పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఎక్కడ..? ఆఫ్ఘనిస్థాన్ మీడియా కథనాల్లో నిజమెంత..?
ప్రస్తుతం రావల్పిండి జైలులో ఉన్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హత్య గురించి చర్చ తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ మద్దతుదారులు అడియాలా జైలు వైపు కదం తొక్కారు. ఈ విషయంపై పాకిస్తాన్ ఉగ్రవాద నిరోధక సంస్థ హై అలర్ట్ జారీ చేసింది.

ప్రస్తుతం రావల్పిండి జైలులో ఉన్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హత్య గురించి చర్చ తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ మద్దతుదారులు అడియాలా జైలు వైపు కదం తొక్కారు. ఈ విషయంపై పాకిస్తాన్ ఉగ్రవాద నిరోధక సంస్థ హై అలర్ట్ జారీ చేసింది.
అవినీతి ఆరోపణలపై 2023లో ఇమ్రాన్ ఖాన్ అరెస్టయ్యాడు. అప్పటి నుండి, అతను తన భార్య బుష్రా బీబీతో కలిసి అడియాలా జైలులో ఉన్నాడు. జైలులో తాను హత్యకు గురవుతుండవచ్చని ఇమ్రాన్ ఇటీవల భయాలు వ్యక్తం చేశాడు. జైలులో తనకు ఏదైనా జరిగితే, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ బాధ్యత వహిస్తారని ఆయన పేర్కొన్నారు.
మంగళవారం (నవంబర్ 25) రావల్పిండిలోని అడియాలా జైలు వెలుపల ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు ప్రదర్శన నిర్వహించారు. ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు. నిరసన తర్వాత, అతని స్వేచ్ఛ కోసం అందరూ ఐక్యంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఇమ్రాన్ ఖాన్‌ను కలవడానికి ఎవరికీ అనుమతి లేదని ఇమ్రాన్ సోదరి ఆలిమా అన్నారు. “మేము మూడు వారాలుగా మిలాఖత్ కోసం ఎదురు చూస్తున్నాము. మేము దరఖాస్తు చేసుకున్న ప్రతిసారీ, అది తిరస్కరణ గురవుతూనే ఉంది.” అని ఆమె తెలిపారు.
మీడియా సంస్థ ఆఫ్ఘనిస్తాన్ టైమ్స్, ఇమ్రాన్ ఖాన్ మరణ వార్తను మూలాలను ఉటంకిస్తూ ప్రచురించింది. ఈ వార్త సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించింది. పాకిస్తాన్ ప్రభుత్వం ఇంకా ఈ వార్తను ఖండించలేదు. జైలు అధికారులు కూడా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు.
ఇదిలావుంటే, స్థానిక మీడియా ప్రకారం.. “ఇమ్రాన్‌ను కలవడానికి ఎవరినీ అనుమతించడం లేదు. వైద్యులు లేదా న్యాయవాదులు అతన్ని చూడలేకపోతున్నారు. ఇమ్రాన్ కొన్ని వారాల క్రితం తన అనారోగ్యాన్ని ప్రకటించాడు. ఇది అతని మద్దతుదారులను ఆందోళనకు గురిచేసింది” అని పేర్కొన్నారు. గత ఏడు రోజులుగా జైలు లోపల ఇమ్రాన్ ఖాన్‌ను ఎవరూ చూడలేదు. బయటి వ్యక్తులు కూడా ఆయనను కలవడానికి అనుమతి లేదు. ఆయన మరణ పుకార్ల వెనుక ఇదొక కారణం.
పాకిస్తాన్ స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (స్పెషల్ ప్రొటెక్షన్ కమిటీ) రావల్పిండిని తమ ఆధీనంలోకి తీసుకోవాలని ఆదేశించింది. ఈ ఉత్తర్వు తర్వాత, ఏదో అనుమానాస్పదంగా ఉందని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అయితే, ఇమ్రాన్ ఖాన్ ఎక్కడ ఉన్నాడనే దానిపై జైలు యంత్రాంగం ఇంకా స్పందించలేదు. పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ నాయకుడు అబ్దుల్ సమద్ ప్రకారం, “ఇమ్రాన్ ఖాన్ రెండు వారాలుగా ఎవరితోనూ సంబంధాలు లేకుండా ఉన్నాడు. ఆందోళన చెందుతున్నాము. అతని గురించి మాకు ఎటువంటి వార్తలు అందడం లేదు” అని ఆయన చెప్పారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
