‌ల్లో అతనిపై అంచనాలు భారీగా పెరిగాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
