AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌ తీరుపై ఐక్యరాజ్య సమితి హర్షం.. ఏ విషయంలో మార్పు వచ్చిందంటే..

Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితులు మారుతున్నాయా? మహిళల పట్ల తాలిబన్‌లు ఎలాంటి వైఖరి అవలంభిస్తున్నారు? అక్కడి విద్యా సంస్థల్లో పరిస్థితి ఎలా ఉంది? అంటే

Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌ తీరుపై ఐక్యరాజ్య సమితి హర్షం.. ఏ విషయంలో మార్పు వచ్చిందంటే..
Shiva Prajapati
|

Updated on: Feb 03, 2022 | 7:59 AM

Share

Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితులు మారుతున్నాయా? మహిళల పట్ల తాలిబన్‌లు ఎలాంటి వైఖరి అవలంభిస్తున్నారు? అక్కడి విద్యా సంస్థల్లో పరిస్థితి ఎలా ఉంది? అంటే ఐక్యరాజ్యసమితి ప్రశంసించేలా ఉందట! తాలిబన్ల పాలనలో ఉన్న అఫ్గానిస్థాన్​లో తొలిసారిగా ప్రభుత్వ పరిధిలోని విశ్వవిద్యాలయాలు తెరుచుకున్నాయి. అంతేకాదు.. ఈ వర్సిటీల్లోకి మహిళలను అనుమతినిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. యూనివర్సిటీల్లోకి మహిళల అనుమతిపై తాలిబన్‌ల్లు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ప్రత్యేక ఏర్పాట్లతో మహిళలను వర్సిటీల్లోకి అనుమతిస్తున్నారు అక్కడి అధికారులు. ఆప్ఘనిస్తాన్‌ దేశంలోని అతిపెద్ద విశ్వవిద్యాలయమైన నంగర్హర్ వర్సిటీలో మహిళల ప్రవేశానికి ప్రత్యేక ద్వారం ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. పురుషులు, మహిళలకు వేరువేరు క్లాస్​రూమ్​లు ఉంటాయని, వర్సిటీ సమయాలు కూడా వేరుగా ఉంటాయని నంగర్హర్​విశ్వవిద్యాలయానికి చెందిన అధికారులు చెబుతున్నారు. అయితే, ఇది కొత్త విషయం కాదని, అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ నిబంధన అమల్లో ఉందని వెల్లడించారాయన.

ఐక్యరాజ్య సమితి హర్షం.. కాగా, మహిళలు వర్సిటీలకు వెళ్తున్నారన్న వార్తలపై హర్షం వ్యక్తం చేసింది ఐక్యరాజ్య సమితి. విద్యలో యువతకు సమాన హక్కులు లభించడం ఎంతో అవసరమని అభిప్రాయపడింది. గతేడాది ఆగస్టులో తాలిబన్ల తిరుగుబాటుతో అఫ్గాన్​లో ప్రజాస్వామ్య పాలనకు ముగింపు పడింది. అమెరికా సైన్యం హడావుడిగా వెనుదిరగడంతో అక్కడ తీవ్ర గందరగోళం నెలకొంది. అఫ్గాన్​లో నాటి దృశ్యాలను ప్రపంచ దేశాలు ఎన్నటికీ మర్చిపోలేవు. దేశాన్ని వీడేందుకు విశ్వప్రయత్నాలు చేశారు అక్కడి ప్రజలు. ఈ క్రమంలో అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. కఠినమైన ముస్లిం చట్టాలను అమలుచేయడంలో దిట్ట అని పేరున్న తాలిబన్లు.. అఫ్గాన్​ను ఆక్రమించుకోవడంతో అక్కడ ప్రజల హక్కులపై ఆందోళన నెలకొంది. ముఖ్యంగా గత పాలనలో మహిళలు, వారి చదువులపై ఆనేక ఆంక్షలు విధించారు తాలిబన్లు.

Also read:

Vanitha Vijaykumar: మా నాన్న నన్ను అడ్రస్ లేకుండా చేస్తానన్నారు.. నటి వనీతా షాకింగ్ కామెంట్స్..

AP Latest Jobs 2022: రూ.30 వేల జీతం..బీటెక్/ఎంటెక్ అర్హతతో ఐఐటీ తిరుపతిలో ఉద్యోగాలు.. వారం రోజుల్లో..

UP Elections 2022: జోరందుకున్న యూపీ ఎన్నికల ప్రచారం.. ప్రతిపక్ష పార్టీలపై అమిత్‌షా ఘాటు విమర్శలు..