AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Never Rains: ఈ గ్రామంలో ఎప్పుడు కూడా వర్షాలు కురియవు.. కారణం ఏంటో తెలుసా..?

కొన్ని ప్రాంతాలను చూస్తే ఆశ్చర్యం కలిగేలా ఉంటాయి. ఈ సమయంలో దేశంలోని అనేక ప్రాంతాలలో వర్షాలు కురుస్తున్నాయి. సాధారణంగా ఈ నెలలో ప్రజలు ఎండ వేడితో ఇబ్బందులు పడతారు. ప్రపంచంలో ఏడాది పొడవునా వర్షాలు కురిసే ప్రదేశాలు చాలా ఉన్నాయి. కానీ ఎప్పుడూ వర్షాలు కురియని గ్రామం కూడా ఉంది. ఈ విశిష్ట..

Subhash Goud
|

Updated on: May 07, 2023 | 8:00 AM

Share
కొన్ని ప్రాంతాలను చూస్తే ఆశ్చర్యం కలిగేలా ఉంటాయి. ఈ సమయంలో దేశంలోని అనేక ప్రాంతాలలో వర్షాలు కురుస్తున్నాయి. సాధారణంగా ఈ నెలలో ప్రజలు ఎండ వేడితో ఇబ్బందులు పడతారు. ప్రపంచంలో ఏడాది పొడవునా వర్షాలు కురిసే ప్రదేశాలు చాలా ఉన్నాయి. కానీ ఎప్పుడూ వర్షాలు కురియని గ్రామం కూడా ఉంది. ఈ విశిష్ట గ్రామం గురించి తెలుసుకుందాం...

1 / 5
యెమెన్ అరేబియా ద్వీపకల్పం నైరుతి మూలలో ఉన్న దేశం. ఇక్కడ సనా రాజధాని. ఈ నగరానికి పశ్చిమాన హర్జ్ ప్రాంతం ఉంది. ఇక్కడ అల్-హుతైబ్ అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో ఎప్పుడు కూడా వర్షాలు కురియవట. ఇక్కడ ఎప్పుడూ వర్షాలు పడనంత ప్రత్యేకత ఏంటని ఇప్పుడు మీకు ఆలోచన రావచ్చు.

2 / 5
నివేదికల ప్రకారం.. ఈ ప్రత్యేకమైన గ్రామం భూమి ఉపరితలం నుంచి దాదాపు 3200 మీటర్ల ఎత్తులో ఉంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, శీతాకాలంలో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. అయితే సూర్యుడు ఉదయించిన తరువాత ఇక్కడ నివసించే ప్రజల పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. ఎండ వేడిమికి ప్రజలు ఇబ్బంది పడతారు.

3 / 5
అయితే, దీని ప్రత్యేకత కారణంగా ఈ గ్రామం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అలాగే పర్యాటకులు తరచుగా ఇక్కడకు వస్తూ ఉంటారు. వారు ఇక్కడ చూడగలిగే దృశ్యం ప్రపంచంలో మరెక్కడా కనిపించదు. పర్వతాల పైభాగంలో నిర్మించిన ఇళ్లు గ్రామానికి అందాన్ని ఇనుమడింపజేస్తున్నాయి.

4 / 5
ఈ గ్రామంలో ఎప్పుడూ వర్షాలు పడకపోవడానికి కారణం ఈ గ్రామం మబ్బుల పైన ఉండడం. అటువంటి పరిస్థితిలో దిగువన మేఘాలు ఏర్పడతాయి. అక్కడ నుంచి భూమిపై వర్షాలు కురుస్తాయి. పై నుంచి వచ్చిన ప్రజలు ఎప్పుడూ వర్షాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. ఈ గ్రామంలో నివసించే ప్రజలు తరచూ దిగువకు వెళ్లినప్పటికీ, కొన్నిసార్లు వర్షాలు కురుస్తాయి.

5 / 5