కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చినది మొదలు.. ప్రపంచ వ్యాప్తంగా అనేక సమస్యలు మొదలయ్యాయి. కొన్ని సమస్యలు దీర్ఘకాలికంగా ఉన్నాయి . ఈ అంటువ్యాధి ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో అక్కడక్కడగా వెలుగులోకి వస్తూనే ఉంది. ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ఇక సాధారణ అనారోగ్యంతో బాధపడేవారి కోసం కొన్ని ఆసుపత్రులు మాత్రమే పనిచేస్తున్నాయి. దీంతో సాధారణ వ్యాధుల నిర్వాణకు ఇచ్చే అనేక వ్యాక్సిన్లు పిల్లలు అందలేదని. చెబుతున్నారు. దీంతో చిన్నారులు పోలియోవంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..
సాధారణ చికిత్సని అందిస్తున్న ఆస్పత్రులు తక్కువ అవుతున్న నేపథ్యంలో తీవ్రమైన వ్యాధులతో సతమతమవుతున్న చిన్నారులకు కూడా రొటీన్ వ్యాక్సిన్ అందడం లేదని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా 6.7 కోట్ల మంది చిన్నారులు పోలియో వంటి తీవ్రమైన వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని యునిసెఫ్ పేర్కొంది. పిల్లలను, వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షించే సంస్థ UNICEF, 2019-21 మధ్య, 67 మిలియన్ల అంటే 67 మిలియన్ల పిల్లలకు సాధారణ మోతాదుల వ్యాక్సిన్‌లు ఇవ్వలేదని ఐక్యరాజ్యసమితిలో చెప్పింది. దీంతో ఎక్కువ మంది చిన్నారులు తీవ్రమైన వ్యాధులబారిపడే అవకాశానికి చాలా దగ్గరగా ఉన్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
పిల్లల్లో కలరా, మీజిల్స్ , పోలియో వచ్చే ప్రమాదం ఉంది
చిన్నారులకు త్వరలో టీకాలు వేయించాలని.. తద్వారా తీవ్రమైన వ్యాధులకు వ్యతిరేకంగా వారిలో రోగనిరోధక శక్తి ఏర్పడుతుందని యునిసెఫ్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది పిల్లలకు సాధారణ వ్యాక్సిన్లు ఇవ్వబడ్డాయి, అయితే టీకా ఇవ్వలేని పిల్లలు భారీ సంఖ్యలో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఐదుగురు పిల్లలలో ఒకరికి మాత్రమే జీరో-డోస్ లేదా పాక్షికంగా టీకాలు వేయబడ్డాయని తెలిపారు. 2008 తర్వాత ఇంత భారీ సంఖ్యలో పిల్లలకు టీకాలు వేయకపోవడం ఇదే తొలిసారని వెల్లడించారు.
భారతదేశంలో 27 లక్షల మంది పిల్లలకు..
కరోనా మహమ్మారికి వెలుగులోకి రావడానికి ముందు భారతదేశంలో జీరో-డోస్ పిల్లల సంఖ్య 1.3 మిలియన్లు అంటే 13 లక్షలు ఉండగా.. వీరి సంఖ్య 2021లో 2.7 మిలియన్లకు అంటే 27 లక్షలకు పెరిగింది. జీరో-డోస్ పిల్లలు అంటే మొదటి డిఫ్తీరియా పెర్టుసిస్ టెటానస్ వ్యాక్సిన్ (DTP1) తీసుకోని వారు. పాక్షికంగా టీకాలు వేసిన పిల్లలు అంటే ఒక డోస్, లేదా రెండు డోస్‌లు తీసుకున్నా మూడో డోస్ తీసుకొని వారు. UNICEF ప్రకారం వ్యాక్సిన్ మోతాదు తీసుకోకపోవడం వల్ల పిల్లలలో కలరా, మీజిల్స్ , పోలియో వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
అసమానత, పేదరికం , వెనుకబడిన వర్గాల పిల్లలు
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, టీకాలు తీసుకొని పిల్లలు ఎక్కువమంది పేదరికం, వెనుకబడిన వర్గాల వారే అధికం. టీకాలు వేయని నలుగురు పిల్లలలో ముగ్గురు (జీరో-డోస్ పిల్లలు) 20 దేశాలకు చెందినవారు. వారు మారుమూల గ్రామీణ ప్రాంతాలు, పట్టణ మురికివాడలు, సంక్షోభ ప్రాంతాలు, వలసలు, శరణార్థ సంఘాలలో నివసిస్తున్నారు. ఈ చిన్నారులకు త్వరలో టీకాలు వేయాలని పలు దేశాలకు యునిసెఫ్ విజ్ఞప్తి చేసింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..