85 Year Old Grandma: ఈ 85 ఏళ్ల బామ్మగారికి ఫన్నీగా ప్రేమించడానికి 36 ఏళ్ల యువకుడు కావాలట ..

85 Year Old Grandma: రెండు హృదయాలను కలిపి.. ఇరువుని ఓ బంధంలో బంధించి ఉంచే ప్రేమకు ప్రేమించడానికి వయసుతో పని ఏముంది. ఎంత వయసు వచ్చినా ప్రేమించవచ్చు..

85 Year Old Grandma: ఈ 85 ఏళ్ల బామ్మగారికి ఫన్నీగా ప్రేమించడానికి 36 ఏళ్ల యువకుడు కావాలట ..
Old Grandma

Edited By: Surya Kala

Updated on: Jul 11, 2021 | 8:57 PM

85 Year Old Grandma: రెండు హృదయాలను కలిపి.. ఇరువుని ఓ బంధంలో బంధించి ఉంచే ప్రేమకు ప్రేమించడానికి వయసుతో పని ఏముంది. ఎంత వయసు వచ్చినా ప్రేమించవచ్చు అంటుంది ఈ 85 ఏళ్ల బామ్మ. అంతేకాదు.. ఇప్పుడే బ్రేకప్ చెప్పిన ఈ బామ్మ కొత్త ప్రియుడి కోసం అన్వేషిస్తోంది.

అమెరికాలోని న్యూ యార్క్ లో నివసిస్తున్న హట్టి రెట్రోజ్ అనే ఈ బామ్మ ఇటీవలే తన 39 ఏళ్ల ప్రియుడికి గుడ్ బై చెప్పేసింది. అంతేకాదు.. కొత్త ప్రియుడికి కోసం వెదుకులాట మొదలు పెట్టింది. హట్టి రెట్రోజ్ అనే ఈ బామ్మ 48 ఏళ్ల వయస్సులో భర్త నుంచి విడాకులు తీసుకుంది. మొదట్లో డ్యాన్సర్ గా పనిచేసిన బామ్మ ఇప్పుడు లైఫ్ కోచ్, రచయితగా పనిచేస్తోంది. ప్రస్తుతం ఇద్దరు పిల్లలు, ముగ్గురు మనవలు ఉన్నారు.

విడాకులు తీసుకున్న తర్వాత పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేకపోవడంతో అప్పటి నుంచి తనకంటే తక్కువ వయసున్న యువకులతో డేటింగ్ చేస్తూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ వచ్చింది. ఇటీవల కొత్త బాయ్ ఫ్రెండ్ కోసం వెదుకుతూ.. నాకు నా లైఫ్ స్టైల్ ఎంతో నచ్చుతుంది. అందుకని నా శృంగార జీవితాన్ని తక్కువ వయసున్న యువకులతో ఎంజాయ్ చేస్తా.. వారికీ కూడా నాలో అదే నచ్చుతుంది అంటూ ఓ బోల్డ్ స్టేట్మెంట్ తో అందరికీ షాక్ ఇచ్చింది.

అంతేకాదు తాజాగా తనకు డేటింగ్ చేసేందుకు 35 ఏళ్ల లోపు యువకుడు కావాలని ఓ ప్రకటన ఇచ్చింది. ఈ బామ్మగారితో డేటింగ్ చేయడానికి భారీ సంఖ్యలో యువకులు రిక్వెస్టులు పెడుతున్నారు. లేటు వయస్సులో ఘాటు ప్రేమను పంచేందుకు సిద్ధంగా ఉన్నానంటూ పలు టీవీ ఛానల్స్ లో ప్రోగ్రామ్స్ ఇస్తున్న ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తోంది.

Also Read:  ఐశ్వర్యం, ఆనందం మీ సొంతం కావాలంటే దేవుడికి అన్నాన్ని ఇలా నైవేద్యంగా పెట్టండి