Joker Attacke: టోక్యో లోకల్ ట్రైన్‌లో దారుణం.. జోకర్ మాస్క్‌తో వచ్చి ప్రయాణికులపై కత్తితో దాడి.. ఆ తర్వాత..

|

Nov 01, 2021 | 12:59 PM

జపాన్‌ లోకల్ ట్రాయిన్‌లో దారుణం జరిగింది. జోకర్ మాస్క్ ధరించి వచ్చి ఓ యువకుడు ప్రయాణికులపై దాడి చేశాడు. ఆదివారం సాయంత్రం..

Joker Attacke: టోక్యో లోకల్ ట్రైన్‌లో దారుణం.. జోకర్ మాస్క్‌తో వచ్చి ప్రయాణికులపై కత్తితో దాడి.. ఆ తర్వాత..
Tokyo Train
Follow us on

జపాన్‌ లోకల్ ట్రాయిన్‌లో దారుణం జరిగింది. జోకర్ మాస్క్ ధరించి వచ్చి ఓ యువకుడు ప్రయాణికులపై దాడి చేశాడు. ఆదివారం సాయంత్రం టోక్యో రైలులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దాడి ఘటనలో కనీసం 17 మంది గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.  దాడి చేసిన వ్యక్తి బాట్‌మాన్ జోకర్ దుస్తులలో ఉన్నాడు. అకస్మాత్తుగా రైలులోకి వచ్చిన దుండగుడు  ప్రయాణికులపై కత్తితో దాడి చేయడం మొదలు పెట్టాడు. ప్రయాణికులపై దాడి చేసిన అంతరం పొట్రోల్ పోసి బోగీని తగలబెట్టాడు.

ట్విటర్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోలో ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి రైలు కోచ్ నుండి పారిపోతు కనిపించారు. కొద్దిసేపటి తర్వాత రైలు కోచ్‌లో నుంచి మంటలు రావడం మొదలయ్యాయి. ఇంతలో కొంతమంది ప్రయాణికులు ప్లాట్‌ఫారమ్‌పై రైలు కిటికీలో నుండి దిగడం ప్రారంభించారు.

అనుమానాస్పద దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అక్కడికక్కడే అరెస్టు చేసినట్లు మీడియా తెలిపింది. ఆదివారం అర్థరాత్రి వరకు కయో ఎక్స్‌ప్రెస్ లైన్‌లో పాక్షిక సర్వీసును నిలిపివేసినట్లు  తెలిపారు.


ఇవి కూడా చదవండి: PM Modi: విదేశాల నుంచి రావడమే ఆలస్యం 13 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని సమావేశం.. ఆ అంశంపైనే చర్చ..

LPG Price Rise: దీపావళి ముందు భారీ షాక్.. పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధర.. ఎంత పెరిగిందంటే..