AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jana Nayagan: ‘జన నాయగన్‌’ లీక్‌పై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి.. సినిమాను కాపాడుకోవాలని పిలుపు

దళపతి విజయ్ నటించిన జన నాయగన్ సినిమా సీన్లు ఆన్ లైన్ లో లీక్ కావడం చర్చనీయాంశంగా మారింది . భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా అనూహ్యంగా పైరసీ సైట్లలో దర్శనమివ్వడంపై సినీ ప్రముఖులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Jana Nayagan: ‘జన నాయగన్‌’ లీక్‌పై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి.. సినిమాను కాపాడుకోవాలని పిలుపు
Megastar Chiranjeevi, Jana Nayagan Movie
Basha Shek
|

Updated on: Apr 10, 2026 | 5:40 PM

Share

దళపతి విజయ్ నటించిన ‘జననాయగన్‌’ (తెలుగులో జన నాయకుడు) విడుదల కోసం ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు ఉన్నట్లుండి సినిమాలోని పలు సీన్లు ఆన్ లైన్ లో ప్రత్యక్షం కావడంతో అందరూ షాక్‌ అయ్యారు. సెన్సార్‌ సర్టిఫికెట్‌ కూడా రాని ఈ చిత్రం నుంచి సుమారు 5 నిమిషాల సీన్‌తో పాటు ఒక సాంగ్‌ను లీక్‌ చేయడంపై సినీ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే చిత్ర నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్‌ ఒక హెచ్చరిక జారీ చేసింది. మూవీ వీడియోలను షేర్‌ చేసిన వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని నిర్మాణ సంస్థ హెచ్చరించింది. ఈ మేరకు ఇప్పటికే న్యాయవాదులు నోటీసులు జారీ చేశారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి జననాయగన్ సినిమా లీక్ పై స్పందించారు. ఎంతో మంది కష్టానికి ప్రతిరూపమైన సినిమా ఇలా పైరసీ బారిన పడడం శోచనీయమని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

‘జననాయగన్’ చిత్రం దురదృష్టవశాత్తు ఆన్ లైన్ లో లీక్ కావడం నన్నెంతో ఆందోళనకు గురి చేసింది. నమ్మకం, శ్రమ, ఎంతోమంది సమష్టి కలల సమాహారమే సినిమా. ఇలాంటి సంఘటనలు సినిమా పరిశ్రమలోని మనందరినీ ప్రభావితం చేస్తాయి. మన క్రియేటివ్‌ వర్క్‌ని కాపాడుకోవడం ఎంత కీలకమో గుర్తు చేస్తుంటాయి. ఈ నష్టాన్ని అరికట్టడంలో, దోషులను శిక్షించడంలో మేమంతా ఏకతాటిపై కేవీఎన్ ప్రొడక్షన్స్‌కు మద్దతుగా నిలుస్తాం. సినిమాను గౌరవించి, పరిరక్షించేందుకు మనమందరం మన మద్దతును అందిద్దాం. కిల్ పైరసీ.. సేవ్ సినిమా’ అనిచిరంజీవి పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి

చిరంజీవి ట్వీట్..

మరోవైపు జననాయగన్ సినిమా లీక్ పై ఆ చిత్ర నిర్మాతలు స్పందించారు. ఈ మేరకు కేవీఎన్ నిర్మాణ సంస్థ ఒక లీగల్ నోటీస్ జారీ చేసింది. సినిమాలోని కొన్ని దృశ్యాలు అక్రమంగా లీక్ అయ్యాయని, వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడం తీవ్రమైన నేరమని జన నాయగన్ నిర్మాతలు స్పష్టం చేశారు. లీక్ అయిన వీడియోలను చూడటం లేదా డౌన్‌లోడ్ చేయడం, ​వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి యాప్‌లలో ఇతరులకు ఫార్వార్డ్ చేయడం లేదా షేర్ చేయడం. ​యూట్యూబ్ లేదా ఇతర వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేయడం వంటి చర్యలను ఏమాత్రం సహించబోమన్నారు. అత్యున్నత టెక్నాలజీ సహాయంతో సినిమాను పైరసీ చేసిన వారిని గుర్తిస్తున్నామని, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం’ అని నిర్మాతలు హెచ్చరించారు.

కేవీఎన్ సంస్థ ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మొద్దు శీను జైలు నుంచి ఆ లెటర్‌లో నాకు ఏం రాసాడంటే..
మొద్దు శీను జైలు నుంచి ఆ లెటర్‌లో నాకు ఏం రాసాడంటే..
టీమిండియాలో ఫ్యూచర్ డేంజరస్ బ్యాటర్ నువ్వే.. సీన్ కట్‌చేస్తే..
టీమిండియాలో ఫ్యూచర్ డేంజరస్ బ్యాటర్ నువ్వే.. సీన్ కట్‌చేస్తే..
మహిళలకు ప్రభుత్వం నుంచి సూపర్ గుడ్‌న్యూస్.. ఉచితంగా చీరల పంపిణీ
మహిళలకు ప్రభుత్వం నుంచి సూపర్ గుడ్‌న్యూస్.. ఉచితంగా చీరల పంపిణీ
ప్రపంచ కుబేరుల జాబితాలో అంబానీ ఏ స్థానంలో ఉన్నారో తెలుసా..?
ప్రపంచ కుబేరుల జాబితాలో అంబానీ ఏ స్థానంలో ఉన్నారో తెలుసా..?
విజయ్ ‘జన నాయగన్‌’ లీక్‌పై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి
విజయ్ ‘జన నాయగన్‌’ లీక్‌పై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి
10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య..!
10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య..!
ఏసీ 8 గంటలు ఆన్ చేసినా.. కరెంట్ బిల్లు తక్కువ రావాలంటే ఇలా చేయండి
ఏసీ 8 గంటలు ఆన్ చేసినా.. కరెంట్ బిల్లు తక్కువ రావాలంటే ఇలా చేయండి
ఫోన్‌కు వచ్చిన ట్రాఫిక్ చలానా పరిశీలించిన వ్యక్తి.. ఓపెన్ చేయగా
ఫోన్‌కు వచ్చిన ట్రాఫిక్ చలానా పరిశీలించిన వ్యక్తి.. ఓపెన్ చేయగా
తెలంగాణకు కేంద్రం భారీ కానుక.. రెండు కొత్త రైల్వే ప్రాజెక్టులు!
తెలంగాణకు కేంద్రం భారీ కానుక.. రెండు కొత్త రైల్వే ప్రాజెక్టులు!
రాసిపెట్టుకోండి..వారికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరిగే ఛాన్స్..!
రాసిపెట్టుకోండి..వారికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరిగే ఛాన్స్..!