Afghanistan: తాలిబన్ల రాజ్యంలో మహిళలపై పెచ్చుమీరుతున్న ఆక్షలు.. జిమ్, పార్కులకు రాకుండా నిషేధం

|

Nov 10, 2022 | 6:04 PM

తాలిబన్ల పాలనలో అఫ్ఘనిస్తాన్ మహిళల స్వేచ్ఛ నానాటికి కనుమరుగవుతోంది. పలు రకాల ఆంక్షలతో మహిళల హక్కులను హరించే విధంగా ప్రవర్తిస్తోంది ఆ దేశంలోని మత చాందసవాద ప్రభుత్వం.

Afghanistan: తాలిబన్ల రాజ్యంలో మహిళలపై పెచ్చుమీరుతున్న ఆక్షలు.. జిమ్, పార్కులకు రాకుండా నిషేధం
Taliban
Follow us on

తాలిబన్ల పాలనలో అఫ్ఘనిస్తాన్ మహిళల స్వేచ్ఛ  నానాటికి కనుమరుగవుతోంది. ముందుగా విద్యపై.. ఆ తర్వాత  ప్రయాణాలపై.. ఇప్పుడు మరో రకం ఆంక్షలతో మహిళల హక్కులను హరించే విధంగా ప్రవర్తిస్తోంది  ఆ దేశంలోని మత చాందసవాద ప్రభుత్వం. ఇకపై మహిళలు జిమ్, పార్కులకు వెళ్లడాన్ని నిషేధిస్తూ ఆ దేశ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మగ ఆడ అనే బేధం లేకుండా అందరూ ప్రవర్తించడమేనని, హిజాబ్ లేకుండా మహిళలు బయటకు వస్తున్నారని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అఫ్ఘనిస్తాన్ వైస్ అండ్ వర్చ్యూ శాఖ అధికార ప్రతినిధి మొహమ్మద్ అకేఫ్ మొహజెర్ తెలిపారు.

అఫ్ఘనిస్తాన్‌లో  తాలిబన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్కడి స్త్రీలు వారి ప్రాథమిక స్వేచ్ఛకు, హక్కులకు క్రమక్రమంగా దూరమవుతూ వచ్చారు. దేశాన్ని తమ వశం చేసుకున్న అనతి కాలంలోనే ఆరవ తరగతి తర్వాత ఆడపిల్లలకు విద్యను నిషేధించింది. ఆ వెంటనే మహిళలు ఒంటరి ప్రయాణాలు చేయకూడదని, మీడియా సంస్థలలో పనిచేయకూడదని ఆదేశించింది. ఇక స్త్రీలు బయటకు వెళ్లాలంటే బురఖా లేదా  ఇస్లామిక్ స్కార్ఫ్ తప్పనిసరి అనే నిబంధన తాలిబన్ల పాలన మొదలైన రోజు నుంచి క్రమం తప్పకుండా అమలులో ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..