Malawi Vice President Aircraft Missing: మలావీ ఉపాధ్యక్షుడు విమానం అదృశ్యం.. ముమ్మరంగా గాలింపు చర్యలు

ఇటీవల ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. సీ ప్రయాణించిన హెలికాప్టర్‌ను Bell 212 కనిపించకుండా పోయిన ఒక రోజు తర్వాత.. హెలికాఫ్టర్‌ కుప్పకూలిన విషయం వెలుగులోకి వచ్చింది. తాజాగా ఆఫ్రికా దేశమైన మలావీ ఉపాధ్యక్షుడు ప్రయాణిస్తున్న సైనిక విమానం కూడా ఇదే విధంగా అదృశ్యమైంది..

Malawi Vice President Aircraft Missing: మలావీ ఉపాధ్యక్షుడు విమానం అదృశ్యం.. ముమ్మరంగా గాలింపు చర్యలు
Malawi Vice President
Follow us

|

Updated on: Jun 11, 2024 | 12:07 PM

మలావీ, జూన్‌ 11: ఇటీవల ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. సీ ప్రయాణించిన హెలికాప్టర్‌ను Bell 212 కనిపించకుండా పోయిన ఒక రోజు తర్వాత.. హెలికాఫ్టర్‌ కుప్పకూలిన విషయం వెలుగులోకి వచ్చింది. తాజాగా ఆఫ్రికా దేశమైన మలావీ ఉపాధ్యక్షుడు ప్రయాణిస్తున్న సైనిక విమానం కూడా ఇదే విధంగా అదృశ్యమైంది. ఈ విషయాన్ని ఆ దేశాధ్యక్షుడు లాజరస్ చక్వేరా కార్యాలయం అధికారికంగా ధ్రువీకరించింది.

అదృశ్యమైన సైనిక విమానంలో మలావి వైస్ ప్రెసిడెంట్ సౌలోస్ చిలిమాతోపాటు.. మరో తొమ్మిది మంది వ్యక్తులు సోమవారం అదృశ్యమైన సైనిక విమానంలో ఉన్నారని అధ్యక్ష కార్యాలయం తన ప్రకటనలో వెల్లడించింది. సైనిక విమానం జాడ ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు వెల్లడించింది.

మలావీ ఉపాధ్యక్షుడు సావులోస్‌ చీలిమా ప్రయాణిస్తున్న విమానం దేశ రాజధాని లిలాంగ్వే నుంచి బయల్దేరింది. బయల్దేరిన 45 నిమిషాలకు రాజధానికి ఉత్తరాన దాదాపు 370 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎంజుజు అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. కానీ, ఆ సమయానికి అది అక్కడికి చేరుకోలేదు. పైగా విమానం రాడార్ నుంచి కమ్యునికేషన్‌ పూర్తిగా ఆగిపోయింది. విమానయాన అధికారులు దాంతో కాంటాక్ట్‌ కోల్పోయారు. సమాచారం అందుకున్న ఆ దేశ అధ్యక్షుడు చక్వేరా వెంటనే గాలింపు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆయన బహామాస్ పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.