అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన ఓ వ్యాఖ్య అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఓ బాలికకు డేటింగ్ విషయంలో అధ్యక్షుడు ఇచ్చిన సలహాకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. జో బైడెన్ తాజాగా కాలిఫోర్నియాలోని ఇర్విన్ వ్యాలీ కమ్యూనిటీ కాలేజీలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బైడెన్‌తో కొందరు విద్యార్థులు సరదాగా ఫొటోలు తీసుకున్నారు. ఇదే సమయంలో తన ముందు నిల్చున్న ఓ బాలికతో బైడెన్ మాట్లాడుతూ డేటింగ్ విషయాన్ని ప్రస్తావించారు.
ఈ సందర్భంగా జో బైడెన్ మాట్లాడుతూ.. ‘నేను కూతుళ్లకు, మనవరాళ్లకు ఇదే సలహా ఇచ్చాను. నీకు 30 ఏళ్ల వయసు వచ్చే వరకు ఎవరితోనూ సీరియస్ రిలేషన్‌షిప్‌లోకి వెళ్లొద్దు’ అంటూ చెప్పుకొచ్చారు. దీంతో కాస్త అసౌకర్యానికి గురైన ఆ బాలిక బదులిస్తూ.. ‘ఓకే ఈ విషయాన్ని నేను మనసులో ఉంచుకుంటాను’ అంటూ సమాదానం ఇచ్చింది. ప్రస్తుతం ఈ సంభాషణకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
President Joe Biden grabs a young girl by the shoulder and tells her “no serious guys till your 30” as she looks back appearing uncomfortable, secret service appears to try to stop me from filming it after Biden spoke @ Irvine Valley Community College | @TPUSA @FrontlinesShow pic.twitter.com/BemRybWdBI
— Kalen D’Almeida (@fromkalen) October 15, 2022
అమెరికా అధ్యక్షుడి స్థానంలో ఉండి బైడెన్ ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశాడబ్బా అంటూ కొందరు కామెంట్లు పెడుతుండగా. మరికొందరు మాత్రం తన మనవరాలికి సలహా ఇస్తున్నట్లే ఇలా చెప్పుడొచ్చని స్పందిస్తున్నారు. అక్టోబర్ 15న పోస్ట్ చేసిన ఈ వీడియోకు లక్షల సంఖ్యలో వ్యూస్ వస్తున్నాయి. ఇప్పుడీ వీడియో తెగ ట్రెండ్ అవుతోంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..