Artificial Snow: చైనా ఏది చేసినా స్పెషలే.. వింటర్ ఒలింపిక్స్‌కు ఏకంగా కృత్రిమ మంచు
Artificial Snow: వింటర్ ఒలింపిక్స్‌లో 100 శాతం కృత్రిమ మంచును వాడింది చైనా. ఇందుకోసం కొన్ని నెలల ముందు నుంచే ఏర్పాట్లు మొదలుపెట్టింది. ఆయా పరిసరాల్లో..
Artificial Snow: వింటర్ ఒలింపిక్స్‌లో 100 శాతం కృత్రిమ మంచును వాడింది చైనా. ఇందుకోసం కొన్ని నెలల ముందు నుంచే ఏర్పాట్లు మొదలుపెట్టింది. ఆయా పరిసరాల్లో భౌగోళిక పరిస్థితులనే కృత్రిమంగా మార్చేసింది. ఇందుకోసం వందల కొద్ది స్నోగన్స్ వినియోగించింది. చైనాలోని బీజింగ్, యాన్‌కింగ్, జాంగ్జియాకౌ క్లస్టర్లలో ఈ వింటర్ ఒలింపిక్స్ జరుగుతున్నాయి. వాస్తవానికి ఈ శీతకాలంలో ఇక్కడ మంచుకొరత తీవ్రంగా ఉంటుంది. ఈ వాతావరణం మంచు క్రీడలకు ఏమాత్రం సరిపోదు. మంచు క్రీడలు నిర్వహించాలంటే ఏటా కనీసం 300 అంగుళాల హిమపాతం ఉండాలి. ఈ నేపథ్యంలో ఇటలీకి చెందిన టెక్నోఆల్పిన్ కంపెనీకి బీజింగ్ బయట క్రీడలకు అవసరమైన మంచును సృష్టించే కాంట్రాక్టు ఇచ్చారు. బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌కు అవసరమైన మంచు తయారీ యంత్రాలను ఆ సంస్థ అందిస్తోంది. ఈ విషయాన్ని టెక్నోఅల్పిన్ ఆసియా మేనేజర్ మిషెల్ మేయర్ తెలిపారు. 2018 నుంచి ఈ కంపెనీ స్నోగన్స్, ఫ్యాన్ ఆధారంగా పనిచేసే స్నోజనరేటర్స్, కూలింగ్ టవర్స్ వంటివి చైనాకు తరలించడం మొదలుపెట్టింది. వీటిల్లో కొన్ని చైనా అథ్లెట్ల శిక్షణ కేంద్రాల్లో కూడా వాడారు.
గాలి, నీరు వినియోగించి కృత్రిమ మంచును సృష్టిస్తారు. ఈ క్రీడలకు 49 మిలియన్ గ్యాలెన్ల నీరు అవసరమని అంచనా వేశారు. ఇది 3,600 సాధారణ ఈత కొలనులకు సరిపోతుంది. దాదాపు 10 కోట్ల మంది ప్రజలకు కొన్ని రోజులపాటు తాగు నీటి అవసరాలను తీరుస్తుంది. మొత్తం 8,00,000 చదరపు మీటర్లలో క్రీడల నిర్వహణకు 12లక్షల క్యూబిక్ మీటర్ల మంచు అవసరమని గుర్తించారు.
ఇవి కూడా చదవండి: