Burkina Faso: బుర్కినా ఫాసోలో ఊచకోత.. సైనిక దూస్తుల్లో వచ్చిన దుండగులు

|

Apr 25, 2023 | 11:16 AM

ప్రపంచంలో తీవ్రవాదుల దాడులు రోజురోజుకు పెచ్చరిల్లుతున్నాయి. తాజాగా బుర్కినా ఫాసో అనే దేశంలో 60 మంది పౌరులు హతమార్చడం కలకలం రేపుతోంది. శుక్రవారం రోజున ఆ దేశానికి చెందిన సైనిక యూనిఫామ్ లు వేసుకుని కొంత మంది దుండగులు ఉత్తర బూర్కినా ఫాసోలోని యాటెంగా ప్రావిన్స్‌లో ఉన్న కర్మ గ్రామంలో కాల్పులు జరిపారు.

Burkina Faso: బుర్కినా ఫాసోలో ఊచకోత.. సైనిక దూస్తుల్లో వచ్చిన దుండగులు
Militants
Follow us on

ప్రపంచంలో తీవ్రవాదుల దాడులు రోజురోజుకు పెచ్చరిల్లుతున్నాయి. తాజాగా బుర్కినా ఫాసో అనే దేశంలో 60 మంది పౌరులు హతమార్చడం కలకలం రేపుతోంది. శుక్రవారం రోజున ఆ దేశానికి చెందిన సైనిక యూనిఫామ్ లు వేసుకుని కొంత మంది దుండగులు ఉత్తర బూర్కినా ఫాసోలోని యాటెంగా ప్రావిన్స్‌లో ఉన్న కర్మ గ్రామంలో కాల్పులు జరిపారు. ఈ దుర్ఘటనలో దాదాపు 60 మంది చనిపోయినట్లు అధికారులు ఆదివారం వెల్లడించారు. తీవ్రవాద సంస్థలైన అల్ ఖైదా, ఐఎస్ఐఎస్ లకు చెందిన కొంతమంది జిహాదీలు అక్రమంగా ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని.. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

అలాగే ఏప్రిల్ 15న నార్త్ బుర్కినా ఫాసోలోని అదే ప్రాంతంలో ఒవాంగియా సమీపంలో గుర్తు తెలియని దుండగులు సైనిక, స్వచ్ఛంద దళాలలపై దాడులు చేశారు. ఈ దుర్ఘటనలో 40 మంది చనిపోగా 33 మంది గాయపడ్డారు. గతంలో రాష్ట్ర భద్రత దళాలు, స్వచ్ఛంద భద్రత దళాలు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కార్యకలపాలు నిర్వహించగా 2022 నుంచి పౌరులపై సాయుధ దాడులు పెరిగాయని హ్యూమన్ రైట్స్ వాచ్ అధికారులు తెలిపారు. 2012 లో మాలి దేశంలో ఈ ఉగ్రవాద దాడులు మొదలయ్యాయి. ఆ తర్వాత దాడులు బుర్కినా ఫాసో, నైజర్ ప్రాంతాలకు వ్యాపించాయి. ఈ ఘటనల వల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 25 లక్షల మంది వేరే ప్రాంతాలకు తరలివెళ్లారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..