Balochistan Blast: బలూచిస్థాన్‌లో భారీ పేలుడు, ఈద్‌మిలాద్ ఊరేగింపు లక్ష్యంగా దాడి.. 25 మంది మృతి.. అనేక మందికి గాయాలు

ఈద్ మిలాద్-ఉల్-నబీ ఊరేగింపును లక్ష్యంగా చేసుకుని పేలుడు జరిగింది. ఈ దాడిలో ఆరుగురు మృతి చెందారు. దాదాపు 30 మంది గాయపడినట్లు సమాచారం. అక్కడ ఎమర్జెన్సీని ప్రకటించారు. ఆసుపత్రి సిబ్బంది వెంటనే చేరుకోవాలని సూచించారు. ఈ పేలుడులో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) మరణించారు.

Balochistan Blast: బలూచిస్థాన్‌లో భారీ పేలుడు, ఈద్‌మిలాద్ ఊరేగింపు లక్ష్యంగా దాడి.. 25 మంది మృతి.. అనేక మందికి గాయాలు
Balochistan Blast

Updated on: Sep 29, 2023 | 2:03 PM

బలూచిస్థాన్‌లో గత కొంతకాలంగా వరసగా పేలుళ్ల ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.  తాజాగా మస్తుంగ్ జిల్లాలో అల్-ఫలాహ్ మసీదు సమీపంలో ఈద్ మిలాద్-ఉల్-నబీ ఊరేగింపును లక్ష్యంగా చేసుకుని పేలుడు జరిగింది. ఈ దాడిలో 25 మంది మృతి చెందారు. భారీ సంఖ్యలో గాయపడినట్లు సమాచారం. దీంతో అక్కడ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించారు. ఆసుపత్రి సిబ్బంది వెంటనే చేరుకోవాలని సూచించారు. ఈ పేలుడులో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) మరణించారు.

ఈ నెల ప్రారంభంలో.. ఇదే జిల్లాలో జరిగిన పేలుడులో జమియత్ ఉలేమా-ఎ-ఇస్లాం-ఫజల్ (JUI-F) నాయకుడు హఫీజ్ హమ్దుల్లాతో సహా కనీసం 11 మంది గాయపడ్డారు. వారాల క్రితం బస్టాండ్‌లో ఒక లెవీ అధికారిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చిచంపగా.. అదే సమయంలో ఆ దారిన వెళుతున్న మరో ఇద్దరు గాయపడ్డారు.

ఇవి కూడా చదవండి

ఊరేగింపులో మరణించిన

గత ఏడాది అక్టోబర్‌లో మస్తుంగ్‌లోని కాబూ కొండ ప్రాంతంలో రెండు వాహనాలను లక్ష్యంగా చేసుకుని జరిగిన బాంబు దాడిలో ముగ్గురు వ్యక్తులు మరణించగా, మరో ఆరుగురు గాయపడ్డారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..