Trump-Musk : కల చెదిరింది… కథ మారింది! నిన్నటి దాకా దోస్త్.. ఇప్పుడు దుష్మన్!!
ఐదేళ్ల వయసులోనే ట్రంప్ ఇరుగు-పొరుగు పిల్లలను కొట్టేవాడు. నియంత్రించలేని వికృత చేష్టలతో అల్లరి. అది భరించలేక.. వీధిలోని పిల్లలు, పేరెంట్స్ అంతా ట్రంప్‌ను బ్యాన్ చేశారు. దెబ్బకు బోర్డింగ్ స్కూళ్లో పడేయాల్సొచ్చింది. అయినా ఆగలేదు. బాలికలపై సోడా పోసేవాడు. ఇంకు చల్లేవాడు. చివరికి టీచర్ ముఖంపై నీళ్లు విసిరేశాడు. 8th క్లాస్‌లో ట్రంప్‌ను భరించలేని స్కూల్ మేనేజ్‌మెంట్ టీసీ ఇచ్చి పంపించేసింది. సినిమాల్లో దారిదోపిడీ చేస్తుంటారు కదా. అలా తానేందుకు చేయకూడదనుకుని... ఓ బటన్ నైఫ్ కొని.. దోపిడీకి ప్రయత్నించాడు ఈ ఆగర్భశ్రీమంతుడు. అప్పుడు ట్రంప్ వయసు 13 ఏళ్లు. ఇంట్లోనూ అంతే అన్నయ్య-అక్కలపైనే అజమాయిషీ. స్కూల్లో అందరికీ స్నేహితులుంటారు. ట్రంప్‌కు మాత్రం వాళ్లంతా బానిసలు, అనుచరులు. అలా ఉండేది వ్యవహారం. ఇప్పుడిదంతా దేనికి అంటారా. మస్క్ పోతూపోతూ ఓ బాంబ్ పేల్చారు ట్రంప్ మీద. అదే ఇప్పుడు అమెరికాను కుదిపేస్తోంది. ట్రంప్ మెంటాలిటీకి, మస్క్ ఆరోపణలకి లింక్ ఉన్నట్టు కనిపిస్తుంటుందా స్టోరీ. ఇంతకీ ఏంటా స్టోరీ?

ఎప్‌స్టీన్ ఫైల్స్. ఈ పదం బాగా వినిపిస్తోందిప్పుడు. మరికొన్నాళ్ల పాటు వినాల్సిందే దీన్ని. ఈ ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేరు ఉందంటున్నాడు ఇలన్ మస్క్. ఇంతకీ ఏంటది? జెఫ్రీ ఎప్‌స్టీన్ అని ఒక బాలల లైంగిక నేరస్తుడు ఉండేవాడు. ఈడు రాని ఆడపిల్లలు, యువతులను అక్రమంగా రవాణా చేసేవాడు. ఎంతోమంది అమ్మాయిలను లైంగికంగా వేధించాడు. అంతటితో ఆగకుండా.. జీవితంలో తాను మెట్లెక్కడం కోసం టాప్ పొలిటీషియన్స్, బిజినెస్‌మెన్, సెలబ్రిటీకు అమ్మాయిలను సప్లై చేసేవాడు. వాళ్లలో మైనర్లు కూడా ఉన్నారు. ఇక్కడ మైనర్లు అంటే.. బాలికలు అని మాత్రమే కాదు బాలలు కూడా. ఈ ఎప్‌స్టీన్‌కు కరీబియన్ దీవుల్లోనూ, న్యూయార్క్, ఫ్లోరిడా, న్యూ మెక్సికోలో ఫామ్‌హౌస్‌లు ఉన్నాయి. వీటిల్లోనే సొసైటీలోని పెద్దలకు ఆతిథ్యం ఇచ్చి, బాలలు, బాలికలు, అమ్మాయిలను ఆ పెద్దమనుషులకు అప్పగించి… వందల మంది జీవితాలను నాశనం చేశాడు. 2005లో ఓ బాలిక తల్లిదండ్రులు ఎప్‌స్టీన్‌పై కంప్లైంట్ ఇచ్చారు. తమ 14 ఏళ్ల కుమార్తెను లైంగికంగా వేధించాడని ఫ్లోరిడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎప్‌స్టీన్‌ను అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేశారు. బట్.. తాను ఆ ఒక్క బాలికపైనే కాదని.. 14 ఏళ్ల లోపు వయసున్న 36 మంది బాలికలను లైంగికంగా వేధించినట్లు ఒప్పుకున్నాడు. బట్… కేవలం రెండు నేరాలపై మాత్రమే విచారణలు జరిగి జస్ట్ 13 నెలల జైలు శిక్ష అనుభవించి బయటికొచ్చాడు. 2019లో బాలికలను అక్రమంగా రవాణా చేస్తున్నాడన్న...