CoronaVirus: ఆస్ట్రేలియ‌న్‌ బీఫ్ నుంచి మహమ్మారి క‌రోనా.. చైనా వాదనను సమర్థించిన డ‌బ్ల్యూహెచ్‌వో

|

Feb 12, 2021 | 5:07 PM

కరోనా వైరస్ పుట్టింది చైనాలోనే అని ప్రపంచంలోని చాలా దేశాలు నమ్ముతున్న విషయం. ఈ మహమ్మారి మూలాలు కనిపెట్టేందుకు తాజాగా డ‌బ్ల్యూహెచ్‌వో బృందం చైనాలోని వుహాన్‌కు వెళ్లింది.

CoronaVirus: ఆస్ట్రేలియ‌న్‌ బీఫ్ నుంచి మహమ్మారి క‌రోనా.. చైనా వాదనను సమర్థించిన డ‌బ్ల్యూహెచ్‌వో
Follow us on

కరోనా వైరస్ పుట్టింది చైనాలోనే అని ప్రపంచంలోని చాలా దేశాలు నమ్ముతున్న విషయం. ఈ మహమ్మారి మూలాలు కనిపెట్టేందుకు తాజాగా డ‌బ్ల్యూహెచ్‌వో బృందం చైనాలోని వుహాన్‌కు వెళ్లింది. అయితే ఆశ్యర్యకరంగా ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ కూడా చైనా చెప్పిన మాటే చెబుతోంది. ఇతర దేశాల నుంచి వ‌చ్చిన‌ కోల్డ్ చెయిన్ ప్రొడక్ట్స్  నుంచే కోవిడ్-19 త‌మ దేశానికి వ‌చ్చింద‌ని చైనా బలంగా వాదిస్తోంది. ఇప్పుడు 14 మంది స‌భ్యుల డ‌బ్ల్యూహెచ్‌వో టీమ్ కూడా ఇదే విషయం చెప్పింది. ఆస్ట్రేలియ‌న్ బీఫ్‌లాంటి కోల్డ్ చెయిన్ ఉత్ప‌త్తుల నుంచే తొలుత క‌రోనా వైర‌స్ వ‌చ్చిన‌ట్లు ఆ టీమ్ ప్రాథమిక అంచనాకు వచ్చింది. ఈ మహమ్మారి వుహాన్‌లోని ల్యాబ్ నుంచి వ‌చ్చింది కానే కాద‌ని ఈ బృందం త‌మ సమగ్ర విచార‌ణ‌ లెక్కలను బట్టి స్పష్టం చేసింది. ఈ బృందానికి నేతృత్వం వహించిన లీడ‌ర్ పీట‌ర్ ఎంబారెక్ మాట్లాడుతూ.. చైనాకు కోవిడ్-19 బ‌య‌టి దేశాల నుంచి వ‌చ్చిందా అన్న అంశంపై లోతైన అధ్యయనం కొన‌సాగించాల్సిన అవ‌స‌రం ఉన్న‌ద‌ని చెప్పారు.

ల్యాబ్ నుంచే కరోనా పుట్టిందన్న అంశంపై ఇక త‌దుప‌రి విచార‌ణ ఉండ‌బోద‌ని కూడా ఆయన చెప్పడం గ‌మ‌నార్హం. క‌రోనా విష‌యంలో ప్ర‌పంచమంతా త‌మనే నిందిస్తున్న స‌మ‌యంలో.. దానితో తమకు సంబంధం లేదని, బ‌య‌టి దేశాల నుంచి వ‌చ్చిన వారి నుంచే వుహాన్‌లో క‌రోనా ప్రబలిందన్న వాద‌న మొద‌లుపెట్టింది చైనా. మొద‌టి నుంచీ క‌రోనా విష‌యంలో చైనా వాదననే భుజానికి ఎత్తుకుంటున్న డ‌బ్ల్యూహెచ్‌వో.. ఈ తరహా నిర్ధారణకు రావడం పెద్ద ఆశ్చర్యకరంగా లేదని పలువురు నిపుణులు అంటున్నారు.

Also Read:

FASTag : ఫాస్టాగ్ విషయంలో ఓ గుడ్ న్యూస్.. పనిలో పనిగా దాన్ని ఎలా కొనుగోలు చేయాలో వివరాలు మీ కోసం

Student suicide: “అమ్మ లేకుండా నేనెలా బ్రతకగలను”..! క్లాస్ రూమ్‌లో విద్యార్థి ఆత్మహత్య..