Afghan-Taliban: పంజ్‌షీర్‌లో కొనసాగుతున్న తాలిబన్ల నరమేధం.. కేర్‌ టేకర్‌ ప్రెసిడెంట్‌ అమ్రుల్లా సలేష్‌ సోదరుడిని కాల్చివేత!

|

Sep 10, 2021 | 7:07 PM

అఫ్గాన్‌ను హస్తగతం చేసుకొని.. అనంతరం పంజ్‌షీర్‌పై పంజా విసురుతున్నారు తాలిబన్లు. అక్కడ నరమేధం సృష్టిస్తున్నట్లు సమాచారం. తాజాగా ఇప్పటి వరకు పంజ్‌షీర్‌ కేర్‌ టేకర్‌ ప్రెసిడెంట్‌గా అమ్రుల్లా సలేష్‌ సోదరుడిని హతమార్చారు.

Afghan-Taliban: పంజ్‌షీర్‌లో కొనసాగుతున్న తాలిబన్ల నరమేధం.. కేర్‌ టేకర్‌ ప్రెసిడెంట్‌ అమ్రుల్లా సలేష్‌ సోదరుడిని కాల్చివేత!
Taliban
Follow us on

Afghanistan Crises: అఫ్గాన్‌ను హస్తగతం చేసుకొని.. అనంతరం పంజ్‌షీర్‌పై పంజా విసురుతున్నారు తాలిబన్లు. అక్కడ నరమేధం సృష్టిస్తున్నట్లు సమాచారం. తాజాగా ఇప్పటి వరకు పంజ్‌షీర్‌ కేర్‌ టేకర్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న అమ్రుల్లా సలేష్‌ సోదరుడిని హతమార్చారు. చిత్రహింసలకు గురి చేసి చంపేశారు. అమ్రుల్లా సలేహ్‌తో పాటు రొహుల్లా సలేహ్‌ కూడా గత కొంతకాలంగా తాలిబన్లపై పోరాడుతున్నాడు. దీంతో రొహుల్లా సలేహ్‌ను అతి కిరాతకంగా చంపేశారు తాలిబన్లు. నాలుగు రోజుల క్రితమే పంజ్ షీర్ ను కైవసం చేసుకున్నట్టు తాలిబన్లు ప్రకటించారు.. అప్పటి వరకూ కేర్ టేకర్ ప్రెసిడెంట్ గా ఉన్న అమ్రుల్లా సలేహ్ నాయకత్వంలో భీకర యుద్ధం జరిగింది. అయితే నాలుగు రోజుల క్రితమే సలేహ్‌ కమాండర్‌ను కాల్చి చంపారు తాలిబన్లు.. సలేహ్‌ ఇంటిని కూడా డ్రోన్లతో పేల్చివేశారు..

పంజ్‌షేర్‌ను కూడా తమ నియంత్రణలోకి తీసుకున్నామని ప్రకటించిన తాలిబన్లు.. అక్కడ ఇంటింటి తనిఖీలు చేపట్టి తమ వ్యతిరేకులను, మైనార్టీలను చంపేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే కాబుల్‌ను విడిచి పంజ్‌షేర్‌కు వెళ్లిన అఫ్గాన్‌ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్‌ సోదరుడు రోహుల్లా సలేహ్‌ను తాలిబన్లు హతమార్చినట్లు సమాచారం. మరోవైపు, కాల్పుల విరమణకు పిలుపునిచ్చాయి రెసిస్టెంట్‌ ఫోర్సెస్‌. శాంతియుత వాతావరణంలో తాలిబన్లతో చర్చలకు ఓకే చెప్పారు. దీంతో ఎప్పుడూ రక్తసిక్త వాతావరణంలో కనిపించే తాలిబన్ల అధ్యక్ష భవనంపై తెల్ల జెండా ఎగిరింది.

ఆగస్టు 15న తాలిబన్లు కాబుల్‌ను ఆక్రమించుకోవడంతో రెసిస్టెన్స్‌ ఫోర్సెస్‌ నాయకుడు అహ్మద్‌ మసూద్‌తో కలిసి అమ్రుల్లా సలేహ్‌ పంజ్‌షేర్‌కు వెళ్లిపోయారు. అనంతరం తనను తాను అఫ్గాన్‌ ఆపద్ధర్మ అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. అయితే, ప్రస్తుతం పంజ్‌షేర్‌లో ఉన్న అమ్రుల్లా సలేహ్‌ అన్న రోహుల్లా సలేహ్‌ను గుర్తించిన తాలిబన్లు ఆయనను కిరాతకంగా హత్య చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ ప్రాంతంలోని అమ్రుల్లా ఇంట్లోకి చొరబడిన తాలిబన్లు రోహుల్లాను కాల్చి చంపినట్లు సమాచారం.

పంజ్‌షేర్‌లోని పలు ప్రాంతాల్లో రెసిస్టెన్స్‌ ఫోర్సెస్‌, తాలిబన్లకు మధ్య భీకర పోరు సాగుతోంది. ఈ దాడుల్లో ఇరు వర్గాలకు చెందిన అనేక మంది ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి ప్రజలు పేర్కొంటున్నారు. వ్యాలీలోని పలు ప్రాంతాలను ఆక్రమించుకున్న తాలిబన్లు స్థానిక యువకులను అతి దారుణంగా చంపేస్తున్నారని, వీరి నరమేధానికి భయపడి ఇప్పటికే 100కు పైగా కుటుంబాలు పారిపోయాయని రెసిస్టెన్స్‌ ఫోర్స్‌ ప్రజలు ట్విటర్‌ వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ప్రపంచం ఎందుకు సాయం చేయడంలేదని ప్రశ్నిస్తున్నారు.

Read Also… Modi US Tour: ప్రధాని మోడీ అమెరికా పర్యటన ఖరారు.. బైడెన్‌తో కీలక భేటీ.. ఐక్యరాజ్య సమితిలో మోడీ ప్రసంగంపై ఉత్కంఠ