Viral News: ఈ జంతువు కళ్లు పుర్రె మధ్యలో.. బాబోయ్ ఇది నిజంగా మేకేనా..?
టర్కీలో ఒక వింత మేక పుట్టింది. దీంతో ఈ మేక గురించి సర్వత్రా చర్చ సాగుతోంది. అంత విడ్డూరంగా ఈ మేక ఏం చేసిందనేగా మీ అనుమానం. అదేం చెయ్యలేదు. దీని రూపమో ఓ వింతగా పరిణమించింది..
Unique goat splashed on social media: ప్రపంచంలో అనేక వింతలు చోటుచేసుకుంటున్నాయి. రకరకాల టెక్నాలజీలు, జీవన శైలి, వింతైన ప్రదేశాలు, వింత జీవులు.. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్దలిస్టే తయారవుతుంది. ఐతై సాధారణంగా మన చుట్టూ ఉండే జంతువులు రొటీన్‌కు భిన్నంగా రెండు తలలు, 12 కాళ్లతో ఉన్న ఇలా వింతగా పుట్టడం ఇప్పటికే మనం చూశాం.. చదివాం.. ఇప్పుడు మీరు తెలసుకోబోయే వింత జీవి అందుకు పూర్తిగా భిన్నమైనది. అలాఅని ఏ కొత్త జంతువు గురించో పరిచయం చేస్తున్నామనుకోకండి. పాడి జంతువే. అదేనండి మేక గురించే ఈ చర్చంతా! టర్కీలో ఒక వింత మేక పుట్టింది. దీంతో ఈ మేక గురించి సర్వత్రా చర్చ సాగుతోంది. అంత విడ్డూరంగా ఈ మేక ఏం చేసిందనేగా మీ అనుమానం. అదేం చెయ్యలేదు. దీని రూపమో ఓ వింతగా పరిణమించింది. అసలేంజరిగిందంటే..
టర్కీలో ఓ మేకల యజమానికి చెందిన మేకల మందలో ఓ మేక పుట్టింది. ఐతే ఈ మేకకు కళ్ళు మామూలుగా కాకుండా పుర్రె మధ్యలో ఉన్నాయి మరి! దీంతో ‘వింత మేక’ పుట్టగానే దాని యజమాని కూడా హడలెత్తిపోయాడట. తాను గత 25 ఏళ్లుగా మేకలను పెంచుతున్నానని, తల మధ్యలో కళ్లు ఉన్న జంతువును ఇంతవరకు చూడలేదని మేక యజమాని చెబుతున్నాడు. ఈ ‘వింత మేక’ను పెంచలేనని, అధికారులు ఈ మేకను తీసుకెళ్లి పెంచాలని కోరుతున్నాడు. ఐతే సెబోసెఫాలీ కారణంగా పుర్రెలో కళ్ళతో జంతువులు పుట్టడం వంటి సంఘటనలు అడపాదడపా జరుగుతాయని హటే ముస్తఫా కమల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ అహ్మద్ తెలిపారు. వైద్యపరమైన క్రమరాహిత్యం కారణంగా మేక రెండు కళ్ళు సరిగ్గా ఒకే విధంగా ఉన్నాయి. అది ఎందుకంటే.. సెబోసెఫాలీ (cebocephaly) జీవుల్లో ప్రతి కన్ను వేర్వేరుగా ఉండదు. ఇటువంటి ప్రత్యేక సందర్భాల్లో ముక్కు అరమరికలో కూడా మార్పు వస్తుంది. ఇక ఈ మేక ముక్కు చదునుగా ఉంది. ముక్కు రంధ్రం వింతగా ఉంది. చెవులు ఇతర జంతువులకు ఉన్నట్లు సాధారణంగా ఉండవు. అలాగే దిగువ దవడ కూడా పెద్దగా ఉంది. సెబోసెఫాలీ వైద్య క్రమరాహిత్యం అనేది (medical anomaly of cebocephaly) మనుషులు, జంతువులలో సంభవించవచ్చని ప్రొఫెసర్ హటే ముస్తఫా కమల్ తెలిపారు.
Also Read: