Ancient City: ఆ దేశంలో వర్షాభావంతో ఎండిన పెద్ద నది.. బయల్పడిన 3,400 ఏళ్ల నాటి నగరం

|

Jun 07, 2022 | 10:33 AM

ఇరాక్ లోని ఓ ప్రాచీన నగరం బయల్పడింది. ఆ దేశంలో ఇటీవల తీవ్ర క్షామం ఏర్పడింది. వర్షాలు కురవకపోవడంతో టైగ్రిస్ వంటి పెద్ద నది కూడా ఎండిపోయింది.

Ancient City: ఆ దేశంలో వర్షాభావంతో ఎండిన పెద్ద నది.. బయల్పడిన 3,400 ఏళ్ల నాటి నగరం
Ancient City
Follow us on

Ancient City: నదుల ఒడ్డున సంస్కృతులు, సంప్రదాయాలు, నగరాలు వెలిసాయి. అయితే కాలగర్భంలో నదుల ఒడ్డున వెలసిన నగరాలు ఆ నదుల్లోనే కలిసిపోయినట్లు.. చరిత్రకారుల కథనం. అందుకు నిదర్శనంగా ఇప్పటికే అనేక ప్రాంతాల్లో నదులు ఎండిపోయినప్పుడు..  గ్రామాలు, నగరాలు బ్యప్పడుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి ఇరాక్‌లో చోటు చేసుకుంది. ఇరాక్ లోని ఓ ప్రాచీన నగరం బయల్పడింది. ఆ దేశంలో ఇటీవల తీవ్ర క్షామం ఏర్పడింది. వర్షాలు కురవకపోవడంతో టైగ్రిస్ వంటి పెద్ద నది కూడా ఎండిపోయింది. దేశంలోనే అతిపెద్ద జలాశయం కూడా నీరు లేక ఎండిపోయి భూమి బీటలు వారి దర్శనమిచ్చింది. జలాశయం అడుగుభాగంలో కట్టడాల అనవాళ్లు బయటపడ్డాయి. దీంతో జర్మనీ, కుర్తు పురావస్తు పరిశోధకులు తవ్వకాలు చేపట్టగా, కంచు యుగం నాటి నగరం ఆవిష్కృతమైంది.

కుర్దుల ప్రాబల్యం ఉండే కెమూన్ ప్రాంతంలో ఓ జలాశయం ఎండిపోగా, ఓ పురాతన నగరం ఆనవాళ్లు దర్శనమిచ్చాయి. దాదాపు 3,400 ఏళ్ల నాటి నగరం అని భావిస్తున్నారు. 1550 బీసీ నుంచి 1350 బీసీ వరకు విలసిల్లిన మిట్టానీ సామ్రాజ్యంలో ఈ నగరం కూడా ఒక భాగమై ఉంటుందని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిశోధనలో జర్మనీ ఫ్రీబర్గ్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ ఇవానా పుల్జిజ్ పాల్గొన్నారు. ఈ నగరం టైగ్రిస్ నదిని ఆధారంగా చేసుకుని నిర్మితమైందని వివరించారు. ప్రస్తుతం ఈశాన్య సిరియా భూభాగంలో ఉన్న మిట్టానీ సామ్రాజ్యంతో ఈ భూభాగాన్ని అనుసంధానం చేసే ప్రధాన నగరం ఇదే అయ్యుంటుందని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..