AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Love Proposal: ఇలా ప్రపోజ్‌ చేస్తే ఎంతటివారైనా ఫిదా అవ్వాల్సిందే.. ఆకట్టుకుంటున్న వీడియో..

అమ్మాయి అబ్బాయిల మధ్య ఏర్పడిన పరిచయం కొన్ని సార్లు ప్రేమకు దారి తీస్తుంది. అయితే తమ ప్రేమను ఎదుటి వాళ్లకు ఎలా చెప్పాలో తెలియక కొందరు, చెబితే ఏమనుకుంటారోననే డౌట్ తో మరికొందరు లవ్ ప్రపోజ్..

Love Proposal: ఇలా ప్రపోజ్‌ చేస్తే ఎంతటివారైనా ఫిదా అవ్వాల్సిందే.. ఆకట్టుకుంటున్న వీడియో..
Love Proposal Video
Ganesh Mudavath
|

Updated on: Oct 22, 2022 | 9:55 PM

Share

అమ్మాయి అబ్బాయిల మధ్య ఏర్పడిన పరిచయం కొన్ని సార్లు ప్రేమకు దారి తీస్తుంది. అయితే తమ ప్రేమను ఎదుటి వాళ్లకు ఎలా చెప్పాలో తెలియక కొందరు, చెబితే ఏమనుకుంటారోననే డౌట్ తో మరికొందరు లవ్ ప్రపోజ్ చేసేందుకు వెనకడుగు వేస్తుంటారు. ఒక వేళ ధైర్యం చేసి ప్రపోజ్ చేస్తే ఎదుటి వారు ఒప్పుకుంటారో లేదోననే డౌట్. ఇలా ప్రేమను చెప్పలేక, ప్రేమను చంపుకోలేక ఉక్కిరిబిక్కిరి అయ్యే ప్రేమికులు ఎందరో. కానీ ఓ యువకుడు మాత్రం తాను ప్రేమించిన యువతికి ఎలాగోలా ధైర్యం చేశాడు. ఎవరూ చేయని విధంగా సినిమాటిక్ స్టైల్ లో ప్రపోజ్ చేశాడు. సాధారణంగా ఎవరైనా ప్రపోజ్ చేయాలనుకుంటే. పూలబొకే ఇవ్వడమో, గిఫ్ట్ కొనివ్వడమో వంటివి చేస్తారు. కానీ.. ఇక్కడ ఓ యువకుడు మాత్రం ఓ అమ్మాయికి తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా ఎంతో అందంగా ప్రపోజ్‌ చేశాడు. అందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఈ రేంజ్‌లో ప్రపోజ్‌ చేస్తే ఎందుకు ఒప్పుకోరు బాస్‌.. సూపర్‌.. బట్‌ బీ కేర్‌ఫుల్‌.. చివరి వరకూ అలానే మెయింటెయిన్‌ చేయాల్సి వస్తుందేమో.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ యువకుడు సినిమా రేంజ్‌లో ఈఫిల్‌ టవర్‌ ఎదుట, బీచ్‌ ఒడ్డున అమ్మాయికి ప్రపోజ్ చేశాడు. తనను పెళ్లి చేసుకోవాలని అభ్యర్థించాడు. “మ్యారీ మీ” అని పూలతో నేల మీద అందంగా రాశాడు. గులాబీ రేకులు కొవ్వొత్తులతోఎంతో రొమాంటిక్‌గా సెటప్ చేసాడు. అంతేనా అతని ప్రపోజల్‌ను స్వీకరించిన ఆ అమ్మాయి అతనితో కలిసి షారుక్‌ ఖాన్‌ పాట కోయీ మిల్‌ గయాకి అనే పాటకు తమదైన స్టైల్లో స్పెప్పులేస్తూ ఒకరినొకరు తమ అంగీకారాన్ని తెలుపుకున్నారు. సిటీ ఆఫ్ లవ్‌లో ఈ భారతీయ జంట ప్రపోజ్ చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

బాలీవుడ్‌ సినిమా రేంజ్‌లో అతడు ప్రపోజ్‌ చేసిన విధానం నెటిజన్లను బాగా ఆకర్షిస్తోంది. అనంతరం ఆ యువకుడు డైమండ్ రింగ్‌ తొడిగాడు. అంతే.. ఆమె అతని ప్రేమకి ఓకే చెప్పేసింది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను 30 లక్షలమందికి పైగా చూశారు. వేల సంఖ్యలో లైక్‌ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.

Follow Us
వాహనదారులకు గుడ్‌న్యూస్.. అందుబాటులోకి మరో ఎక్స్‌ప్రేస్‌వే
వాహనదారులకు గుడ్‌న్యూస్.. అందుబాటులోకి మరో ఎక్స్‌ప్రేస్‌వే
తెలుగు కుర్రాళ్ల కలల రాణి.. MBA కోసం సినిమాలు వదిలేసింది..
తెలుగు కుర్రాళ్ల కలల రాణి.. MBA కోసం సినిమాలు వదిలేసింది..
వీరు జాగ్రత్తగా ఉండకపోతే సంపాదించింది మొత్తం గాల్లోకే..
వీరు జాగ్రత్తగా ఉండకపోతే సంపాదించింది మొత్తం గాల్లోకే..
ఈ 4 రాశులకు వరంలా లక్ష్మీ నారాయణ యోగం.. డబ్బు, విజయాలు, విలాస..
ఈ 4 రాశులకు వరంలా లక్ష్మీ నారాయణ యోగం.. డబ్బు, విజయాలు, విలాస..
వారానికి 2 కిలోల బరువు తగ్గాలా..? ఈ చిట్కాలు పాటిస్తే రిజల్ట్..
వారానికి 2 కిలోల బరువు తగ్గాలా..? ఈ చిట్కాలు పాటిస్తే రిజల్ట్..
Video: ప్లీజ్, అతని బ్యాంక్ అకౌంట్ చెక్ చేయండి..
Video: ప్లీజ్, అతని బ్యాంక్ అకౌంట్ చెక్ చేయండి..
నిరుద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఉచితంగా బ్యాంక్ కోచింగ్..
నిరుద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఉచితంగా బ్యాంక్ కోచింగ్..
భూమిపై చివరి నగరం ఇదే.. ఈ సిటీ దాటితే ఏముంటుందో తెలుసా?
భూమిపై చివరి నగరం ఇదే.. ఈ సిటీ దాటితే ఏముంటుందో తెలుసా?
2025లో అట్టర్ ప్లాప్ అయిన సినిమా.. ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్..
2025లో అట్టర్ ప్లాప్ అయిన సినిమా.. ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్..
పెసరపప్పు కోయగూర తింటే మోకాళ్ళు, నడుము నొప్పులు పూర్తిగా మాయం
పెసరపప్పు కోయగూర తింటే మోకాళ్ళు, నడుము నొప్పులు పూర్తిగా మాయం