ఆఫ్గనిస్తాన్ కు తిరిగి వస్తా…చర్చలు జరుపుతున్నా..మాజీ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని

| Edited By: Ravi Kiran

Aug 19, 2021 | 9:31 AM

ఆఫ్గనిస్తాన్ కు తిరిగి వచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, ఈ విషయమై చర్చలు జరుపుతున్నానని మాజీ అధ్యక్ధుడు అష్రాఫ్ ఘని ప్రకటించారు...

ఆఫ్గనిస్తాన్ కు తిరిగి వస్తా...చర్చలు జరుపుతున్నా..మాజీ అధ్యక్షుడు  అష్రాఫ్ ఘని
Ghani
Follow us on

ఆఫ్గనిస్తాన్ కు తిరిగి వచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, ఈ విషయమై చర్చలు జరుపుతున్నానని మాజీ అధ్యక్ధుడు అష్రాఫ్ ఘని ప్రకటించారు. గల్ఫ్ లో ప్రవాసంలో ఉండాలన్నది తన అభిమతం కాదని, ఆఫ్ఘన్ పాలన అన్నదే తన లక్ష్యమని అన్నారు. ఈ దేశంలో మరింత రక్తపాతం జరగకుండా చూడాలనే తాను అక్కడినుంచి నిష్క్రమించానన్నారు. తాలిబాన్లకు, హమీద్ కర్జాయ్, అబ్దుల్లా అబ్దుల్లా మధ్య జరుగుతున్న చర్చలకు ఆయన మద్దతు ప్రకటించారు. శాంతి ప్రక్రియ సఫలం కావాలని ఆశిస్తున్నట్టు రికార్డు చేసిన తన ప్రసంగంలో తెలిపారు. డబ్బు సంచులతో తాను ఆఫ్ఘన్ ను వీడానని వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. తన ప్రాణాలను రక్షించుకోవడానికే పారిపోయినట్టు వచ్చిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. కనీసం తన చెప్పులను కూడా ధరించకుండా తనను బహిష్కరించారని ఆయన పేర్కొన్నారు. వట్టి చేతులతో నేను ఎమిరేట్స్ లో ప్రవేశించా అని ఘని తెలిపారు. కాబూల్ లో ప్రవేశించరాదన్న ఒప్పందం ఉన్నా తాలిబన్లు ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించారని ఆయన ఆరోపించారు.

తాను అక్కడే ఉన్న పక్షంలో ఎన్నికైన అధ్యక్షుడిని తాలిబన్లు ఉరి తీసేవారు అన్నారు. 1996 లో తాలిబన్లు మొదటిసారి కాబూల్ ని ఆక్రమించుకున్న అనంతరం మాజీ కమ్యూనిస్టు ప్రెసిడెంట్ నజీబుల్లాను ఐరాస కార్యాలయం నుంచి లాక్కుని వచ్చి..టార్చర్ పెట్టడమే గాక..బహిరంగంగా ఉరి తీశారు. ఈ సంఘటనను ఘని గుర్తు చేశారు.