తవ్వకాల్లో బయటపడ్డ 2 వేల ఏళ్ల నాటి ‘మమ్మీ’.. నోట్లో ‘బంగారపు నాలుక’.. అసలు రహస్యం ఇదే.!
అది ఒక ఈజిప్టు 'మమ్మీ'.. దాదాపు రెండు వేల ఏళ్ల నాటిది. 'గ్రేట్ టోంబ్ ఆఫ్ ఓసిరిస్'లో పురావస్తు శాఖ అధికారులు వెలికితీశారు. ఇందులో పెద్ద వింతేముందని..
అది ఒక ఈజిప్టు ‘మమ్మీ’.. దాదాపు రెండు వేల ఏళ్ల నాటిది. ‘గ్రేట్ టోంబ్ ఆఫ్ ఓసిరిస్’లో పురావస్తు శాఖ అధికారులు వెలికితీశారు. ఇందులో పెద్ద వింతేముందని.. ఈజిప్టులో ఇవన్నీ సహజమేనని అనుకుంటున్నారా.! కరెక్టే.. కానీ ఆ మమ్మీ నోట్లో ‘బంగారపు’ నాలుక లభ్యం కావడం వింత. అసలు దాన్ని ఎవరు పెట్టారు.? ఎందుకు ఉంది.? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఈజిప్టులోని తపోసిరిస్ మగ్నా ప్రాంతంలో పురావస్తు శాఖ అధికారులు చేసిన తవ్వకాల్లో 2 వేల ఏళ్ల నాటి మమ్మీ ఒకటి బయటపడింది. ఆ మమ్మీ నోట్లో బంగారపు నాలుక ఉండటం వారిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఈ అరుదైన ఘటనపై ఈజిప్టు పురావస్తు శాఖ తాజాగా స్పందించింది. (Egypt Mummy With Gold Tongue)
మరణించిన తర్వాత ఎవరికైనా కూడా వేరే జీవితం ఉంటుందని అక్కడి వారి నమ్మకమట. అంతేకాకుండా మరణించిన వారి ఆత్మలు.. సమాధుల్లోకి వచ్చి దేవుళ్లు, వేరే ఆత్మలతో మాట్లాడతాయని వారి భావన. అందుకు నాలుక అవసరం కాబట్టి.. బంగారపు నాలుకను పెట్టి ఉంటారని పురావస్తు శాఖ అధికారులు అభిప్రాయపడ్డారు. అయితే ఈ అంశంపై మరిన్ని ఆధారాలను సేకరించే పనిలో ఉన్నామని.. త్వరలోనే పూర్తి వివరాలు తెలియజేస్తామని చెప్పారు. కాగా, రీసెంట్‌గా చేసిన తవ్వకాల్లో ఇలా బంగారపు నాలుకతో ఉన్న ఇంకొన్ని మమ్మీలు బయపడినట్లు తెలుస్తోంది.
మరిన్ని చదవండి:
మీ వెహికిల్‌ను అమ్మేసినా.. RC ట్రాన్స్‌ఫర్ కాలేదా.? అయితే ఇలా చేయండి..
ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. అనుమానంతో భార్యను కిరాతకంగా.. పక్కా ప్లాన్ ప్రకారమే..
టీమిండియాకు ప్రపంచకప్ అందించాడు.. ఏడాది పాటు నిషేధం ఎదుర్కున్నాడు.. ఆ బ్యాట్స్‌మెన్ ఎవరంటే.?
కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారా.? అయితే ఈ ఐలాండ్‌లో జాలీగా హాలీడేను ఎంజాయ్ చేయండి..!