ఆస్ట్రేలియాలో ఎలుకలు, రోడెంట్ల స్వైర విహారం, ఆసుపత్రుల్లో రోగులకు నరకం, ఇళ్లలో బీభత్సం

ఆస్ట్రేలియాలో ముఖ్యంగా న్యూసౌత్ వేల్స్, క్వీన్స్ లాండ్ వంటి  రాష్ట్రాల్లో ఎన్నడూ ఎరుగని 'ఉత్పాతం' తలెత్తింది. లక్షలాది ఎలుకలు, చుంచెలుకలు బయటపడి వ్యవసాయ క్షేత్రాలను, సూపర్ మార్కెట్లను, ఆసుపత్రులను ముంచెత్తాయి.

ఆస్ట్రేలియాలో ఎలుకలు, రోడెంట్ల స్వైర విహారం,  ఆసుపత్రుల్లో రోగులకు నరకం, ఇళ్లలో బీభత్సం
Australia Is Hit By Biblical Rodent Plague

Edited By:

Updated on: Mar 21, 2021 | 6:10 PM

ఆస్ట్రేలియాలో ముఖ్యంగా న్యూసౌత్ వేల్స్, క్వీన్స్ లాండ్ వంటి  రాష్ట్రాల్లో ఎన్నడూ ఎరుగని ‘ఉత్పాతం’ తలెత్తింది. లక్షలాది ఎలుకలు, చుంచెలుకలు బయటపడి వ్యవసాయ క్షేత్రాలను, సూపర్ మార్కెట్లను, ఆసుపత్రులను ముంచెత్తాయి. ఈస్టర్న్ ఆస్ట్రేలియా లో ఇటీవల హెవీ సమ్మర్ తరువాత ఒక్కసారిగా భారీ వర్షాలు పడడంతో ఇవన్నీ కలుగుల నుంచి బయటకి వచ్చేశాయి. ఇళ్లలో ఎక్కడ బడితే అక్కడ కనబడుతూ ఇళ్లలోని వారిని కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. టోటెన్ హోమ్ , వాల్గెట్ తదితర ప్రాంతాల్లోని హాస్పిటల్ లో రోగులను కరడంతో వారు ఇతర రోగాల బారిన పడుతున్నారు. మళ్ళీ ప్లేగు వ్యాధి వ్యాపిస్తుందేమోనని వణికిపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ క్షేత్రాల్లో పంటలన్నీ వీటి కారణంగా నాశనమై పోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇళ్లలోని మంచి నీటి ట్యాంకులు, పైప్ లలో  పడి ఇవి మరణించడతో తాగడానికి నీరు పనికి రాక వాటిని బకెట్లలో నింపి బయట పారవేస్తున్నారు. ఎన్ని మందులు వాడినా  లక్షలు, వేలు, వందల సంఖ్యలో ఉన్న ఈ ఎలుకల బెడద తగ్గడంలేదని వాపోతున్నారు.

తాము రోజూ నిద్ర లేక భయంకర నరకం అనుభవిస్తున్నామని, తన వ్యవసాయ క్షేత్రంలోని యంత్రాల్లో పడి  చనిపోతున్న వీటి కారణంగా ఏం చేయాలో దిక్కు తోచడంలేదంటూ ఓ మహిళ తన  ఫేస్ బుక్ లో కన్నీటి పర్యంతమైంది.  అధికారులు,  హాస్పిటల్ డాక్టర్లు,  వైద్య సిబ్బంది కూడా  ఈ కొత్త బెడద ఎలా ఎదుర్కోవాలో సతమతమవుతున్నారు. ప్రభుత్వ స్పందన కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఆరోగ్యానికి విపరీతమైన చేటు తెచ్ఛే ఈ అనుకోని ‘భీకర’ పరిణామానికి ఆస్ట్రేలియా వాసులు తల్లడిల్లిపోతున్నారు. ఒకప్పుడు సునామీ వచ్చేముందు ఈ విధమైన  ఎలుకల సమూహాలు కలుగుల నుంచి బయటపడుతాయని భావించేవారు. ఇప్పుడు భారీ వర్షాలతో అసలే కష్టాలు  ఎదుర్కొంటుంటే పులిమీద పుట్రలా ఈ ఉత్పాతమేమిటని నగర వాసులు, గ్రామీణులు అల్లాడుతున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి:Tirupati By Election : తిరుపతి సీటు ఎవరికి ఇవ్వాలన్నదానిపై బీజేపీ తర్జనభర్జన, ప్రముఖంగా మాజీ ఐఏఎస్‌, ఐపీఎస్‌ల పేర్లు.!

Pregnancy First, Marriage Later : టోడతెగలో వింత ఆచారం.. అబ్బాయితో గడిపిన అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాతే పెళ్లి ఎక్కడంటే…!