
చైనా జనాభాలో అన్ని దేశాల కంటే నంబర్ వన్ స్థానంలో నిలిచింది. అయితే పరిశుభ్రతలో మాత్రం జరిమానాలు విధించుకునే స్థాయిలో ఉంది. సిచువాన్ ప్రావిన్స్‌లోని పుగే కౌంటీలో నివసించే స్థానికులు తమ ఇళ్లను పరిశుభ్రంగా ఉంచుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. వీరి అలవాట్లు మార్చుకోవాలని సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టారు అక్కడి అధికారులు. కొత్తగా తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం ఇంట్లో కింద కూర్చొని భోజనం చేస్తే 2.8 డాలర్లు జరిమానా విధుస్తూ నిర్ణయం తీసుకుంది. అంటే భారత కరెన్సీ ప్రకారం రూ. 220 అనమాట. అదే ఇంటిని, వంట గదిని, వంట పాత్రలను శుభ్రంగా ఉంచుకోకపోతే 1.4 డాలర్లు ఫైన్ విధిస్తారు. అంటే రూ. 120 చెల్లించాల్సి ఉంటుంది. ఈ కేటగిరీలను దాదాపు 14 భాగాలుగా విభజించారు ఉన్నతాధికారులు.
ఈ విషయాన్ని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ అనే మీడియా సంస్థ తన కథనంలో ప్రచురించింది. అధికారులు తనిఖీల సమయంలో ఇంటిని పరిశీలించినప్పుడు ఇళ్ళు అపరిశుభ్రంగా, సాలె పురుగుల గూళ్లు, ఇతర క్రిమి కీటకాలు, దుమ్ము, పోగ, ధూళి, మరకలు, చెత్త, అన్నం మెతుకులు, వండిన సామాన్లు అలాగే అపరిశుభ్రంగా ఉంచడం, దుర్వాసన వచ్చేలా ఉంటే మొదటి సారి మూడు నుంచి పది యువాన్లు, రెండో సారి తనిఖీల్లో పట్టుబడితే ఈ మొత్తం రెట్టింపు అయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు అధికారులు.
ఈ కొత్త రూల్స్‌పై కౌంటీ వైస్ డైరెక్టర్ మీడియాతో మాట్లాడుతూ చైనా లోని కొన్ని ప్రాంతాల్లో మానవ జీవన ప్రమాణాల విషయంలో అవగాహన కాల్పిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ప్రత్యేక బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే చాలా వరకూ ప్రజలు తమ ఇళ్ళను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. దోమలు, కుక్కలు, తిరుగుతున్న ప్రదేశంలోనే కూర్చొని భోజనాలు చేస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి పరిస్థితిని నిర్మూలించి పరిశుభ్రతవైపు ప్రజలను జాగరూకులను చేసేందుకు ఇవి తోర్పడతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..