Taliban-Kashmir: మాట మార్చిన కాలకేయులు.. రోజుకో మాట.. పూటకో డైలాగ్.. ఇప్పుడు కశ్మీర్‌పై ఇలా..

|

Sep 03, 2021 | 3:57 PM

కశ్మీర్‌పై తాలిబన్లు మరోసారి మాట మార్చారు. కశ్మీర్‌ ప్రజల తరపున పోరాడే హక్కు తమకు ఉందని తాలిబన్లు ప్రకటించారు. ప్రపంచంలో ముస్లింలు ఎక్కడ అణచివేతకు గురవుతున్నా అక్కడ తమ మద్దతు...

Taliban-Kashmir: మాట మార్చిన కాలకేయులు.. రోజుకో మాట.. పూటకో డైలాగ్.. ఇప్పుడు కశ్మీర్‌పై ఇలా..
Taliban Has Claimed That Th
Follow us on

కశ్మీర్‌పై తాలిబన్లు మరోసారి మాట మార్చారు. కశ్మీర్‌ ప్రజల తరపున పోరాడే హక్కు తమకు ఉందని తాలిబన్లు ప్రకటించారు. ప్రపంచంలో ముస్లింలు ఎక్కడ అణచివేతకు గురవుతున్నా అక్కడ తమ మద్దతు ఉటుందని తాలిబన్లు ప్రకటించారు. నిన్న మొన్నటిదాకా కశ్మీర్‌ వ్యవహారంలో జోక్యం చేసుకోమని చెప్పిన తాలిబన్లు సడెన్‌గా మాట మార్చారు. ప్రపంచవ్యాప్తంగా ముస్లిం ప్రజల హక్కులు కాపాడడానికి పోరాటం చేస్తామని తాలిబన్ల అధికార ప్రతినిధి సోహెల్‌ షహీన్‌ ప్రకటించారు. కాకపోతే ఏ దేశానికి వ్యతిరేకంగా పోరాటం చేసే ఉద్దేశ్యం తమకు లేదన్నారు. కశ్మీర్‌పై తాలిబన్లు పూటకోసారి మాట మార్చడం పలు అనుమానాలకు తావిస్తోంది. పాకిస్తాన్‌ ఐఎస్‌ఐ కుట్రలో భాగంగానే తాలిబన్లు ఈ డ్రామా ఆడుతున్నట్టు తెలుస్తోంది.

తాలిబన్ల తాజా స్టేట్‌మెంట్‌ తరువాత కశ్మీర్‌లో హైఅలర్ట్‌ ప్రకటించారు. ఆఫ్ఘనిస్తాన్‌ పరిణామాలను భారత్‌ నిశితంగా గమనిస్తోంది. తాలిబన్లను ఇప్పటివరకు కేంద్రం గుర్తించలేదు. కాకపోతే ఆఫ్ఘనిస్తాన్‌ను ఉగ్రవాదులకు అడ్డాగా మార్చవద్దని భారత్‌ ఇప్పటికే తాలిబన్లకు స్పష్టం చేసింది.. అంతేకాకుండా ఖతార్‌లో భారత రాయబారి దీపక్‌ మిట్టల్‌ తాలిబన్లతో జరిగిన సమావేశంలో దీనిపై గట్టి వార్నింగ్‌ ఇచ్చారు.

ఆదివారం ఆఫ్ఘన్‌లో తాలిబన్ల ప్రభుత్వం అధికారం చేపట్టే అవకాశాలున్నాయి. తాలిబన్‌ అగ్రనేతలంతా ఇప్పటికే కాబూల్‌ చేరుకున్నారు. సుప్రీం కౌన్సిల్‌ నేతృత్వంలో తాలిబన్‌ ప్రభుత్వం పనిచేసే అవకాశముంది. ముల్లా బరాదర్‌ నేతృత్వంలో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటు కానుంది.

ఇవి కూడా చదవండి: Pig Farming: బ్యాంక్ ఉద్యోగం వదిలి పెట్టాడు.. మెలకువలు నేర్చుకున్నాడు.. లక్షలు సంపాదిస్తున్నాడు.. ఇది ఎలా సాధ్యమైందో తెలుసా..