Motorbike Rider Alex Harvill: ప్రపంచ రికార్డు కోసం కొంతమంది కఠిన ప్రయత్నాలు చేస్తుంటారు. వారి లక్ష్యాన్ని సాధించడం కోసం అనుక్షణం తపన పడుతుంటారు. ఈ ప్రయత్నంలో ప్రాణాలను సైతం పణంగా పెడతారు. గతంలో తన పేరుపై ఉన్న రికార్డ్‌లను చెరిపేసి.. మరో రికార్డును క్రియేట్ చేయాలనుకున్న 28 ఏళ్ల బైక్ జంపర్.. అమెరికా డేర్ డెవిల్.. అలెక్స్ హార్విల్ కన్నుమూశాడు. మోటార్ సైకిల్ జంప్ కోసం అలెక్స్ హార్విల్ గురువారం ఉదయం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ప్రమాదానికి గురై చనిపోయినట్లు వాషింగ్టన్ అధికారులు తెలిపారు.
అలెక్స్ హార్విల్ 2013లోనే 297 అడుగల దూరం బైక్ జంప్ చేసి ప్రపంచ రికార్డ్‌ను నెలకొల్పాడు. అయితే.. 2008లో రాబి మాడిసన్ పేరిట నమోదైన 351 అడుగుల ప్రపంచ రికార్డును బ్రేక్ చేసేందుకు అలెక్స్ ప్రయత్నించాడు. కానీ ఆ రికార్డ్ ను బ్రేక్ చేసేందుకు ప్రయత్నిస్తూ.. ప్రాక్టిస్ చేస్తున్న సందర్భంలో ప్రమాదవశాత్తు అలెక్స్ మరణించాడు. అలెక్స్ మోటార్ సైకిల్ దిగాల్సిన చోటు కంటే కాస్త ముందే లాండ్ కావడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో హార్విల్ హాండిల్ బార్ మీద నుంచి ఎగిరిడి దుర్మరణం చెందాడు.
హార్విల్ అనతి కాలంలోనే ఒక ప్రొఫెషనల్ మోటోక్రాస్ రేసర్‌గా పేరు సంపాదించుకున్నాడు. అతిని పేరున ఇప్పటికే రెండు మోటార్ సైకిల్ జంప్ రికార్డులు ఉన్నాయి.
Also Read: