బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్నా ఆకృత్యాలకు అంతే లేకుండా పోతోంది. ఇప్పటికే దేశ ద్రోహం ఆరోపణలు చేస్తూ ప్రముఖ హిందూ సన్యాసి చిన్మోయ్ కృష్ణ దాస్ ని అరెస్ట్ చేశారు. గత కొన్ని రోజులుగా ఆయన జైలులో ఉన్నారు. అతడిని విడుదల చేయాలంటూ బంగ్లాదేశ్‌లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. చిన్మోయ్ కృష్ణను విడుదల చేయాలని కోరుతూ భారతదేశంలో కూడా నిరసనలు జరుగుతున్నాయి. సన్యాసి బెయిల్ కేసు నేడు మంగళవారం విచారణకు రానుంది. బంగ్లాదేశ్‌లోని మైనారిటీలు, హిందువులు అతన్ని విడుదల చేస్తారా లేదా అని చూస్తున్నారు. ఆ కేసు కోర్టుకు రాకముందే చిన్మోయ్ కృష్ణ దాస్ లాయర్ పై దాడి జరిగింది. ఇస్కాన్ ప్రతినిధి విడుదల చేసిన సమాచారం ప్రకారం.. చిన్మోయ్ కృష్ణ తరపున కేసు వాదిస్తోన్న న్యాయవాది రామెన్ రాయ్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ఉన్నారు.
ఇస్కాన్ ప్రతినిధి రాధారామన్ దాస్ ప్రముఖ సోషల్ మీడియా X హ్యాండిల్‌లో ఒక చిత్రాన్ని పోస్ట్ చేసి.. న్యాయవాది రామెన్ రాయ్‌పై దాడి జరిగిందని పేర్కొన్నారు. అంతేకాదు రామేన్ చేసిన ఏకైక నేరం చిన్మయ్కృష్ణ దాస్ కోసం పోరాడటం అని రాధారామన్ దాస్ పేర్కొన్నారు. అంతేకాదు న్యాయవాది ఇంటిని కూడా ధ్వంసం చేశారని ఆరోపించారు. అయితే బంగ్లాదేశ్‌కు చెందిన పలువురు న్యాయవాదులు ఈ అభియోగాన్ని ఖండించారు.
Please pray for Advocate Ramen Roy. His only ‘fault’ was defending Chinmoy Krishna Prabhu in court.
Islamists ransacked his home and brutally attacked him, leaving him in the ICU, fighting for his life.#SaveBangladeshiHindus #FreeChinmoyKrishnaPrabhu pic.twitter.com/uudpC10bpN
— Radharamn Das राधारमण दास (@RadharamnDas) December 2, 2024
చిన్మోయ్ కృష్ణ దాస్ మాత్రమే కాదు శ్యామదాస్ ప్రభు అనే మరో హిందూ సన్యాసిని ఇప్పటికే అరెస్టు చేశారు. భారత ప్రభుత్వం అరెస్టును నిరసిస్తూ బంగ్లాదేశ్‌లోని మైనారిటీలకు భద్రత కల్పించాలని సందేశం పంపింది.
కాగా, పలువురు న్యాయవాదులపై కేసు కూడా నమోదైనట్లు సమాచారం. చిన్మయ్ తరపు న్యాయవాదిపై పేలుడు పదార్థాల చట్టం కింద కేసు నమోదైన సంగతి తెలిసిందే. చిట్టగాంగ్ పోలీస్ స్టేషన్‌లో సన్యాసి తరపు న్యాయవాది శుభాషిస్ శర్మతో సహా మొత్తం 70 మందిపై కేసు నమోదైంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..