Gaddam Meghana: న్యూజిలాండ్‌లో తెలుగమ్మాయికి అరుదైన గౌరవం.. 18 ఏళ్లకే పార్లమెంట్‌ సభ్యురాలిగా ఎంపిక

|

Jan 16, 2022 | 1:18 PM

Gaddam Meghana:న్యూజిలాండ్‌లో తెలుగింటి అమ్మాయికి అరుదైన గౌరవం దక్కింది. ఏపీలోని ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన..

Gaddam Meghana: న్యూజిలాండ్‌లో తెలుగమ్మాయికి అరుదైన గౌరవం.. 18 ఏళ్లకే పార్లమెంట్‌ సభ్యురాలిగా ఎంపిక
Follow us on

Gaddam Meghana:న్యూజిలాండ్‌లో తెలుగింటి అమ్మాయికి అరుదైన గౌరవం దక్కింది. ఏపీలోని ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన మేఘన (18) న్యూజిలాండ్‌ దేశ యూత్‌ పార్లమెంట్‌ సభ్యురాలిగా ఎంపిక అయ్యారు. ఆ దేశ నామినేటెడ్‌ ఎంపీ పదవుల ఎంపిక జరిగింది. ఇందులో భాగంగా ‘సేవా కార్యక్రమాలు, యువత’ విభాగానికి ప్రాతినిధ్యం వహించే పార్లమెంట్‌ సభ్యురాలిగా మేఘన ఎంపికైంది. వాల్కటో ప్రాంతం నుంచి మేఘనకు ఈ నామినేటెడ్‌ పదవి దక్కింది. మేఘన తల్లిదండ్రులు న్యూజిలాండ్‌లోనే స్థిరపడ్డారు. ఆమె తండ్రి గడ్డం రవికుమార్‌ ఉద్యోగ రీత్యా 2001లో న్యూజిలాండ్‌కు వెళ్లారు. 21సంవత్సరాల కిందటనే భార్యతో న్యూజిలాండ్‌ వెళ్లిన రవికుమార్‌ అక్కడే స్థిరపడిపోయారు. ఇక అక్కడే పుట్టి పెరిగిన మేఘన కేంబ్రిడ్జిలోని సెయింట్‌ పీటర్స్‌ హైస్కూల్‌లో విద్యాభ్యాసం పూర్తి చేశారు.

మేఘన స్కూల్‌డేస్‌ నుంచే చారిటీ కార్యక్రమాలు సైతం చేపడుతున్నారు. తన స్నేహితులతో కలిసి విరాళాలు సేకరించి అనాథ శణాలయాలకు అందజేస్తున్నారు. అంతేకాకుండా వలస వచ్చిన ఇతర దేశాల శరణార్థులకు విద్య, ఆశ్రయం, ఇతర వసతులున కల్పించడంతో మేఘన ఎంతో ముందుంటున్నారు. దీంతో న్యూజిలాండ్‌ ప్రభుత్వం ఆమెను పార్లమెంట్‌ సభ్యురాలిగా ఎంపిక చేసింది. గత ఏడాది డిసెంబర్‌ 16న జరిగిన ఈ పార్లమెంట్‌ సభ్యురాలి ఎంపిక విషయాన్ని వాల్కటో ప్రాంత ప్రభుత్వ ఎంపీ టీమ్‌ నాన్‌ డమోలెస్‌ మేఘన కుటుంబానికి తెలిపారు. మేఘన ఫిబ్రవరిలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఇవి కూడా చదవండి:

Covid 19 Insurance: మీకు కరోనా వచ్చిందా..? హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ కావాలంటే మూడు నెలలు ఆగాల్సిందే..!

Budget 2022: కేంద్రం బ‌డ్జెట్‌ను ఎలా త‌యారు చేస్తుంది…? ఎలాంటి కసరత్తు ఉంటుంది..? ఎన్నో ఆసక్తికరమైన విషయాలు