అల్జీరియా దేశంలోని అటవీ ప్రాంతంలో అంటుకున్న కార్చిచ్చు దావాణంలా వ్యాపించి దహించివేస్తోంది. వేగంగా వ్యాప్తిస్తున్న మంటలంటుకుని 25 మంది సైనికులతో పాటు ఏడుగురు పౌరులు అగ్ని అహుతయ్యారు. అల్జీరియాలోని టిజి ఒజౌ, బెజాయియా ప్రావిన్సులో అడవిలో మంటలు వ్యాపించాయి. అగ్నికీలలు ఎగిసిపడి 32 మంది మరణించగా, పలువురు గాయపడ్డారని అల్జీరియా రక్షణ మంత్రి ప్రకటించారు. టిజి ఓజౌ సమీపంలోని లర్బా నాథ్ ఇరాటెన్ అనే గ్రామం, అధిక గాలుల సమయంలో మంటలు వచ్చినట్లుగా భావిస్తున్నట్లు ఆయన చెప్పారు.
అటవీ ప్రాంతంలో కార్చిచ్చును చల్లార్చేందుకు అగ్నిమాపకశాఖ అధికారులు, సైనికులతో కలిసి సహాయ చర్యలు చేపడుతున్నట్లు రక్షణమంత్రి తెలిపారు. కాగా, ఇప్పటివరకు 110 కుటుంబాలను మంటల బారి నుంచి రక్షించామన్నారు అయితే, కార్చిచ్చు వల్ల కొంగలు గ్రీస్ దాటి పోతున్నాయి. ఈ మంటల వల్ల కబీలీ ప్రాంతంలో పశువులు, కోళ్లు మరణించాయి. కార్చిచ్చు వెనుక ఎవరి హస్తం అయినా ఉండవచ్చని అల్జీరియా మంత్రి అనుమానం వ్యక్తం చేశారు. అల్జీరియాలోని కబీలీ ప్రాంతంలోని జిటి ఓజౌ నగరంలో మంటల వల్ల ఓ ఇల్లు కాలిబూడిదైంది. దట్టమైన అడవుల్లో రాజుకున్న మంటలను ఆర్పేందుకు బుల్డోజర్లను తీసుకువచ్చారు.
సివిల్ ప్రొటెక్షన్ ప్రతినిధి కల్నల్ ఫరూక్ ఆచూర్ మాట్లాడుతూ.. తన డిపార్ట్‌మెంట్ 12 ఫైర్ ఇంజిన్‌లను పంపిందని మరియు మంటలను అరికట్టడానికి, ప్రజలను, వారి ఆస్తులను రక్షించడానికి 900 మందికి పైగా సహాయకచర్యల్లో పాల్గొంటున్నారని తెలిపారు.
My Heart is bleeding, so much pain and sadness around us, fire is hard to fight please help us with your prayers May Allah protect our people and our country #Algeria.#Algerie #PrayForAlgeria #FiresInAlgeria #احرقتم_قلوبنا_بحرقكم_بلادنا pic.twitter.com/yQ0CH7q1Kc
— ALGERIAN TAG ?? (@alg_tag) August 10, 2021
నోరుజారిన లాస్య.. రవి ఆ హౌజ్‌లోకి అంటూ.. సైలెంట్ సెటైర్..(వీడియో): Anchor Ravi In BiggBoss5.