వినియోగదారులకు యాపిల్ సంస్థ స్ట్రాంగ్ వార్నింగ్.. ఆ కాల్స్‌తో జాగ్రత్త అంటూ హెచ్చరికలు..

ప్రముఖ మొబైల్ మేకర్ ఆపిల్ తన వినియోగదారులకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‏ను అందుబాటులోకి తీసుకువస్తుంది. తాజాగా ఈ సంస్థ తన యూజర్లకు హెచ్చరికలు జారీ చేసింది.

వినియోగదారులకు యాపిల్ సంస్థ స్ట్రాంగ్ వార్నింగ్.. ఆ కాల్స్‌తో జాగ్రత్త అంటూ హెచ్చరికలు..

Edited By: Ravi Kiran

Updated on: Dec 07, 2020 | 2:34 PM

ప్రముఖ మొబైల్ మేకర్ ఆపిల్ తన వినియోగదారులకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‏ను అందుబాటులోకి తీసుకువస్తుంది. తాజాగా ఈ సంస్థ తన యూజర్లకు హెచ్చరికలు జారీ చేసింది. ప్రతి వినియోగదారుడు తమ లాగిన్ అకౌంట్ వివరాలను బహిర్గతం చేయకూడదని ఫెడరల్ ట్రేడ్ కమిషన్ తన బ్లాగ్‏లో పోస్ట్ చేసింది. వివరాల ప్రకారం… ఆపిల్ వినియోగదారుడికి ఒక తెలియని వ్యక్తి నుంచి కాల్ వస్తుందని.. మీ అకౌంట్‏లో అనుమానిత కార్యాకలపాలు జరుగుతున్నాయంటూ చెబుతారని తెలిపింది. అలాంటి కాల్స్ వచ్చిన వెంటనే ప్రతీ యూజర్ ఆపిల్ కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్‏కు కాల్ చేసి తమ పర్సనల్ డీటెయిల్స్‏ను చెక్ చేయించుకొని, అకౌంట్‏ ఐడీని లాక్ చేయించుకోవాలని తెలిపింది.

మీ అకౌంట్లో తప్పు జరిగిందని స్కామర్లు భయపెట్టవచ్చని.. అలాగే అకౌంట్లను భద్రపరచడానికి స్కామర్లు ఒకటి లేదా ఎదైనా నంబర్ ప్రెస్ చేయమని చెబుతారంది. ఇలాంటి కాల్స్ వస్తే యూజర్లు ఎలాంటి నంబర్లు క్లిక్ చేయకూడదని హెచ్చరించింది. ఇలాంటి స్మాంలు చాలా వరకు జరుగుతుంటాయని, అయితే వినియోగదారులు భయపడాల్సిన పనిలేదని, కాల్ రాగానే వెంటనే తమ అకౌంట్ డీటెయిల్స్, పర్సనల్ ఇన్ఫర్మేషన్‏తోపాటు బ్యాంకు డీటెయిల్స్, లాగిన్ ఐడిలను వెరీఫై చేయించుకోవాలని తెలిపింది. ఇందులో ఎక్కువగా స్కామర్లు యూజర్ల యొక్క క్రెడిట్, డెబిట్ కార్డ్స్ డీటెయిల్స్ అడుగుతారని, వినియోగదారలు అలాంటి వాటికి ఏరకమైన వివరాలను ఇవ్వకూడదని ప్రకటించింది. ఆపిల్ సంస్థ యొక్క నిజమైన కస్టమర్ సపోర్ట్ రిప్రజెంటేటీవ్ ఎప్పుడు కూడా ఎలాంటి పర్సనల్ డీటెయిల్స్ లేదా బ్యాంకింగ్ డీటెయిల్స్ అడగరని స్పష్టం చేసింది.