తాలిబన్లతో చర్చలు విఫలమైన పక్షంలో ఆఫ్ఘన్ ప్రభుత్వం భారత సైన్యం సాయాన్ని కోరవచ్చునని ఇండియాలో ఆ దేశ రాయబారి తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా సైనిక దళాల ఉపసంహరణ పూర్తి కావస్తోందన్నారు. దీంతో తాలిబన్లు మరింత విజృంభించి ముందుకు చొచ్చుకురావచ్చునని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం వారితో జరిపే చర్చలు విఫలమైతే మేం ఇండియన్ మిలిటరీ సాయాన్ని కొరవచ్చునని, కానీ ఇది ఆఫ్ఘన్ గడ్డపై వారు జరిపే పోరుమాదిరి ఉండదని ఫరీద్ మముంద్జే అనే ఆ రాయబారి స్పష్టం చేశారు.ఇది భారత సైనిక దళాలను పంపడం వంటిది కాదు.. కొన్ని చోట్ల ఆఫ్ఘన్ దళాలకు శిక్షణ ఇవ్వడం, సాంకేతిక సాయం రూపేణా ఇది ఉంటుంది అని ఆయన అన్నారు. దోహాలో ఆఫ్ఘన్ ప్రభుత్వ ప్రతినిధులు తాలిబన్లతో శాంతి చర్చలు జరుపుతున్నారని, కానీ ఇవి ఆశించిన [ఫలితాలను ఇవ్వడం లేదని ఏఎఫ్ పీ వార్తా సంస్థ పేర్కొంది. ఓ వైపు ఆఫ్ఘన్ లో అనేక జిల్లాలను తాలిబన్లు ఆక్రమించుకుంటూనే ఉన్నారని, ఈ నేపథ్యంలో ఈ చర్చలు సరిగా ముందుకు సాగడం లేదని ఈ సంస్థ తెలిపింది.
ఇవి విఫలమయ్యే సూచనలు కనిపిస్తున్నట్టు అభిప్రాయపడింది. తాలిబన్లు పూర్తి సైనిక విజయాన్ని సాధించేట్టుగా ఉందని పేర్కొంది. కాగా భారత దళం మా సైనికులకు సహకరిస్తూ తాలిబన్లతో యుద్ధం చేసే సమయం ఇంకా రాలేదని ఆఫ్ఘన్ రాయబారి అన్నారు. భారత వైమానిక దళ సాయం కూడా మాకు అవసరం కావచ్చు అని వ్యాఖ్యానించారు, ఇండియా మాకు మిలిటరీ ట్రెయినింగ్ ఇవ్వాలని కోరుతున్నాం అని చెప్పారు. ఈ దేశంలో తమ ఆఫ్ఘన్ విద్యార్థులు 20 వేలమందికి పైగా చదువుకుంటున్నారని, భారత ప్రభుత్వం వారికీ స్కాలర్ షిప్ లు ఇస్తోందని ఆయన పేర్కొన్నారు. మళ్ళీ ఆఫ్ఘన్ లోని తాజా పరిణామాలను వివరిస్తూ.. తమ దేశంలో పరిస్థితి జటిలంగా ఉందని, సుమారు 150 జిల్లాల్లో తాలిబన్లతో ప్రభుత్వ దళాలు పోరాడుతున్నాయన్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి : సెకండ్ ఇన్నింగ్స్ లో చిరు జోరు.. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మెగాస్టార్..Megastar Chiranjeevi Video.
Samsung Galaxy Video: అదిరిపోయే ఫీచర్లతో కొత్త డివైజ్‌లను విడుదల చేయనున్న సామ్‌సంగ్..(వీడియో).
థర్డ్ వేవ్ షురూ.. మహారాష్ట్ర లో మళ్ళీ పుంజుకుంటున్న కోవిడ్ కేసులు..:Third Wave Of Corona Video.