Afghanistan Crisis: ఆప్ఘనిస్థాన్‌లో తాలిబన్ల అరాచకం కొనసాగుతోంది. గత పాలనను గుర్తు చేస్తూ తమ విధాన నిర్ణయాలను ప్రకటిస్తున్నారు. మహిళల పట్ల వివక్ష ఉండదంటూనే.. ఆంక్షల పరంపర కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా తాలిబన్లు కీలక ప్రకటన చేశారు. ఆ మేరకు తొలి ఫత్వారీ జారీ చేశారు. ఇంతకీ ఆ ఫత్వాలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల హింసాకాండ కొనసాగుతూనే ఉంది. దేశాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్లు.. మహిళను అన్ని విధాలుగా అణచివేస్తున్నారు. తాజాగా తొలి ఫత్వా జారీ చేసింది. హెరాత్ ప్రావిన్స్‌లోని పాఠశాలలు, యూనివర్సిటీల్లో కోఎడ్యుకేషన్‌ను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. సమాజంలో అన్ని అనర్థాలకు కోఎడ్యుకేషనే కారణమని, అందుకే దీన్ని నిషేధిస్తున్నామని తాలిబన్లు అనౌన్స్ చేశారు. పలువురు ప్రొఫెసర్లు, ప్రైవేటు కాలేజీల అధిపతులతో చర్చించిన అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నామని తాలిబన్ వర్గాలు వెల్లడించాయని ఖామా ప్రెస్ ఏజెన్సీ తెలిపింది. కాగా, ఆఫ్గనిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్న అనంతరం తాలిబన్లు జారీ చేసిన తొలి ఫత్వా ఇదే!
ఆఫ్గనిస్తాన్‌లో ఉన్నత విద్యపై తాలిబన్ ప్రతినిధి ముల్లా ఫరీద్ మూడుగంటలు ఈ చర్చలు జరిపారు. కోఎడ్యూకేషన్‌కు ప్రత్యామ్నాయం లేదని, దీన్ని నిలిపివేయడమే మార్గమని అభిప్రాయపడ్డారు. అలాగే మహిళా ఉపాధ్యాయులు కేవలం మహిళా విద్యార్థులకే బోధించాలని, మగ విద్యార్థులకు బోధించకూడదని ఆదేశించారు. పౌర పాలనలో అఫ్గాన్ ప్రభుత్వాలు పలు యూనివర్సిటీలు, కాలేజీలు, పాఠశాలలు స్థాపించి కోఎడ్యూకేషన్‌ను ప్రోత్సహించాయి.
కాగా, తాలిబన్ల తాజా నిర్ణయంతో ప్రైవేట్ విద్యాసంస్థలకు ఇబ్బందులు తప్పవని నిపుణులు భావిస్తున్నారు. అధికారుల లెక్కల ప్రకారం దేశంలోని వివిధ యూనివర్సిటీలు, కాలేజీల్లో సుమారు 40 వేల మంది విద్యార్థులు, 2వేల మంది బోధనా సిబ్బంది ఉన్నారు. షరియా చట్టం కింద మహిళా హక్కులు గౌరవిస్తామని ఇటీవల తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ అట్టహాసంగా ప్రకటించారు. అయితే ఆమాటలు నీటి మూటలే అని నిరూపిస్తూ.. గతంలో అనుసరించిన విధానాలనే తాలిబన్లు కొనసాగించేందుకు నిర్ణయించుకున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
Also read:
Viral Photo: చిన్ననాటి జ్ఞాపకాలకు తట్టి లేపిన ఆనంద్ మహీంద్రా.. ఫిదా అయిపోతున్న నెటిజన్లు..
Coronavirus: విజృంభిస్తోన్న డెల్టా ప్లస్ వేరియంట్.. వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ అటాక్..