Afghanistan Crisis: కాబూల్‌ ఎయిర్‌పోర్ట్‌పై రాకెట్లతో దాడికి ఉగ్రవాదుల యత్నం.. రాకెట్లను గాల్లోనే పేల్చేసిన సీ-ర్యామ్‌ వ్యవస్థ

|

Aug 30, 2021 | 9:47 AM

అమెరికా దాడులతో ఆఫ్ఘన్ దద్దరిల్లుతోంది. ఐసిస్-కె లక్ష్యంగా యూఎస్ ఆర్మీ వరుసగా డ్రోన్ అటాక్స్ చేస్తోంది. మరోవైపు, ఆఫ్ఘనిస్తాన్ లో ఐసిస్-కె చెలరేగిపోతోంది. ఆత్మాహుతి దాడితో వంద మంది ఆఫ్ఘన్లను 13మంది అమెరికన్ సైనికులను పొట్టనబెట్టుకుంది ఐసిస్-కె..

Afghanistan Crisis: కాబూల్‌ ఎయిర్‌పోర్ట్‌పై రాకెట్లతో దాడికి ఉగ్రవాదుల యత్నం.. రాకెట్లను గాల్లోనే పేల్చేసిన సీ-ర్యామ్‌ వ్యవస్థ
Rockets Heard Flying Over Kabul
Follow us on

Afghanistan Crisis: అమెరికా దాడులతో ఆఫ్ఘన్ దద్దరిల్లుతోంది. ఐసిస్-కె లక్ష్యంగా యూఎస్ ఆర్మీ వరుసగా డ్రోన్ అటాక్స్ చేస్తోంది. మరోవైపు, ఆఫ్ఘనిస్తాన్ లో ఐసిస్-కె చెలరేగిపోతోంది. ఆత్మాహుతి దాడితో వంద మంది ఆఫ్ఘన్లను 13మంది అమెరికన్ సైనికులను పొట్టనబెట్టుకున్న ఐసిస్-కె… వరుస దాడులకు పాల్పడుతోంది. ప్రధానంగా, యూఎస్ ఆర్మీ లక్ష్యంగా అటాక్స్ చేస్తోంది. ఈరోజు కూడా అమెరికా సైన్యం టార్గెట్ గా పెద్దఎత్తున రాకెట్లను ప్రయోగించింది. కాబుల్ ఎయిర్ పోర్ట్ లో యూఎస్ బేస్ లక్ష్యంగా ఐసిస్-కె అటాక్ చేసింది. అమెరికన్ ఆర్మీ, కాబూల్ ఎయిర్ పోర్ట్ టార్గెట్ గా రాకెట్లను వరుసగా ప్రయోగించింది. అయితే, అమెరికన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ వాటిని అడ్డుకుంది. ఐసిస్-కె ప్రయోగించిన రాకెట్లను గాల్లో పేల్చివేసింది.

ఐసిస్-కె… ఎక్కడ్నుంచి, ఏ వాహనం నుంచి రాకెట్లను ప్రయోగిస్తుందో గుర్తించి ఆ ప్రాంతంలో అమెరికన్ ఆర్మీ డ్రోన్స్ అటాక్స్ చేసింది. యూఎస్ ఆర్మీ ఎయిర్ స్ట్రైక్స్ లో ఐసిస్-కె స్థావరం ధ్వంసమైంది. పెద్దఎత్తున పేలుడు పదార్ధాలున్న ఐసిస్-కె డంప్ ను అమెరికా సైన్యం పేల్చివేసింది. కాబూల్ లాబ్ జార్ ఖైర్ఖానా క్రాస్ రోడ్స్ లోని ఖుర్షీద్ యూనివర్శిటీ ప్రాంతం నుంచి ఐసిస్-కె ఈ అటాక్స్ చేసింది. అమెరికా కౌంటర్ అటాక్ తో ఆ ప్రాంతమంతా ధ్వంసమైంది. కొన్ని భవనాలు ధ్వంసంకాగా, పెద్దఎత్తున వాహనాలు ధ్వంసమయ్యాయి. యూఎస్ ఆర్మీ డ్రోన్స్ అటాక్స్ లో ఇద్దరు ఐసిస్-కె కీలక ఉగ్రవాదులు హతమయ్యారు. ఐసిస్-కె ప్రయోగించిన రాకెట్లను యూఎస్ ఆర్మీ గాల్లోనే పేల్చివేసినప్పటికీ, రెండు మాత్రం సమీప టౌన్ షిప్స్ పై బ్లాస్ట్ అయ్యాయి. ఆర్య అండ్ ష్రాప్‌నెల్‌ టౌన్‌షిప్స్ పైభాగంలో పడ్డాయి. దాంతో, ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది.

ఒకవైపు తాలిబన్ల అరాచకం… మరోవైపు ఐసిస్-కె ఉగ్రవాదుల ఆత్మాహుతి అటాక్స్… ఇంకోవైపు అమెరికన్ ఆర్మీ ప్రతీకార దాడులతో ఆఫ్ఘన్ దద్దరిల్లుతోంది. తాలిబన్, ఐసిస్-కె, అమెరికన్ ఆర్మీ అటాక్స్ లో ఆఫ్ఘన్ ప్రజలే బలైపోతున్నారు. యూఎస్ ఆర్మీ డ్రోన్ అటాక్స్ ఆరుగురు పిల్లలు మరణించినట్లు అక్కడి మీడియా ప్రకటించింది. వాళ్ల మృతదేహాలు ముక్కలు ముక్కలుగా చిధ్రమైనట్లు దగ్గర్నుంచి చూసిన ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

మరోవైపు, ఆఫ్ఘనిస్తాన్ పై డ్రోన్ దాడి చేసిన అమెరికా, కాబూల్ ఆత్మహుతి దాడి పథకాన్ని రూపొందించిన ఉగ్రవాదిని మట్టుపెట్టింది. వాహనంలో వెళ్తున్న వ్యూహకర్తను గుర్తించిన అమెరికా డ్రోన్, అక్కడికక్కడే పేల్చివేసింది. ఈ విషయాన్ని అమెరికా సగర్వంగా ప్రకటించింది. అయితే, తాజా సమాచారం ప్రకారం అమెరికా డ్రోన్ పేలుళ్ళలో ఆరుగురు పిల్లలు బలైనట్లు తెలుస్తుంది. ఈ మేరకు సీఎన్ఎన్ లో వచ్చిన కథనం ప్రకారం, పేలుళ్లు జరిగిన ప్రాంతంలో ఒక కుటుంబం కూడా గాయపడిందని స్థానిక మీడియా పేర్కొంది. అందులో ఆరుగురు పిల్లలు ఉన్నారు. అలా చనిపోయిన వారిలో రెండు సంవత్సరాల పాప కూడా ఉందని సీఎన్ఎన్ ప్రచురించింది. పేలుళ్ళు జరిగిన ప్రాంతంలో ఉన్న వ్యక్తులు ఈ విషయాలను వెల్లడించినట్లు సమాచారం. ఆ పేలుళ్ళని నేను దగ్గర నుండి చూసాను. వాళ్ళంతా ముక్కలు ముక్కలు అయ్యారు. దాదాపు అయిదాగురు పడిపోయి ఉన్నారు. అందులో ఇద్దరు చిన్న పిల్లలు కూడా ఉన్నారు.. అని ఆహద్ వివరించినట్లు ఆఫ్ఘన్ నివేదించింది.


Read Also…  

TTD Meals: తిరుమల సంప్రదాయ భోజనంపై టీటీడీ ఛైర్మన్ సంచలన నిర్ణయం.. తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని వార్నింగ్!

Tata Punch: పండగ సీజన్‌లో ఎంట్రీ ఇవ్వనున్న టాటా పంచ్‌.. ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో మరికొన్ని కార్లు..