Milk Crate Challenge: తల్లిదండ్రుల వెన్నులో వణుకు పుట్టిస్తున్న మరో ఆన్లైన్ గేమ్.. ఎందుకంటే..

గతంలో బ్లూ వేల్, మోమో వంటి గేమ్స్  నెట్టింట్లో ఎంత హడావుడి చేశాయో ఇంకా ఎవరూ మర్చిపోలేదు. వీటి వ్యామోహంలో పడి ఆ ఆటలు ఆది కాళ్ళూ చేతులూ విరగ్గొట్టుకున్నవారు ఎందరో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ అటువంటి గేమ్ ఒకటి యువకులు..పిల్లల జీవితాలతో ఆడుకుంటోంది.

Milk Crate Challenge: తల్లిదండ్రుల వెన్నులో వణుకు పుట్టిస్తున్న మరో ఆన్లైన్ గేమ్.. ఎందుకంటే..
Milk Crate Challenge Game
Follow us
KVD Varma

|

Updated on: Aug 30, 2021 | 4:29 PM

Milk Crate Challenge: గతంలో బ్లూ వేల్, మోమో వంటి గేమ్స్  నెట్టింట్లో ఎంత హడావుడి చేశాయో ఇంకా ఎవరూ మర్చిపోలేదు. వీటి వ్యామోహంలో పడి ఆ ఆటలు ఆది కాళ్ళూ చేతులూ విరగ్గొట్టుకున్నవారు ఎందరో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ అటువంటి గేమ్ ఒకటి యువకులు..పిల్లల జీవితాలతో ఆడుకుంటోంది. చూడటానికి చాలా ఈజీలా కనిపించే ఈ లైవ్ గేమ్ ఆడితే మాత్రం చుక్కలు చూపిస్తుంది. టిక్ టాక్ తీసుకొచ్చిన ఈ గేమ్ పేరు ‘మిల్క్ క్రేట్ ఛాలెంజ్’. ఈ గేమ్ ఆడుతూ వీడియోలు తీసుకుని దానిని టిక్ టాక్ లో అప్లోడ్ చేయడం ఈ గేమ్. ఈ గేమ్ ఆడుతున్న సందర్భంలో చాలా మందికి కాళ్ళూ చేతులూ విరిగిపోయాయి. అమెరికాలో ఈ గేమ్ బారిన పది ఎందరో ఇబ్బందుల పాలయ్యారు. ఈ నేపథ్యంలో ఈ గేమ్ పై వైద్యులు అక్కడ ఆందోళన వ్యక్తం చేయడంతో టిక్ టాక్ దీనిని బ్యాన్ చేసింది. కానీ, అప్పటికే జరగాల్సిన డేమేజి జరిగిపోయింది. ఎందుకంటే, ఈ గేమ్ ఆడటం మొదలు పెట్టినవారు తమ సాహసాన్ని రికార్డు చేసి (కాళ్ళూ చేతులూ విరిగినా సరే) దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో క్రమేపీ టిక్ టాక్ తో సంబంధం లేకుండా ఈ గేమ్ ప్రాచుర్యంలోకి వచ్చేసింది.

ఏమిటీ ”మిల్క్ క్రేట్ ఛాలెంజ్”

ముందే చెప్పినట్టు ఇది చాలా సింపుల్ గా కనిపించే కన్నింగ్ గేమ్. ఇందులో ఆడాలని అనుకునే ఔత్సాహికులు.. పాల పాకెట్ల క్రేట్స్ ఉంటాయి కదా వాటితో ఆడాల్సి ఉంటుంది. వాటిని పిరమిడ్ ఆకారంలో నిలబెట్టాలి. తరువాత ఒక వైపు నుంచి ఆ క్రేట్స్ మీద మెట్లు ఎక్కినట్టుగా ఎక్కి శిఖరంగా ఉన్న సింగిల్ క్రేట్ మీద నిలబడాలి. తరువాత అక్కడ నుంచి రెండో వైపుగా కిందికి దిగాలి. మధ్యలో ఎక్కడా క్రేట్స్ పడిపోకూడదు. అదేవిధంగా శిఖరం లాంటి క్రేట్ పై ఎంత సేపు నిలబడ్డారు అనేది కూడా కౌంట్ అవుతుంది. ఓస్ ఇంతేనా అనుకోకండి. పాల ప్యాకెట్ల క్రేట్ లు అంత స్ట్రాంగ్ గా ఏమీ ఉండవు. పైగా వీటికి ఎటువంటి సపోర్టు లేకుండా ఒకదానిమీద ఒకటి పెడతారు. దీంతో ఎక్కడం ప్రారంభించిన దగ్గర నుంచి రెండో వైపు దిగే లోపు ఏ క్షణమైనా కిందకు పడిపోయే అవకాశం ఉంటుంది. ఈ గేమ్ లో పాల్గొన్న వారిలో విజయం సాధించిన వారి సంఖ్యా చాలా.. చాలా స్వల్పం. నూటికి 95 మంది కిందపడిపోయిన వారే ఉన్నారు.

కిందకు పడిపోతున్న క్రమంలో ఆ క్రేట్ లు విరిగి వీరికి గుచ్చుకుని తీవ్రప్రమాదాల పాలైన వారు.. చావుకు దగ్గరగా వెళ్ళినవారు చాలా మందే ఉన్నారని అమెరికాలో వైద్యులు చెప్పారు. వారు ఈ గేమ్ బ్యాన్ చేయమని ఒకానొక పరిస్థితిలో టిక్ టాక్ ను వేడుకుంటూ ట్వీట్ లు కూడా చేశారు. అంటే ఈ గేమ్ ఎంత ప్రమాదకరమో చూడండి.

ఈ మిల్క్ క్రేట్ చాలెంజ్ గేమ్ మొదట ఎక్కడ ప్రారంభం అయింది అనడానికి సరైన ఆధారాలు లేవు. కానీ, దొరుకుతున్న సమాచారం ప్రకారం నో యువర్ మీ మేమ్ అనే వెబ్సైట్ లో జూన్ నెలలో ఈ గేమ్ సంబంధించిన వీడియో “గిల్ ఫాల్స్ ఆఫ్ 6 మిల్క్ క్రేట్స్” పేరుతో పోస్ట్ అయింది. తరువాత, ఆగస్టు 1 న, చికాగో నివాసి ఇద్దరు వ్యక్తులు మిల్క్ డబ్బాలపై నడుస్తున్న వీడియోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసారు. మిల్క్ క్రేట్ ఛాలెంజ్ అని పిలవబడే మొదటి వీడియోలు. దాదాపు రెండు వారాల తర్వాత, ఒహియోలోని కొలంబస్‌లో ఇద్దరు వ్యక్తులు వీడియోలను షేర్ చేశారు. వీరు సవాలు విఫలమైన వీడియోని టిక్‌టాక్‌లో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. అక్కడ ఒకే రోజులో 5 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.

అప్పటి నుండి, మిల్క్ క్రేట్ ఛాలెంజ్ దేశవ్యాప్తంగా కమ్యూనిటీలలో ఆవిష్కృతం అయింది. సోషల్ మీడియాలో షేర్ అయిన తరువాత.. మిలియన్ల మంది వీక్షించిన వీడియోలు గత వారంలో బహుళ ప్లాట్‌ఫారమ్‌లలో సవాలు ధోరణికి సహాయపడ్డాయి.

ఇప్పుడు ఈ గేమ్ పట్ల మనదేశంలోనూ భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఏ గేమ్స్ ఆడటం ద్వారా తమ పిల్లలు ఎక్కడ కాళ్ళూ చేతులూ విరగ్గొట్టుకుంటారో అని తల్లిదండ్రులు భయపడుతున్నారు. టిక్ టాక్ మనదేశంలో లేనప్పటికీ.. అది ఇప్పటికే ఈ గేమ్ ను రద్దు చేసినప్పటికీ.. ప్రపంచాన్ని అంతటినీ ఒక్కదగ్గర కట్టేసే సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ వీడియోలు వైరల్ గా మారడం వారి భయాందోళనలకు కారణం. ఇక్కడ ఇటువంటి వైపరీత్యం ప్రబలక ముందే ఈ గేమ్ పై ప్రభుత్వం నిషేధం విషేదిస్తే.. అటువంటి వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొట్టవని వారంటున్నారు.

Also Read: Afghanistan-Taliban: “తాలిబన్లను చూసి భయపడవద్దు”.. టీవీ యాంకర్ వెనుక నుంచి తుపాకులతో ముష్కరులు.. వైరల్‌‌గా మారిన వీడియో

New Zealand: ఫైజర్ వ్యాక్సిన్‌తో న్యూజిలాండ్‌లో తొలి మరణం.. అరుదైన సైడ్ ఎఫెక్ట్‌తో మహిళ మృతి

పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు